మార్కెట్లో వేడెక్కిన పోటీ, భారీగా తగ్గిన స్మార్ట్‌టీవీ ధరలు !

|

స్మార్ట్‌.. స్మార్ట్‌.. అంతా స్మార్ట్‌ మయం.మొన్నటిదాకా స్మార్ట్‌ఫోన్‌ వార్‌తో ఇండియా మార్కెట్ వేడెక్కిపోగా ఇప్పుడు స్మార్ట్‌టీవీ వార్‌తో ఇండియా వేడెక్కుతోంది. భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి గ్లోబల్ సంస్థల ప్రవేశంతో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు సగానికి పడిపోయాయి. అధిక ఫీచర్లతో, తక్కువ ధరల్లోనే షియోమీ, థామ్సన్, టీసీఎల్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తున్నాయి. తక్కువ ధర, అధిక ఫీచర్లతో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి.

 

సముద్రంలో నీటిపై తేలియాడే దేశం,దిమ్మతిరిగే షాకిస్తున్న సృష్టికర్తలుసముద్రంలో నీటిపై తేలియాడే దేశం,దిమ్మతిరిగే షాకిస్తున్న సృష్టికర్తలు

ఆకాశాన ఉన్న ధరలు ఒక్కసారిగా నేలవైపు

ఆకాశాన ఉన్న ధరలు ఒక్కసారిగా నేలవైపు

ఒకప్పుడు టాప్‌ టీవీ బ్రాండ్లు అంటే శాంసంగ్, ఎల్‌జీ, సోనీ పేర్లే వినిపించేవి. ఇప్పుడు షియోమి, థామ్సన్ రాకతో పోటీ తారాస్థాయికి చేరింది. ఆకాశాన ఉన్న ధరలు ఒక్కసారిగా నేలవైపు చూపాయి. 32 అంగుళాల స్మార్ట్‌ టీవీ నేడు ధర రూ.23,000ల నుంచి ప్రారంభమౌతోంది. ఒకప్పుడు ఇదే టీవీ ధర రూ.30,000కు పైగా ఉండేది.

రూ.13,500 నుంచే..

రూ.13,500 నుంచే..

షియోమి, థామ్సన్, టీసీఎల్‌ వంటి కంపెనీల రాకతో వీటికి భారీగా గండిపడింది. కేవలం రూ.13,500 నుంచే ఈ కంపెనీలు 32 అంగుళాల ఇంచ్ స్మార్ట్‌ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మార్కెట్లోని శాంసంగ్, ఎల్‌జీ, సోనీ ప్రొడక్టుల ధరతో పోలిస్తే ఇది సగానికిపైగా తక్కువ.

40 అంగుళాల స్మార్ట్‌ టీవీల విషయానికొస్తే
 

40 అంగుళాల స్మార్ట్‌ టీవీల విషయానికొస్తే

40 అంగుళాల స్మార్ట్‌ టీవీల విషయానికొస్తే ఇప్పుడు ధర దాదాపుగా రూ.20,000కు తగ్గింది. ఇదివరకు వీటి ధర దాదాపు రూ.50,000లుగా ఉండేది. 32, 40 అంగుళాల టీవీలు ప్రజలకు చేరువ అవడంలో ఫైనాన్స్‌ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

 చైనా, తైవాన్ కంపెనీలు

చైనా, తైవాన్ కంపెనీలు

ధరలో ఇంత వ్యత్యాసం ఉండటంతో చైనా, తైవాన్ కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళుతూ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. నెలసరి వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించేలా స్మార్ట్ టీవీలకు ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తూ అమ్మకాలను శరవేగంగా విస్తరించుకుంటున్నాయి.

కంటెంట్ పై ప్రధానంగా దృష్టి

కంటెంట్ పై ప్రధానంగా దృష్టి

స్మార్ట్ టీవీ కంపెనీలు కంటెంట్ పై ప్రధానంగా దృష్టిని సారిస్తూ, హాట్ స్టార్, వూట్ం సోనీ లైఫ్, హంగామా తదితర ఆన్ టీవీ డిమాండ్ సేవలనూ ఈ సంస్థలు అందిస్తున్నాయి. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి కంపెనీలకూ వాటి స్మార్ట్‌టీవీ మోడళ్లకు సంబంధించి పలు కంటెంట్‌ సంస్థలతో ఒప్పందాలున్నాయి.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి సంస్థలతో

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి సంస్థలతో

దేశీ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విక్రయ కంపెనీ షియోమి మరింత కంటెంట్‌ కోసం దిగ్గజ సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది. తాము కంటెంట్‌ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి సంస్థలతో మాట్లాడుతున్నామని షియోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌/ షియోమి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ చెప్పారు.

భారత టీవీ మార్కెట్

భారత టీవీ మార్కెట్

భారత టీవీ మార్కెట్ రూ. 50 వేల కోట్లుగా ఉందన్న అంచనాలుండగా, స్మార్ట్ టీవీ విభాగం వాటా 40 శాతం వరకూ అంటే రూ. 20 వేల కోట్ల వరకూ ఉంది. గత రెండు సంవత్సరాల్లో సాలీనా 40 శాతం వృద్ధితో అమ్మకాలు పెరుగుతూ ఉండటం గమనార్హం.

మొత్తం టీవీ మార్కెట్‌లో పరిమాణపరంగా చూస్తే

మొత్తం టీవీ మార్కెట్‌లో పరిమాణపరంగా చూస్తే

మొత్తం టీవీ మార్కెట్‌లో పరిమాణపరంగా చూస్తే ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమ్మకాలు 14% వాటా ఆక్రమించాయి. ధరలు తగ్గుతూ ఉండటం, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పై విక్రయాలకు కొత్త కంపెనీలు ఆసక్తి చూపుతూ ఉండటంతో వచ్చే రెండేళ్లలో ఈ-కామర్స్ మాధ్యమంగా జరిగే విక్రయాలు 20 శాతం వాటాను దక్కించుకుంటాయని అంచనా.

Best Mobiles in India

English summary
After Xiaomi, Thomson may trigger price war in the Rs 22,000 cr television market in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X