థియేటర్ కంటే ఖరీదైన Samsung Wall TV రిలీజ్... ధర చాలా ఎక్కువ

|

శామ్సంగ్ కంపెనీ టీవీలను తయారుచేయడానికి పెట్టింది పేరు. ఈ సంస్థ నుండి వచ్చిన ప్రతి స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇప్పుడు శామ్సంగ్ ఖరీదైన వాల్ టీవీలను విడుదల చేసింది. 100-ఇంచ్ లకు పైన ఉన్న మూడు రకాల టీవీ లను వివిధ రకాల డెఫినిషన్ లతో 3.5 కోట్ల రూపాయల ప్రారంభ ధర వద్ద వీటిని లాంచ్ చేసింది.

 

శామ్సంగ్

శామ్సంగ్ 0.8mm పిక్సెల్ పిచ్ టెక్నాలజీతో మాడ్యులర్ మైక్రోLED డిస్‌ప్లే కలిగిన వాల్‌ టీవీను ఇప్పుడు విడుదల చేసింది. ఇది డిస్ప్లేల పరంగా మూడు పరిమాణాలలో లభిస్తుంది. ఇందులో 4K డెఫినిషన్ తో 146-inch (370.8 సెం.మీ), 6K డెఫినిషన్ తో 219-inch (556.3 సెం.మీ) మరియు 8K డెఫినిషన్ తో 292-inch (741.7 సెం.మీ) టీవీలు ఉన్నాయి.

డిస్ప్లే

ఈ శామ్సంగ్ టీవీ యొక్క గొప్పతనం ఏమిటంటే మన ఇంటిలోని పెద్ద పెద్ద ప్రకాశవంతమైన గోడల వద్ద దీనిని ఉంచడానికి అనువైనదిగా ఉంటుంది. ఇది 30 మిమీ స్లిమ్ బెజెల్స్-లెస్ డిస్ప్లేను మరియు ఇన్ఫినిటీ డిజైన్ నుం కలిగి ఉంటుంది. ఇది కాళీ సమయాలలో వివిధ రకాల డెకో ఫ్రేమ్‌లను చూపడానికి కూడా అనుమతిస్తుంది. ఇది డిస్ప్లే ద్వారా దాని పరిసరాలను వివిధ రంగులు మరియు మీకు నచ్చిన వాల్ పేపర్ లతో కలపడానికి సహాయపడుతుంది.

 

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

AI
 

ఇది AI అప్-స్కేలింగ్, క్వాంటం HDR టెక్నాలజీ, 2,000 nits గరిష్ట బ్రైట్ నెస్ మరియు 120Hz వీడియో రేటుతో వస్తుంది. LED లు 100,000-గంటల లైఫ్ టైంను కలిగివుంటాయి. కాబట్టి మీరు శామ్సంగ్ వాల్‌ టీవీను నిరంతరం ఆన్ చేసి పెయింటింగ్‌లు, ఫోటోలు, వీడియోలు మొదలైన వాటిని ప్రదర్శించడానికి డిజిటల్ కాన్వాస్‌గా ఉపయోగించవచ్చు.

 

సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!

 వాల్ టీవీ

ఈ శామ్సంగ్ వాల్ టీవీ క్వాంటం ప్రాసెసర్ ఫ్లెక్స్‌తో ఎనేబుల్ చేసిన AI పిక్చర్ క్వాలిటీ ఇంజిన్‌తో ప్రారంభించబడింది. ఈ క్వాంటం ప్రాసెసర్ ఫ్లెక్స్ అనేది మెషిన్ లెర్నింగ్-బేస్డ్ పిక్చర్ క్వాలిటీ ఇంజిన్. ఇది డిస్ప్లే ప్రకారం తక్కువ-రెస్ ఇమేజ్‌ను క్రమాంకనం చేయడానికి ఇమేజ్ డేటాను విశ్లేషిస్తుంది. భౌతిక HDMI ఇన్ పుట్ ద్వారా దీన్ని ఏదైనా OS కి కనెక్ట్ చేయవచ్చు.

 

ఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ది వాల్ లగ్జరీ

పరిమాణాల పరంగా శామ్సంగ్ వాల్ టీవీ ది వాల్ లగ్జరీ మరియు ది వాల్ ప్రో అనే రెండు ఎంపికలలో వస్తుంది. లగ్జరీ ఎంపిక హోమ్ సినిమా మరియు గేమింగ్ కోసం తయారు చేయబడింది. ఇది యాంబియంట్ మరియు ఎంటర్టైన్మెంట్ మోడ్తో వస్తుంది. ఇది స్మార్ట్ టీవీలలో మీకు తెలిసిన అన్ని ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా డిస్ప్లే కంట్రోలర్‌తో వస్తుంది.

 

వచ్చే ఏడాది నుంచి రియల్‌మి 4G ఫోన్‌లు ఉండవు... ఎందుకో తెలుసా?వచ్చే ఏడాది నుంచి రియల్‌మి 4G ఫోన్‌లు ఉండవు... ఎందుకో తెలుసా?

ది వాల్ ప్రో

ది వాల్ ప్రో యొక్క ఎంపిక విషయానికి వస్తే ఇది హై-ఎండ్ బిజినెస్ మరియు రిటైల్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది మరియు లగ్జరీ వెర్షన్ వలె అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉంది. ప్రో ఎంపికలో వచ్చే డిస్ప్లే కంట్రోలర్ ప్రజెంటేషన్ల కోసం సంస్థలు ఉపయోగించే వ్యాపార లక్షణాలతో కూడి ఉంటుంది.

ధరల

ఈ శామ్సంగ్ వాల్ టీవీ యొక్క ధరల విషయానికి వస్తే వీటి ధరలు 3.5 కోట్ల రూపాయల నుండి మొదలై 12 కోట్ల రూపాయల వరకు పన్ను మినహాయించి వాటి పరిమాణాలను బట్టి ఉంటాయి. 146-అంగుళాల, 219-అంగుళాల మరియు 292-అంగుళాల వేరియంట్లు ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్నాయి. గుర్గావ్‌లోని శామ్‌సంగ్ ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్ సెంటర్ నుండి ప్రస్తుతం వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ టీవీను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు కొనుగోలు చేసే ముందు దీని యొక్క వీక్షణ అనుభవాన్ని పొందడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. దీని కోసం మీరు ముందుగా రిజర్వు చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Launched The Wall LEDs From Rs 3.5 Crore, In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X