ఇండియాకి శాంసంగ్ ఝలక్, మేక్ ఇన్ ఇండియాకు దెబ్బ !

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

|

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శాంసంగ్‌ కంపెనీ ఇటీవలే నోయిడాలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించిన కొన్ని నెలల్లోనే శాంసంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇకపై టీవీల తయారీని ఆపేయాలని, వియత్నాం నుంచి వాటిని నేరుగా దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. టీవీ తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన విడిభాగాలు, మరికొన్నింటిపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని విధించడంతో శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండిజియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండి

చెన్నైలోని ఫ్యాక్టరీ..

చెన్నైలోని ఫ్యాక్టరీ..

ఇప్పుడు చెన్నైలోని ఫ్యాక్టరీలో శాంసంగ్ టీవీలను ఉత్పత్తి చేస్తోంది. చెన్నైలో ఉన్న తన ఒకేఒక్క టీవీల ఉత్పత్తి సౌకర్యాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని శాంసంగ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి.

ఏడాదికి 3 లక్షల యూనిట్లను..

ఏడాదికి 3 లక్షల యూనిట్లను..

చెన్నైలో ఉన్న టీవీల తయారీ ప్లాంట్‌ ఏడాదికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేది. శాంసంగ్ ఈ ఉత్పత్తిని క్రమంగా తగ్గించి ఆపై పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక సప్లయర్ల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

వియత్నాం నుంచి టీవీలను దిగుమతి..

వియత్నాం నుంచి టీవీలను దిగుమతి..

ఇక్కడ ఉత్పత్తి నిలిపివేసిన తరువాత వియత్నాం నుంచి టీవీలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలని యోచిస్తోందని రిపోర్టులు తెలిపాయి. వియత్నాంలో ఉన్న టీవీల ఉత్పత్తి సౌకర్యం శాంసంగ్‌ అత్యంత పెద్ద ప్రొడక్షన్‌ హబ్‌ గా ఉంది.

సప్లయర్స్‌ను అలర్ట్‌..

సప్లయర్స్‌ను అలర్ట్‌..

ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ స్థానికంగా ఉన్న సప్లయర్స్‌ను అలర్ట్‌ చేసినట్టు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో..

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో..

టీవీ ప్యానల్స్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో, శాంసంగ్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.

రిపోర్టులపై..

రిపోర్టులపై..

అయితే టీవీల ఉత్పత్తిని శాంసంగ్‌ ఆపివేస్తుందని వస్తున్న రిపోర్టులపై ఆ కంపెనీ ప్రతినిధి స్పందించారు.

దేశీయంగా తయారు చేసేందుకే ..

దేశీయంగా తయారు చేసేందుకే ..

దేశీయంగా తయారు చేసేందుకే తాము కట్టుబడి ఉన్నామని, టీవీల యూనిట్ల ప్రొడక్షన్‌ను తరలించే ప్లాన్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

 

మేకిన్‌ ఇండియాకు బిగ్‌ బూస్ట్‌..

మేకిన్‌ ఇండియాకు బిగ్‌ బూస్ట్‌..

శాంసంగ్‌ అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్‌ను మన దేశంలో ఏర్పాటు చేయడంతో, మేకిన్‌ ఇండియాకు బిగ్‌ బూస్ట్‌ వచ్చింది.

మోడీ-మూన్ జే-ఇన్  సమక్షంలో..

మోడీ-మూన్ జే-ఇన్ సమక్షంలో..

భారత ప్రధాని నరేంద్రమోడీ, కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సమక్షంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఏడాదికి 68 మిలియన్ హ్యాండ్‌సెట్‌లను..

ఏడాదికి 68 మిలియన్ హ్యాండ్‌సెట్‌లను..

ప్రస్తుతం ఏడాదికి 68 మిలియన్ హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తుండగా దానిని 120 మిలియన్‌కు పెంచాలని శాంసంగ్ యోచిస్తోంది.

శాంసంగ్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుని..

శాంసంగ్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుని..

కొన్ని నెలల్లోనే శాంసంగ్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుని, మేకిన్‌ ఇండియాకు షాకిచ్చింది. మరి ఈ వార్తలు నిజమైతే మేక్ ఇన్ ఇండియా బూస్ట్ కు ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవాల్సి రావచ్చు.

Best Mobiles in India

English summary
Samsung plans to stop TV production in India, may import from Vietnam: Report more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X