Home
Gadgets

32W830K సౌండ్ టెక్నాలజీతో సోనీ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌టీవీ విడుదలైంది!!

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌టీవీలు కూడా ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. సోని సంస్థ తమ యొక్క స్మార్ట్‌టీవీలలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్నది. అందులో భాగంగానే సోనీ బ్రావియా 32W830K స్మార్ట్‌టీవీని నేడు భారతదేశంలో ప్రారంభించబడింది. 32-అంగుళాల HD టీవీ గూగుల్ టీవీ UIతో వస్తుంది. ఇది వివిధ యాప్‌లు లేదా సినిమాలు వంటి ప్రసారాలను అధునాతన వాయిస్ నియంత్రణలు మరియు అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ లతో యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఇటీవల ప్రారంభించిన సోనీ బ్రావియా X75K స్మార్ట్ టీవీ సిరీస్ వలె గూగుల్ అసిస్టెంట్, ఎయిర్‌ప్లే మరియు హోమ్‌కిట్ ఇంటిగ్రేషన్‌కు మద్దతును అందిస్తుంది. దీని యొక్క ఇతర ఫీచర్లలో X-రియాలిటీ ప్రో, డాల్బీ ఆడియో మరియు X-ప్రొటెక్షన్ ప్రో వంటివి మరిన్ని ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Sony Bravia 32W830K ధరల వివరాలు

Sony Bravia 32W830K ధరల వివరాలు

సోనీ సంస్థ భారతదేశంలో 32-అంగుళాల Sony Bravia 32W830K స్మార్ట్ టీవీని రూ.28,990 ధర వద్ద విడుదల చేసింది. ఈ మోడల్ నేటి నుండి భారతదేశంలోని అన్ని సోనీ సెంటర్‌లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్‌లు మరియు ఇ-కామర్స్ పోర్టల్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం సోనీ ఆన్‌లైన్ షాప్‌లో ఇది రూ.34,900 ధర వద్ద లభిస్తున్నది.

Sony Bravia 32W830K స్పెసిఫికేషన్స్

Sony Bravia 32W830K స్పెసిఫికేషన్స్

Sony Bravia 32W830K HD స్మార్ట్‌టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 32-అంగుళాల (1,366x768 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో 50Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఇది HDR10 మరియు HLG ఫార్మాట్‌లకు మద్దతును కలిగి ఉంది. ఇది X-రియాలిటీ ప్రో పిక్చర్ ప్రాసెసర్, కలర్ మెరుగుదల కోసం లైవ్ కలర్ టెక్నాలజీ మరియు కాంట్రాస్ట్ మెరుగుదల కోసం డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ వంటి డిస్‌ప్లే-సంబంధిత ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉండి ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేస్తుంది.

32W830K

Sony Bravia 32W830K టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10W ఫుల్ రేంజ్ ఓపెన్ బేఫిల్ స్పీకర్‌లతో వస్తుంది. TVలోని కనెక్టివిటీ ఎంపికలలో WiFi 802.11ac, బ్లూటూత్ v5, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, కాంపోజిట్ వీడియో ఇన్‌పుట్, మూడు HDMI పోర్ట్‌లు మరియు డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది హోమ్‌కిట్ మరియు ఎయిర్ ప్లే మద్దతుతో కూడా వస్తుంది. ఇది ఐఫోన్ లేదా ఐప్యాడ్ ని ఉపయోగించి కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగించవచ్చు. అదనంగా ఇందులో Vivid, స్టాండర్డ్, సినిమా, గేమ్, గ్రాఫిక్, ఫోటో మరియు కస్టమ్ పిక్చర్ మోడ్‌లను కూడా కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Sony Bravia 32W830K SmartTV Launched in India With X-Protection Pro and Live Colour Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X