Samsung ‘The Sero’ టీవీ లాంచ్!! స్మార్ట్‌ఫోన్ ఆకారంలో అద్భుతమైన ఫీచర్స్...

|

ప్రముఖ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో 'ది సెరో' అనే కొత్త టీవీని విడుదల చేసింది. శామ్సంగ్ సంస్థ విడుదల చేసిన ఈ కొత్త రకమైన స్మార్ట్ టీవీ మొబైల్ మాదిరి ఎటువైపైనా తిప్పడానికి వీలుగా ఉంటుంది. 'ది సెరో' పేరుతో గల ఈ టీవీ ప్రస్తుతానికి ప్రపంచంలో మొబైల్ ఆప్టిమైజ్ చేసిన మొట్టమొదటి మరియు ఏకైక టీవీ. ఇందులో గల ఒక బటన్ ను నొక్కడం ద్వారా ఈ టీవీని వినియోగదారులు నిలువు మరియు క్షితిజ సమాంతర ధోరణులలో తిప్పడానికి వీలుగా ఉంటుంది. ఈ టీవీ టీవీలాగా కాకుండా భారీ సైజు స్మార్ట్‌ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది. 'ది సెరో' టీవీ యొక్క ధర మరియు ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ మొబైల్ ఆప్టిమైజ్ స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ మొబైల్ ఆప్టిమైజ్ స్పెసిఫికేషన్స్

కొరియన్ భాషలో ‘సెరో' అంటే ‘నిలువు' అని అర్ధం. కావున శామ్సంగ్ సంస్థ ఈ కొత్త స్మార్ట్‌టీవీని నిలువు మరియు క్షితిజ సమాంతర ధోరణుల మధ్య చూడడానికి వీలుగా తయారు చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ లో ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ మరియు మరిన్నింటిని ఎలా అయితే ఆపరేట్ చేయగలరో దాని వలె ఇందులో కూడా ప్రసారం చేయడానికి శామ్‌సంగ్ ‘ది సెరో' ను ఆప్టిమైజ్ చేసింది. ఈ టీవీ నిజంగా మొబైల్ వాలే ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉంది.

 

Also Read: OnePlus Nord SE: 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో త్వరలోనే లాంచ్!!Also Read: OnePlus Nord SE: 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో త్వరలోనే లాంచ్!!

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ యాంబియంట్ మోడ్ + ఫీచర్స్

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ యాంబియంట్ మోడ్ + ఫీచర్స్

శామ్సంగ్ సంస్థ యొక్క కొత్త టీవీ ‘ది సెరో' మొబైల్‌లోని కంటెంట్‌తో సరిపోలడానికి స్క్రీన్‌ను తిప్పేటప్పుడు స్మార్ట్‌ఫోన్-ఆప్టిమైజ్ చేసిన అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీలో 4.1-అంగుళాల 60W ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లను ప్రత్యేకంగా రూపొందించబడి ఉన్నాయి. ఇవి వినియోగదారులు లీనమయ్యే అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టీవీలో యాంబియంట్ మోడ్ + కూడా ఉంది. ఇది టీవీ ఉపయోగంలో లేనప్పుడు కూడా స్క్రీన్ మీద మీకు నచ్చిన ఫోటోలను వాల్ పేపర్లుగా ప్రదర్శించడానికి ‘ది సెరో' సహాయపడుతుంది.

 

Also Read: Amazon లో గాడ్జెట్ల పై భారీ ఆఫర్లు ! మరో రెండు రోజులు మాత్రమే...వేటిపై ఎంత ?Also Read: Amazon లో గాడ్జెట్ల పై భారీ ఆఫర్లు ! మరో రెండు రోజులు మాత్రమే...వేటిపై ఎంత ?

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ 4K రిజల్యూషన్ ఫీచర్స్

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ 4K రిజల్యూషన్ ఫీచర్స్

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కంటెంట్‌ను టీవీలోకి ఆప్టిమైజ్ చేసే అద్భుతమైన ఫీచర్ ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు కేవలం ఒక నొక్కు నొక్కడం ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నుండి కంటెంట్‌ను టీవీ స్క్రీన్‌పై ప్రతిబింబించగలరు. ‘ది సెరో' టీవీ నిజమైన సినిమా అనుభవం కోసం టీవీ స్క్రీన్ మీద బిలియన్ షేడ్స్ మరియు కలర్లతో 100% కలర్ వాల్యూమ్‌ను అందిస్తుంది. అలాగే శామ్సంగ్ సంస్థ వినియోగదారు వీక్షణ అనుభవాన్ని పెంచడానికి QLED టెక్నాలజీను కూడా అందిస్తుంది. ఇది 4K రిజల్యూషన్‌కు కంటెంట్‌ను స్వయంచాలకంగా పెంచడానికి ‘ది సెరో' లో AI మద్దతును కలిగి ఉంది.

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ 360 డిగ్రీ డిజైన్‌

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ 360 డిగ్రీ డిజైన్‌

శామ్సంగ్ సంస్థ యొక్క కొత్త ‘ది సెరో' స్మార్ట్‌టీవీ 360 డిగ్రీలు సులభంగా తిరగగల అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సొగసైన నేవీ-బ్లూ స్టాండ్‌పై ఆదారపడి ఉంటుంది. ‘ది సెరో' టీవీను స్మార్ట్‌ఫోన్ వలె సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. స్మార్ట్‌టింగ్స్ యాప్ ద్వారా వినియోగదారులు టీవీని నియంత్రించవచ్చు, దాన్ని తిప్పవచ్చు, స్క్రీన్‌పై మొబైల్ కంటెంట్‌ను షేర్ కూడా చేయడంతో పాటుగా మరిన్ని చేయవచ్చు.

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ ధరల వివరాలు

శామ్సంగ్ ‘ది సెరో’ స్మార్ట్‌టీవీ ధరల వివరాలు

శామ్సంగ్ ‘ది సెరో' స్మార్ట్‌టీవీ 43-అంగుళాల పరిమాణంలో వస్తుంది. ఇది సుమారు 1,24,990 రూపాయల ధర వద్ద విడుదల చేశారు. ఈ టీవీ సమకాలీన నేవీ-బ్లూ బెజెల్ డిజైన్ తో వస్తుంది. ప్రస్తుతానికి శామ్సంగ్ ‘ది సెరో' భారతదేశం అంతటా రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుంది. ఇది 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీతో వస్తుందని కంపెనీ ప్రత్యేకంగా తెలిపింది. అంతేకాకుండా ప్యానెల్‌ మీద ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Released The Sero “rotating TV” in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X