Snapchat స్మార్ట్‌గ్లాసెస్!!! ఇన్‌బిల్ట్-కెమెరాతో కళ్లఅద్దాలు...

|

సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన స్నాప్‌చాట్ ఇప్పుడు ఇండియాలో తన మరొక కొత్త ఆవిష్కరణను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. స్నాప్‌చాట్ యొక్క సంస్థ స్నాప్ ఇంక్ జూలై 4 న ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ సన్‌గ్లాసెస్ - స్నాప్ స్పెక్టకాల్స్ 2 మరియు స్పెక్టకల్స్ 3 ను విడుదల చేయనున్నది.

స్నాప్‌చాట్ స్నాప్ స్పెక్టకాల్స్ 3 ధరల వివరాలు

స్నాప్‌చాట్ స్నాప్ స్పెక్టకాల్స్ 3 ధరల వివరాలు

ఈ రెండు కళ్లఅద్దాలలో గొప్ప విషయం ఉంది. అది ఏమిటంటే ఇవి ఇన్‌బిల్ట్-కెమెరాతో రావడం. ఈ కొత్త స్నాప్ స్పెక్టకాల్స్ లను కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది. స్నాప్ స్పెక్టకాల్స్ 2 యొక్క ధర రూ.14,999 కాగా స్నాప్ స్పెక్టకల్స్ 3 రూ.29,999 ధర వద్ద అందుబాటులో ఉండనున్నది.

 

Also Read: Jio, Airtel, BSNL టెల్కోల యొక్క ఉపయోగకరమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...Also Read: Jio, Airtel, BSNL టెల్కోల యొక్క ఉపయోగకరమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ సేల్స్ వివరాలు

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ సేల్స్ వివరాలు

స్నాప్ స్పెక్టకాల్స్ 2 మరియు స్నాప్ స్పెక్టకాల్స్ 3 రెండు కళ్లఅద్దాలను కొనుగోలు చేయాలనుకున్న వారు ఇవి విడుదల ఆయన తరువాత ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచబడతాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క వెబ్‌సైట్ లో చేసిన జాబితా ప్రకారం జూన్ 4 నుండి వీటిని కొనుగోలు చేయవచ్చు. స్నాప్ ఇంక్ (స్నాప్‌చాట్) సంస్థ ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లను మొదటగా 2018 మరియు 2019 లో ప్రారంభించారు. ఈ మొదటి స్మార్ట్‌గ్లాసెస్‌లను పరిమిత సంఖ్యలో నవంబర్ 2017 లో ఆన్‌లైన్‌లో విక్రయించారు.

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ డిజైన్

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ డిజైన్

స్నాప్‌చాట్ సంస్థ తయారుచేసిన ఈ కళ్ళజోడు యొక్క పెద్ద హైలైట్ విషయం ఏమిటంటే ఇది అంతర్నిర్మిత కెమెరాను కలిగి ఉండడం. వినియోగదారులు ఈ అద్దాల ద్వారా ఫోటోలు లేదా వీడియోలను తీయడానికి అనుమతిస్తుంది. అలాగే వాటిని నేరుగా వారి స్నాప్‌చాట్ అకౌంటులో అప్‌లోడ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. వినియోగదారుల యొక్క కంటెంట్‌ను iOS లేదా ఆండ్రాయిడ్ యాప్ తో సులభంగా సమకాలీకరించవచ్చు. ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఇవి 100 వీడియోలు లేదా 1,200 ఫోటోలను రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. యూజర్లు ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ యొక్క బ్యాటరీని యుఎస్‌బి టైప్-సి కేబుల్‌తో 75 నిమిషాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు.

 

 

Also Read: DTH కొత్త కనెక్షన్ కోసం చూస్తున్నారా?? అయితే ఇది మీకోసమే..Also Read: DTH కొత్త కనెక్షన్ కోసం చూస్తున్నారా?? అయితే ఇది మీకోసమే..

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్‌ ఫీచర్స్

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్‌ ఫీచర్స్

స్నాప్‌చాట్ కంపెనీ గత సంవత్సరం స్నాప్ స్పెక్టకిల్స్ 3 వెర్షన్ యొక్క రూపకల్పనను అప్‌డేట్ చేసింది. ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ యొక్క హార్డ్వేర్ విషయానికి వస్తే కంపెనీ స్పెక్టకల్స్ 3 లో సెకండరీ HD కెమెరాను జోడించింది. ఇది అన్ని రకాల ఫోటోలను మరింత డీప్ గా సంగ్రహించడానికి అదనపు కెమెరాను ఉపయోగిస్తుంది. కొత్తగా లభించే డీప్ డేటాను అందించడానికి కంపెనీ అనేక 3D ఎఫెక్ట్‌లను కూడా నిర్మించింది.

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ కెమెరా స్పెసిఫికేషన్స్

స్నాప్‌చాట్ స్మార్ట్‌గ్లాసెస్ కెమెరా స్పెసిఫికేషన్స్

స్నాప్‌చాట్ యొక్క స్మార్ట్‌గ్లాసెస్‌ స్పెక్టకాల్స్ 3 కార్బన్ మరియు మినరల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. దీని యొక్క డిజైన్ అంశం విషయానికి వస్తే ఇది సూర్యుడి యొక్క కాంతి నుండి కళ్ళను రక్షించడానికి సర్దుబాటు చేయగల అనేక కలర్ మరియు లేతరంగు కటకములతో పాటు తేలికపాటి స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీని పైన ఉన్న బటన్‌ను నొక్కడం ద్వారా సాధారణ వీడియో లేదా ఫోటో క్యాప్చర్ ఫీచర్ ఈ స్మార్ట్‌గ్లాస్‌లలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Snapchat Company Launching Inbuilt-Camera Spectacles on This Week

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X