సామ్‌సంగ్ నుంచి 256జీబి మెమరీ కార్డ్

Written By:

EVO Plus పేరుతో శక్తివంతమైన 256జీబి మైక్రోఎస్డీ కార్డ్‌ను సామ్‌‍సంగ్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర 240.99 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం ఈ కార్డ్ ధర ఇంచుమించుగా రూ.16,730 వరకు ఉండొచ్చు). ఈ మెమరీ కార్డ్ సామర్థ్యాన్ని పరిశీలించినట్లయితే 12 గంటల నిడివి గల 4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో లేదా 33 గంటల హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్‌ను స్టోర్ చేయగలదు.

సామ్‌సంగ్ నుంచి 256జీబి మెమరీ కార్డ్

సామ్‌సంగ్ V-NAND అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నఈ మెమరీ కార్డ్ రీడింగ్ స్పీడ్ సెకనుకు 95MBగా ఉండగా, రైటింగ్ స్పీడ్ సెకనుకు 90MBగా ఉండి. హై రిసల్యూషన్ ఫోటోగ్రఫీ కంటెంట్‌తో పాటు వర్చువల్ రియాల్టీ, గేమింగ్ వంటి గ్రాఫిక్ ఇంటెన్సివ్ మల్టీమీడియా కంటెంట్‌ను ఈ కార్డ్ స్టోర్ చేయగలదు. 10 సంవత్సరాల లిమిటెడ్ వారంటీతో వస్తోన్నఈ హై స్టోరేజ్ మెమరీ కార్డ్‌లను అమెరికా, చైనా, యూరోప్ ఇంకా ఇతర ప్రాంతాల్లో జూన్ 2016 నుంచి విక్రయించనున్నారు. లేటేస్ట్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో సిద్థంగా ఉన్న 5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డివైస్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : Exchange ఆఫర్స్ పై 15 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

SanDisk iXpand Flash Drive

5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్

యాపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌లలోని డేటాను వేగంగా ఇంకా సలువుగా యాక్సిస్ చేసుకునేందుకు శాన్‌డిస్క్ ఐఎక్స్‌ప్యాండ్ ఫ్లాష్ డ్రైవ్ చక్కటి ఆప్షన్. 16జీబి వర్షన్ నుంచి 128జీబి వర్షన్ వరకు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫ్లాష్ డ్రై‌వ్‌లు సిద్ధంగా ఉన్నాయి. సెక్యూర్ యాక్సిన్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఈ డ్రైవ్‌‌లోని డేటాకు మరింత సెక్యూరిటీని కల్పిస్తుంది. డ్రైవ్‌లోని డేటాకు పటిష్టమైన పాస్‌కోడ్ లేదా టచ్‌ఐడీని ఏర్పాటు చేసుకోవటం ద్వారా డేటాను వేరొకరు దొంగిలించలేరు. శాన్‌డిస్క్ ఐఎక్స్‌ప్యాండ్ ఫ్లాష్ డ్రైవ్ 16జీబి వర్షన్ ధర రూ.3,990.128జీబి వర్సన్ ధర 9,990.

Sandisk Connect Wireless Stick!

5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్

శాన్‌డిస్క్ కనెక్ట్ వైర్‌లెస్ స్టిక్ ఇప్పుడు 200జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. ఈ అప్ గ్రేడెడ్ వర్షన్ స్టోరేజ్ స్టిక్ ద్వారా డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. శాన్‌డిస్క్ కనెక్ట్ యాప్ సహాయంతో స్టిక్‌ను ఆండ్రాయిడ్, యాపిల్, గూగుల్ క్రోమ్‌కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు.

Sandisk Extreme PRO MicroSDXC UHS-II card

5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్

ఫోటోగ్రఫీ ప్రియులకు శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ ప్రో మైక్రోఎస్డీ‌ఎక్స్‌‍సీ యూహెచ్ఎస్ - II కార్డ్ చక్కటి ఆప్షన్. ఈ కొత్త స్టోరేజ్ కార్డ్ 64 ఇంకా 128జీబి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కార్డ్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ సెకనుకు 275ఎంబీగా ఉంది. షాక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఎక్స్-రే ప్రూఫ్. సాహసోపేత ఫోటోగ్రఫీ షూట్‌లలో పాల్గోనే వారికి ఈ కార్డ్ చక్కటి ఆప్షన్.

Sandisk Ultra Dual USB Drive 3.0

5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్

హైస్సీడ్ డేటా స్టోరేజ్ అలానే డేటా ట్రాన్స్‌ఫర్‌ను కోరుకునే వారికి శాన్‌డిస్క్ అల్ట్రా డ్యుయల్ యూఎస్బీ డ్రైవ్ 3.0 బెస్ట్ ఆప్షన్. 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ డ్రైవ్, మీ ఆండ్రాయిడ్ డివైస్ లోని డేటాను భద్రంగా స్టోర్ చేస్తుంది.

Sandisk Ultra Dual USB Type-C Flash Drive

5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్

టైప్ సీ యూఎస్బీ కనెక్టువిటీ పోర్టుతో వస్తోన్న శాన్‌డిస్క్ అల్ట్రా డ్యుయల్ యూఎస్బీ టైప్ సీ ఫ్లాష్ డ్రైవ్ క్విక్ షేరింగ్ ఇంకా క్విక్ స్టోరేజ్ సామర్థ్యాలను కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung launches 256GB microSD card. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting