Home
Gadgets

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్‌ ఫ్రేమ్‌.. ఎలా పనిచేస్తుంది.. ఎక్కడ కొనుగోలు చేయాలి..!!

శాంసంగ్ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ వైర్‌ లెస్‌ స్పీకర్‌ ను భారత్ మార్కెట్‌ లో విడుదల చేసింది. తొలిసారిగా ఈ తరహా గ్యాడ్జెట్‌ ను లాంచ్‌ చేసింది. ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ డాల్బీ అట్మాస్‌ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ (Samsung music Frame launched in India) కేవలం స్పీకర్‌గానే కాకుండా ఫోటో ఫ్రేమ్‌గా కూడా ఉపయోగపడుతుంది. యూజర్లు తమకు నచ్చిన ఫోటోను అమర్చుకోవచ్చు. మెరుగైన సౌండ్‌ క్వాలిటీ అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది.

డాల్బీ అట్మాస్‌ ఫీచర్‌ సపోర్టుతో.. :
ఈ శాంసంగ్ మ్యూజిక్ ఫ్రేమ్‌ మూడు వైపుల నుంచి ఆడియోను అందిస్తుంది. ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ స్పీకర్‌ను కనెక్ట్ చేసిన సినిమా చూసినా, సంగీతం విన్నా, గేమ్స్‌ ఆడుతున్నా.. డాల్బీ అట్మాస్‌ ఫీచర్‌ను కలిగి ఉన్న ఈ వైర్‌లెస్ స్పీకర్‌ మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

Samsung first time launched music Frame in india w

గదిలో సౌండ్‌ ఆధారంగా పనితీరు.. :
ఈ శాంసంగ్‌ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్‌ అసిస్టెంట్‌లతో లాంచ్ అయింది. దీంతోపాటు స్పేస్‌ ఫిట్‌ సౌండ్ ప్రో టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. గదిలోని ధ్వని ఆధారంగా సౌండ్ అవుట్‌పుట్‌ ను అందిస్తుంది. వాయిస్‌ అసిస్టెంట్‌ల ద్వారా మ్యూజిక్‌ను నియంత్రణ చేయవచ్చు.

శాంసంగ్ మ్యూజిక్‌ ఫ్రేమ్ ధర :
ఈ శాంసంగ్‌ మ్యూజిక్‌ ఫ్రేమ్ ద్వారా ఒకే విధమైన సౌండ్‌ను గది అంతటా ఉండేలా చూస్తుంది. దీంతోపాటు మెరుగైన సౌండ్‌ కోసం యూజర్లు తమ TVకి ఇరువైపులా రెండు మ్యూజిక్‌ ఫ్రేమ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. శాంసంగ్ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ను శాంసంగ్‌ వెబ్‌సైట్ Samsung.in, అమెజాన్ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్రేమ్‌ ధర రూ.23,990 గా ఉంది.

అధునాతన ఇళ్లలో మెరుగైన సౌండ్ సిస్టమ్ కోసం ఎదురుచూసే వారికి శాంసంగ్‌ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ వైర్‌లెస్‌ స్పీకర్‌ను స్మార్ట్‌ యాప్‌తో కనెక్ట్‌ చేయవచ్చు. దీని ద్వారా యూజర్లకు నచ్చిన విధంగా సౌండ్‌ను నియంత్రణ చేయవచ్చు. ఆస్వాదించవచ్చు.

శాంసంగ్ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ విడుదలపై శాంసంగ్‌ విజువల్‌ డిస్‌ప్లే బిజినెస్‌ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్‌ సింగ్‌ స్పందించారు. కొంతమంది వినియోగదారులు మెరుగైన పనితీరు కనబరచడం సహా చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే ఉత్పత్తులను కోరుకుంటున్నారని తెలిపారు. అసాధారణమైన ఆడియో సాంకేతికతను ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung music Frame launched in india with dolby atmos support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X