కుక్క భాషను అర్థం చేసుకునేందుకు ‘పెట్ ట్రాన్సలేటర్’

Posted By: BOMMU SIVANJANEYULU

ఈ విశ్వంలో జీవిస్తోన్న ప్రతి జంతుజాతికి ఒక భాష అనేది ఉంటుంది. మనుషుల భాష జంతువులకు అర్థం కాకపోయినప్పటికి మనం చేసే సంజ్ఞలు ఆధారంగా అవి ప్రతిస్పందించటం జరుగుతుంది. మనుషులచే అమితంగా ప్రేమించబడే జంతు జాతులులో శునక జాతి ఒకటి. వీటినే మనం కుక్కలు అని కూడా పిలుస్తుంటాం. మనుషుల పై అమితమైన విశ్వాసాన్ని చూపించేగలిగే శునకాలను మరింత దగ్గరగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు గత కొంతకాలంగా ప్రయ్నతిస్తూనే ఉన్నారు.

కుక్క భాషను అర్థం చేసుకునేందుకు ‘పెట్ ట్రాన్సలేటర్’

తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకుగాను ఓ ప్రత్యేకమైన టూల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరుగుతోన్న తీరును బట్టి అవే చెప్పాలనుకుంటన్నాయో మనకు తెలపగలుగుతుంది.

జంతు ప్రవర్తన నిపుణుడు ప్రొఫెసర్ కాన్ స్లాబోడ్చికోఫ్ వెల్లించిన వివరాల ప్రకారం ఈ పెట్ ట్రాన్స్‌లేటర్ టెక్నాలజీ వచ్చే 10 సంవత్సరాల్లోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంంగా స్పందించగలిగే ఈ టూల్ జంతువుల శబ్థాలతో పాటు ముఖ కవళికలను అర్థం చేసుకుని వాటిని ఎలిమెంటరీ ఇంగ్లీష్‌లో ట్రాన్సలేట్ చేస్తుంది. ఈ టూల్ ను అభివృద్ధి చేసే క్రమంలో వేల రకాల కుక్కలకు సంబంధించి వాటి అరుపులు ఇంకా శరీర కదలికలను రిసెర్చర్లు విశ్లేషించనున్నారు.

ఆ తరువాత వీటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అర్గారిథమ్‌లోకి మార్చనున్నారు.

ప్రయాణాల్లో మీకు తోడుగా నిలిచే బెస్ట్ స్మార్ట్ గాడ్జెట్స్

English summary
Scientists in the US are working on an instrument that would use artificial intelligence (AI) to learn and translate animal's vocalizations and facial expressions into simple English.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot