Home
Gadgets

స్మార్ట్‌వాచ్ & స్మార్ట్‌బ్యాండ్ లలో ప్రధాన తేడాలు ఇవే... మీ ఓటు దేనికి???

ప్రపంచం టెక్నాలజీ పరంగా గతంలో కంటే చాలా బాగానే అభివృద్ధి చెందింది. గాడ్జెట్లు మరియు వాటి యొక్క ఉపకరణాలలో చాలా రకాల రూపాలు, పరిమాణాలు, ఆకారాలతో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని పొందడంలో గందరగోళంగా మారవచ్చు. ఉదాహరణకు స్మార్ట్ వాచీలు, స్మార్ట్‌బ్యాండ్‌లు, స్మార్ట్ గ్లాసెస్, రింగులు వంటివి ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఎక్కువగా ఉపయోగించగలిగే స్మార్ట్‌వాచ్‌లు మరియు స్మార్ట్‌బ్యాండ్‌లను ఉపయోగించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇవి రెండు కూడా పాత కాలం వాచ్ మాదిరిగానే మణికట్టు మీద ధరిస్తారు. ఇవి రెండు దాదాపు ఒకేలా కనిపించినప్పటికి వివిధ పనితీరులను కలిగి ఉంటాయి కనుక చాలా మంది వినియోగదారులు వీటిని ఎంచుకోవడంలో కొద్దిగా గందరగోళానికి గురిఅవుతూ ఉంటారు. స్మార్ట్‌బ్యాండ్ నుండి స్మార్ట్‌వాచ్‌ను వేరుచేసే విషయాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్‌వాచ్ మరియు స్మార్ట్‌బ్యాండ్ ప్రధాన వ్యత్యాసాలు

స్మార్ట్‌వాచ్ మరియు స్మార్ట్‌బ్యాండ్ ప్రధాన వ్యత్యాసాలు

స్మార్ట్‌వాచ్ మరియు స్మార్ట్‌బ్యాండ్ రెండిటిని కూడా ఉపయోగించే మొదటి కారణం సమయం(టైం) వివరాలు తెలుసుకోవడం. ఇవి రెండూ కూడా ఇటువంటి కొన్ని ఉమ్మడి ఫీచర్లను కలిగి ఉన్నాయి. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు మరియు స్మార్ట్‌బ్యాండ్‌లు రెండూ సమయం చూపడంతో పాటుగా ఫిట్‌నెస్ ఫీచర్లనులను కలిగి ఉంటాయి. వీటిలో పెడోమీటర్, టాచీమీటర్, స్లీప్ మానిటర్, హృదయ స్పందన మానిటర్, మొదలైనవి ఉన్నాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లకు సమకాలీకరించవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య గల తేడాలలో మొదటిది స్క్రీన్ పరిమాణాలు, కొలతలు మరియు ఇతర కొన్ని ఫీచర్స్ ఉన్నాయి.

స్మార్ట్‌వాచ్ VSస్మార్ట్‌బ్యాండ్: స్క్రీన్ సైజ్ వ్యత్యాసం

స్మార్ట్‌వాచ్ VSస్మార్ట్‌బ్యాండ్: స్క్రీన్ సైజ్ వ్యత్యాసం

సాధారణంగా స్మార్ట్ వాచ్‌ల యొక్క స్క్రీన్ సైజ్ స్మార్ట్ బ్యాండ్ల కంటే కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. స్మార్ట్ వాచ్ డిస్ప్లేలు సాధారణంగా 1 - 3 అంగుళాల మధ్య ఉంటే స్మార్ట్ బ్యాండ్ల యొక్క డిస్ప్లే 0 - 1 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా స్మార్ట్ వాచ్‌ల స్క్రీన్‌లు టచ్‌స్క్రీన్ కు అనుకూలంగా ఉంటాయి. వీటిని మీ యొక్క చేతి వేళ్ళతో స్మార్ట్‌ఫోన్‌లో వలె సులభంగా నియంత్రించవచ్చు. స్మార్ట్ బ్యాండ్‌లలో నావిగేషన్ అనేది భౌతిక బటన్‌తో చేస్తారు మరికొన్ని టచ్‌స్క్రీన్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ. స్మార్ట్‌వాచ్‌ల కంటే మెరుగైన టచ్ డిస్ప్లేను కలిగి ఉండవు.

స్మార్ట్‌వాచ్ & స్మార్ట్‌బ్యాండ్ ఉమ్మడి ఫీచర్స్

స్మార్ట్‌వాచ్ & స్మార్ట్‌బ్యాండ్ ఉమ్మడి ఫీచర్స్

స్మార్ట్ బ్యాండ్‌లు అనేవి అధికంగా ఫిట్‌నెస్ మీద అధికంగా ఫోకస్ చేయబడి ఉన్నందున మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడే గేమ్స్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. టైం చూపడం అనేది పక్కన పెడితే స్మార్ట్ బ్యాండ్లలో సాధారణంగా పెడోమీటర్లు, హృదయ స్పందన మానిటర్లు, స్లీప్ మానిటర్లు మరియు ఇతర ఆరోగ్య ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్ కూడా స్మార్ట్ బ్యాండ్ యొక్క అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. సిమ్ కార్డ్ స్లాట్లు, వైఫై కనెక్టివిటీ, కెమెరా, 4G ఎల్‌టిఇ, స్టాండ్ అలోన్ యాప్ లు, యాప్ స్టోర్ వంటి వాటితో పాటుగా కొన్ని సంక్లిష్ట ఆరోగ్య ఫీచర్లను స్మార్ట్‌వాచ్‌లు కలిగి ఉంటాయి.

 

స్మార్ట్‌వాచ్ & స్మార్ట్‌బ్యాండ్ ఇంటరాక్టివిటీ ఫీచర్స్

స్మార్ట్‌వాచ్ & స్మార్ట్‌బ్యాండ్ ఇంటరాక్టివిటీ ఫీచర్స్

స్మార్ట్ వాచీలు మరియు స్మార్ట్ బ్యాండ్ల యొక్క మరొక ప్రధాన భేదం ఇంటరాక్టివిటీ. స్మార్ట్ వాచీలలో క్లిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఫీచర్స్ కలిగి ఉండడంతో పాటుగా పెద్ద స్క్రీన్ ఉన్నందున టైపింగ్ విషయంలో స్మార్ట్ బ్యాండ్ కంటే అధునాతనంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే స్మార్ట్‌వాచ్‌లు స్వతంత్రంగా పనిచేయగలవు. కావున మీకు నచ్చిన వారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ లను పంపడంతో పాటుగా ఇమెయిల్ కూడా పంపవచ్చు. అలాగే సిమ్ కార్డ్ ఉపయోగించే వారు ఫోన్ కాల్ కూడా చేయవచ్చు. కొన్ని స్మార్ట్‌వాచ్‌లు స్పీకర్లతో కూడా వస్తాయి. ఇవి సంగీతాన్ని ప్లే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మరికొన్ని ఫోటోలు మరియు ఇతర మల్టీమీడియాలను స్టోర్ చేయడానికి SD కార్డ్ స్లాట్ మద్దతుతో కూడా వస్తాయి.

ఉపయోగం

ఉపయోగం

స్మార్ట్ వాచ్ అనేది సాధారణ వాచ్ లాగా రూపొందించబడింది. కావున స్మార్ట్ వాచీలు రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటాయి. కానీ కొన్ని సాధారణ గడియారాల కంటే ఇవి మెరుగ్గా రూపొందించబడ్డాయి. స్మార్ట్ ఫిట్నెస్ ట్రాకర్స్ అనేవి గేమ్స్ మరియు వినోద కార్యకలాపాల సమయంలో ధరించడానికి ఉత్తమంగా ఉంటుంది. కొంతమంది రోజంతా తమ స్మార్ట్ బ్యాండ్‌లను ధరించినప్పటికీ వారు కొన్ని సందర్భాల్లో వీటిని వినియోగించడానికి ఇష్టపడరు. కార్పొరేట్ మీటింగ్స్ వంటి వాతావరణంలో వినియోగదారులు స్మార్ట్ బ్యాండ్‌ను కాకుండా స్మార్ట్‌వాచ్ ధరించాలని ఎక్కువ మంది అనుకుంటారు.

తీర్పు

తీర్పు

రోజువారీ ఉపయోగం కోసం మీ మణికట్టు మీద ధరించడానికి సరికొత్త టెక్నాలజీ ఉండాలి అనుకుంటే కనుక ధరల విషయం పట్టించుకోకపోతే మీరు స్మార్ట్ వాచ్ ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వారు ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ వంటి వాటి మీద అవగాహన కోసం స్మార్ట్ బ్యాండ్ ను ఎంచుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు మరియు మీరు రోజంతా ధరించవచ్చు. కానీ ఇందులో ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే మీరు స్మార్ట్ వాచ్ యొక్క కొన్ని జ్యుసి ఫీచర్లను కోల్పోతారు.

Best Mobiles in India

English summary
Smartwatch vs Smartband: These are The Main Differences
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X