భార‌త విద్యార్థుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన Samsung!

|

భారత్‌లోని విద్యార్థుల‌కు Samsung కంపెనీ శుభ‌వార్త చెప్పింది. విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే గ్యాడ్జెట్స్‌ను డిస్కౌంట్ ధ‌ర‌లో అందించే విధంగా ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌కు Student Advantage Programme గా పేరు పెట్టింది. ఆక‌ర్ష‌ణీయమైన ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న ఈ స్కీమ్ ప్ర‌స్తుతం కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ మ‌రియు ఎక్స్‌క్లూజివ్ Samsung స్టోర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. విద్యార్థుల రోజువారీ ఉపయోగం కోసం కొత్త సాంకేతికతను అందించడమే ల‌క్ష్యంగా ఈ ఆఫ‌ర్ అందిస్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాకుండా, విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ పై మరింత ప్రోత్స‌హించి, అవ‌గాహ‌న క‌ల్పించి వారిని శక్తివంతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించ‌బ‌డిన‌ట్లు కంపెనీ పేర్కొంది.

 
Samsung Student Advantage Program

ఈ ప్రోగ్రామ్ ద్వారా, Samsung విద్యార్థుల‌కు కొనుగోలు చేసే ప్ర‌క్రియ‌ను చాలా చాలా సౌక‌ర్య‌వంతంగా చేస్తుంది. అంతేకాకుండా కొనుగోలు మ‌రియు అమ్మ‌కాల త‌ర్వాత ఎండ్ టూ ఎండ్ సేవ‌ల‌ను మరింత మెరుగ్గా అందిస్తుంది. భార‌త్‌ను శ‌క్తివంత‌మైన‌ డిజిట‌ల్ ఇండియాగా మార్చాల‌ని సామ్‌సంగ్ కు ఉన్న ప‌ట్టుద‌ల‌ను ఈ ప్రాజెక్ట్ మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని కంపెనీ పేర్కొంది.

 

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సామ్‌సంగ్ అందిస్తున్న ఆఫ‌ర్లు:
ఈ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ ద్వారా దేశ వ్యాప్తంగా యంగ్ జ‌న‌రేష‌న్‌కు సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన ప్రీమియం టెక్నాల‌జీ ఉత్ప‌త్తుల్ని ద‌గ్గ‌ర చేయాల‌ని కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సామ్‌సంగ్ కంపెనీకి చెందిన‌ Galaxy S20 FE and Galaxy S21 FE, the Galaxy A series, Galaxy Tab A series and Galaxy Tab S series ఫ్లాగ్‌షిప్ డివైజుల్ని 5శాతం డిస్కౌంట్ రేట్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా వేర‌బుల్స్, ల్యాప్‌టాప్‌ ఉత్ప‌త్తుల‌పై విద్యార్థులు 10శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక సామ్‌సంగ్ మానిట‌ర్ల విష‌యానికి వ‌స్తే 5 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samsung Student Advantage Program

Galaxy S22 Ultra ని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు.. Galaxy Watch 4ని రూ.2,999 కు పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా, Samsung Finance+ లేదా HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసిన‌పుడు అప్‌గ్రేడ్ బోనస్ కింద‌ రూ. 8,000 లేదా క్యాష్‌బ్యాక్ రూ.5 వేల వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా వినియోగదారులు 5% తగ్గింపుతో పాటు జీరో డౌన్ పేమెంట్‌తో 24 నెలల నో-కాస్ట్ EMI చెల్లింపు ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

Galaxy S22 మరియు Galaxy S22+ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడుతూ, విద్యార్థులు Galaxy Buds 2 ని రూ. 2,999 ని పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ప‌లు కొనుగోళ్ల‌పై అప్‌గ్రేడ్ బోనస్ రూ. 8,000 లేదా క్యాష్‌బ్యాక్ రూ. 5,000 పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. నిబంధనలు మరియు షరతులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. వీటితో పాటు నో-కాస్ట్ EMI చెల్లింపు ఎంపిక అలాగే ఉంటాయి. Galaxy A53 5G మరియు Galaxy A33 5G కొనుగోలు చేసే వినియోగ‌దారుల రూ.3 వేల త‌క్ష‌ణ త‌గ్గింపు ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది.

ఈ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌పై ఆసక్తిగల విద్యార్థులు అధికారిక Samsung వెబ్‌సైట్‌కి సంద‌ర్శించ‌వ‌చ్చు, దాంతో పాటు Samsung స్టూడెంట్ అడ్వాంటేజ్ మైక్రోసైట్‌కి నావిగేట్ చేయవచ్చు, లేదా సమీపంలోని Samsung Exclusive స్టోర్‌ని సందర్శించవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన ఉత్పత్తులపై ప్రత్యక్షంగా ఆఫ‌ర్ల‌ను పొందవ‌చ్చు అని కంపెనీ తెలిపింది.

Samsung Student Advantage Program

Galaxy S22 Ultraస్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల ఫుల్‌ HD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 8జీబీ, 12జీబీ కెపాసిటీల‌ను క‌లిగిన ర్యామ్ వేరియంట్ల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 108MP + 12MP +10MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 40 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Student Advantage Program Offers: Discounts You Can Avail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X