Samsung 110-inch మైక్రోLED కొత్త టీవీ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి...

|

ప్రముఖ దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ ఇప్పటికే ఫ్యూచరిస్టిక్ టీవీ, ది వాల్ వంటి స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఇప్పుడు వీటి యొక్క ప్రేరణతో శామ్సంగ్ సంస్థ మైక్రోLED టెక్నాలజీని ఉపయోగించి 110-అంగుళాల స్క్రీన్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త శామ్‌సంగ్ టీవీ ఇప్పటికే కొరియాలో ప్రీ-సేల్ కోసం వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ 110-అంగుళాల అతి పెద్ద స్క్రీన్ శామ్‌సంగ్ టీవీ 2021 సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇతర దేశాల మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ 110-ఇంచ్ మైక్రోLED టీవీ కొత్త టెక్నాలజీలు

శామ్‌సంగ్ 110-ఇంచ్ మైక్రోLED టీవీ కొత్త టెక్నాలజీలు

టెలివిజన్ ప్రపంచంలో ఏప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకురావడానికి అందరి కంటే ఎక్కువ తీవ్రంగా శామ్సంగ్ సంస్థ కృషి చేస్తోంది. ఈ కొత్త టెక్నాలిజీలో భాగమే 110-అంగుళాల మైక్రోLED టీవీ విడుదల. మైక్రోLED టెక్నాలజీలో ఉత్తమమైన ఫీచర్ విషయానికి వస్తే OLED స్క్రీన్‌లను కలిగి ఉండడం. ఈ టీవీ యొక్క స్క్రీన్ డిస్ప్లేలలోని టెక్నాలజీలో విస్తృతంగా అప్‌గ్రేడ్ గా పరిగణిస్తున్నారు. కానీ తాజా శామ్‌సంగ్ 110-అంగుళాల మైక్రోLED టీవీ ధర వివరాలను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇంకా వెల్లడించనందున ఇది మిస్టరీగా మిగిలిపోయింది. ఈ టీవీ అందిస్తున్న ఫీచర్ల వివరాలను పరిశీలిస్తే కనుక ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 4K లేదా 8K టీవీల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము.

 

Also Read: WhatsApp లో కొత్త ఫీచర్!!! షాపింగ్ చేయడం మరింత సులభం...Also Read: WhatsApp లో కొత్త ఫీచర్!!! షాపింగ్ చేయడం మరింత సులభం...

శామ్‌సంగ్ మైక్రోLED  టీవీ బెజెల్స్‌ & సౌండ్ సిస్టమ్ ఫీచర్స్

శామ్‌సంగ్ మైక్రోLED టీవీ బెజెల్స్‌ & సౌండ్ సిస్టమ్ ఫీచర్స్

శామ్‌సంగ్ యొక్క కొత్త మైక్రోLED టెలివిజన్ కేవలం బెజెల్స్‌ను మాత్రమే కలిగి ఉంది. ఇది 99.99 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో రావడమే కాకుండా శామ్‌సంగ్ "embedded మెజెస్టిక్ సౌండ్ సిస్టమ్" ను కూడా ముందు కంటే ఎక్కువగా అభివృద్ధి చేయగలిగింది. ఇది ఎక్సటర్నల్ స్పీకర్స్ లేకుండా ఉత్కంఠభరితమైన 5.1 ఛానల్ సౌండ్ ను అందిస్తుంది.

శామ్‌సంగ్ మైక్రోLED కొత్త టీవీ అడోబ్ RGB కలర్ గామెట్ ఫీచర్స్

శామ్‌సంగ్ మైక్రోLED కొత్త టీవీ అడోబ్ RGB కలర్ గామెట్ ఫీచర్స్

పిక్చర్ యొక్క నాణ్యత విషయానికి వస్తే ఈ మైక్రోLED డిస్ప్లేలలో ఉపయోగించిన బ్యాక్లైట్ మరియు కలర్ ఫిల్టర్లను తొలగించడానికి మైక్రోమీటర్-సైజ్డ్ LED లైట్లను ఉపయోగిస్తుంది. అలాగే దీనికి బదులుగా ఇది సెల్ఫ్-ఇల్లుమినేషన్, మరియు స్వంత పిక్సెల్ నిర్మాణాల నుండి కాంతి మరియు కలర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 100 శాతం DCI మరియు అడోబ్ RGB కలర్ గామెట్ ను వ్యక్తీకరిస్తుంది మరియు హై-ఎండ్ DSLR కెమెరాలతో తీసిన విస్తృతమైన కలర్ ఫోటోలను ఖచ్చితంగా అందిస్తుంది. ఇది డిస్ప్లే యొక్క 4K రిజల్యూషన్ మరియు 8 మిలియన్ పిక్సెల్స్ నుండి అద్భుతమైన లైఫ్ లైక్ కలర్లు మరియు ఖచ్చితమైన ప్రకాశానికి దారితీస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Released 110-inch New MicroLED TV: Specifications, Features, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X