510 MBPS writing స్పీడ్‌తో Sony G Series CFast Memory Cards

32GB (CAT-జి32) 7400 రూపాయలకు , 64GB (CAT-S64) 11,400 రూపాయలకు మరియు 128GB (CAT-S128) 22,100 రూపాయల ధరలో లభ్యం కానున్నాయి.

|

సోమవారం నాడు సోనీ, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు ప్రధాన లక్ష్యంగా, భారతదేశం లో సోనీ G సిరీస్ లో భాగంగా అధిక పనితీరు ప్రదర్శించగల 510 mbps స్పీడ్ కలిగిన CFast మెమరీ కార్డులను ఆవిష్కరించడo జరిగింది.ఈ మెమరీ కార్డ్ మూడు హోదాల్లో అందుబాటులో ఉంటుంది. 32GB (CAT-జి32) 7400 రూపాయలకు , 64GB (CAT-S64) 11,400 రూపాయలకు మరియు 128GB (CAT-S128) 22,100 రూపాయల ధరలో లభ్యం కానున్నాయి. ఈ మూడు మెమరీ కార్డులు 530MBps రీడ్ స్పీడ్, 510mbps writing స్పీడ్ ను కలిగి ఉంటాయి. సోమవారం, మార్చి 26 నుండి ఈ మూడు మెమరీ కార్డులు సోనీ ఆఫ్లైన్ ఆల్ఫా స్టోర్స్, సోనీ సెంటర్ స్టోర్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో లభ్యం కానున్నాయి.

ఈ టిప్స్‌తో మీ గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీ గ్యారంటీ..ఈ టిప్స్‌తో మీ గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీ గ్యారంటీ..

sony-cfast-g-series-memory-card

high resolution RAW images కొరకు high-speed burst shooting mode ఫీచర్ సపోర్ట్ చేసేవిగా ఈ మెమరీ కార్డ్స్ రూపుదిద్దబడి ఉన్నాయి. ఈ కొత్త CFast కార్డులు VPG130 సపోర్టుని కలిగి ఉండి అధిక బిట్ రేట్ కలిగిన 4K వీడియోలను రికార్డు చేయగలవు. drop, shock, rigidity, మరియు vibration పరీక్షలను సైతం తట్టుకోగలిగినవిగా ఉంటాయి. భౌతిక నష్టం జరుగకుండా రక్షణకై ఒక హార్డ్ కేస్ కూడా పొందుపరచడం జరిగినది. Sony's File Rescue సాఫ్ట్వేర్ వినియోగించుట ద్వారా తొలగించబడిన లేదా డెలీట్ చేయబడిన ఫోటోలను సైతం రికవరీ చేసుకునే వీలు ఉంది .

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు మరియు వీడియోగ్రాఫర్లకు ఇలాంటి పోటీ ప్రపంచంలో సమర్ధవంతనీయమైన వర్క్ ఫ్లో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. 530 mbps రీడ్ స్పీడ్ కలిగి ఉండడం వలన Sony's G Series CFast , raw files ను ట్రాన్స్ఫర్ చేయడంలో మరియు 4k వీడియోలను, హై రిసోల్యూషన్ వీడియోలను PC కి వేగంగా ట్రాన్స్ఫర్ చేయడంలో దోహదం చేస్తుంది.

సోనీ, SF-G సిరీస్ మెమరీ కార్డులను గత సంవత్సరం మార్చి 2017 లోనే ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి 32GB, 64GB , 128 gb లో అందుబాటులో ఉన్నాయి. ఈ SF-G సిరీస్ మెమరీ కార్డులు గరిష్టంగా 300 mbps రీడ్ స్పీడ్ , మరియు 299 mbps write స్పీడ్ ని కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English summary
Sony G Series CFast Memory Cards With Write Speeds of Up to 510MBps Launched in India more news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X