త్వరలో అన్ని సామ్‌సంగ్ ఫోన్‌లకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్!
ఇప్పటి వరకు హైఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ త్వరలో అన్ని సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి రాబోతోందట.
ఇప్పటి వరకు హైఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ త్వరలో అన్ని సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి రాబోతోందట. బడ్జెట్‌తో సంబంధం లేకుండా తాను లాంచ్ చేసే అన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన సాంకేతికతను సామ్‌సంగ్ అభివృద్థి చేస్తున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

లో-కాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్..
దక్షిణ కొరియా నుంచి వెలువడిన ఓ రిపోర్ట్ ప్రకారం సామ్ సంగ్ మరికొద్ది రోజుల్లో లో-కాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ఛార్జర్ ధర 20 డాలర్లలోపు ఉండొచ్చని సమాచారం. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ అలానే జే సిరీస్‌ల నుంచి త్వరలో లాంచ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్ చేయబోతోందట.

ఓటీఏ ఛార్జింగ్ టెక్నాలజీ...
సామ్‌సంగ్ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్ పీసీల కోసం ఓవర్ ద ఎయిర్ (ఓటీఏ) వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గతంలోనూ వార్తలొచ్చాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ డాక్యుమెంటేషన్‌ను వరల్డ్ ఇంటలెక్ట్యుల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) అప్పట్లో రిలీజ్ చేసింది.

ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం లేకుండా..
సామ్‌సంగ్ నుంచి ఓ కొత్త టెక్నాలజీని భవిష్యత్‌లో చూడబోతున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పోలిస్తే సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న టెక్నాలజీ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతోందట. సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న కొత్త టెక్నాలజీతో డివైస్‌ను ఛార్జ్ చేసుకునేందుక ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం ఉండదట.

దూరంలో ఉన్నప్పటికి డివైస్ ఛార్జ్ అయ్యే అవకాశం...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ క్యూఐ ఎనేబుల్డ్ ఛార్జింగ్ ప్యాడ్ ఆధారంగా జరుగుతోంది. ఈ ప్యాడ్ పై డివైస్‌ను ప్లేస్ చేయటం ద్వారా ఛార్జింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. అయితే, సామ్‌సంగ్ తీసుకురాబోతోన్న ఓటీఏ వైర్‌లెస్ ఛార్జింగ్ క్యూఐ ఛార్జర్‌తో పోలిస్తే మరింత రేంజ్‌ను ఆఫర్ యగలుగుతుందట. అంటే ఛార్జర్ కు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే ఛార్జింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది. ఈ టెక్నాలజీతో ఛార్జర్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికి డివైస్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








