Home
Gadgets

60 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC సపోర్టు, ఆకట్టుకొనే డిజైన్‌తో హెడ్‌ఫోన్స్‌.. సేల్‌ ప్రారంభం..!

Skullcandy Icon ANC Headphones : స్కల్‌క్యాండీ ఐకాన్‌ ANC హెడ్‌ఫోన్స్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయ్యాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ IPX4 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ హెడ్‌ఫోన్స్‌ ప్రీసెట్ EQ మోడ్స్ ను కలిగి ఉంటుంది. స్కల్‌క్యాండీ యాప్‌ ద్వారా కస్టమైజ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఈ స్కల్‌క్యాండీ హెడ్‌ఫోన్స్‌ పవర్‌ బటన్‌, జాయ్‌స్టిక్‌ బటన్‌ను కలిగి ఉంది. ఈ హెడ్‌సెట్‌ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హెడ్‌ఫోన్స్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు.

స్కల్‌క్యాండీ ఐకాన్ ANC స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ హెడ్‌ఫోన్స్‌ సౌకర్యవంతమైన డిజైన్, సర్దుబాటు చేసుకొనే వీలున్న హెడ్‌బ్యాండ్‌ ను కలిగి ఉంది. ఫలితంగా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్‌ ఆన్‌ ఇయర్ డిజైన్‌ ను కలిగి ఉంది. ఈ హెడ్‌ఫోన్స్‌ కొనుగోలుపై సంవత్సరం వారంటీని పొందవచ్చని సంస్థ చెబుతోంది.

Skullcandy icon ANC Headphones with 60 hours of Battery sale is live in india full features

ఈ యాప్‌ ద్వారా కస్టమైజ్‌ చేసుకోవచ్చు :
ఈ హెడ్‌ఫోన్స్‌ 40mm డ్రైవర్స్‌ ను కలిగి ఉంది. యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ హెడ్‌సెట్‌ మ్యూజిక్‌, బాస్‌ బూస్ట్‌, Podcast వంటి మూడు మోడ్స్‌ ను కలిగి ఉంది. స్కల్‌క్యాండీ యాప్‌ ద్వారా కస్టమైజ్‌ చేసుకొనేందుకు అవకాశం కూడా ఉంది.

ప్రత్యేకమైన బటన్స్‌ :
ఈ హెడ్‌సెట్‌ పవర్‌ బటన్స్, జాయ్‌స్టిక్‌ బటన్‌ వంటి కస్టమైజ్ బటన్స్‌ ను కలిగి ఉన్నాయి. వాయిస్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా నేచురల్‌ వాయిస్‌ సైడ్‌ టోన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. మరియు Low latency మోడ్‌ ను కూడా కలిగి ఉంది. మరియు అడ్జస్టబుల్‌ స్టే అవేర్‌ మోడ్‌ ను కూడా కలిగి ఉంది.

సింగిల్‌ ఛార్జింగ్‌ తో 60 గంటల బ్యాటరీ లైఫ్‌ :
స్కల్‌క్యాండీ ఐకాన్ ANC హెడ్‌ఫోన్స్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 60 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ANC ఫీచర్‌ ను ఉపయోగిస్తుంటే బ్యాటరీ లైఫ్‌ 50 గంటలుగా ఉంటుంది. 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్‌ తో 4 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు.

గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌ ఫీచర్‌ :
స్కల్‌క్యాండి ఐకాన్‌ ANC వెర్‌లైస్‌ హెడ్‌ఫోన్స్‌ IPX4 రేటింగ్‌ ను కలిగి ఉన్నాయి. బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తుంది. మల్టీపాయింట్‌ కనెక్టివిటీని కలిగి ఉంది. హెడ్‌ఫోన్స్‌ గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. బ్లాక్‌, బోన్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

హెడ్‌ఫోన్స్‌ ధర, సేల్‌ వివరాలు :
భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం స్కల్‌క్యాండీ ఐకాన్‌ ANC హెడ్‌ఫోన్స్‌ (Skullcandy Icon ANC Sale) అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ ఆఫర్‌ లో భాగంగా రూ.8999 కే అందిస్తున్నట్లు చెబుతోంది. ఈ హెడ్‌ఫోన్స్‌ను స్కల్‌క్యాండీ ఇండియా వెబ్‌సైట్ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్‌లో రూ.7999 కే అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Skullcandy icon ANC Headphones with 60 hours of Battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X