సోని నుంచి సరికొత్త హెడ్‌ఫోన్స్, ప్రీమియమ్ రేంజ్‌లో లభ్యం

|

జపాన్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ, భారత్‌లో సరికొత్త ఆడియో ఉత్పత్తులను లాంచ్ చేసింది. వీటిలో ప్రీమియమ్ రేంజ్ హెడ్‌ఫోన్‌లతో పాటు ఇన్-ఇయర్ స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా పోర్టబుల్ బ్లుటూత్ స్పీకర్స్ ఉన్నాయి. WF-SP700N, WI-SP600N, WI-SP500, WI-C300, WH-CH400, WH-CH500 మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒకటైన WF-SP700N మోడల్ ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తి స్థాయి నాయిస్-క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ ఇయర్ బడ్స్‌తో వచ్చే క్యారియంగ్ కేస్‌ను ఛార్జింగ్ డాక్‌లా కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఇయర్ ఫోన్ బ్లాక్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ధర రూ.12,990.

 
సోని నుంచి సరికొత్త హెడ్‌ఫోన్స్, ప్రీమియమ్ రేంజ్‌లో లభ్యం

కన్వెన్షనల్ నెక్ బ్యాండ్ డిజైన్‌..
ఈ లైనప్‌లో తరువాతి మోడల్ అయిన సోనీ WI-SP600N కన్వెన్షనల్ నెక్ బ్యాండ్ డిజైన్‌తో వస్తోంది. 6 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తోన్న ఈ ఇయర్ ఫోన్‌కు నాయిస్-క్యాన్సిలేషన్ ఇంకా స్ప్లాష్-ప్రూఫింగ్ ఫీచర్లు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. WF-SP700N మోడల్ తరహాలోనే WI-SP600N కూడా గూగుల్ వాయస్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమయ్యే ఈ ఇయర్ ఫోన్ ధర రూ.9,900. మే 15 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

పోర్టబుల్ బ్లుటూత్ స్పీకర్లు కూడా..
ఈ లైన‌ప్‌లో మిగిలిన మోడల్స్ అయిన WI-SP500, WI-C300, WH-CH400 WH-CH500లు రూ.4,990, రూ.2,990, రూ.3,790, రూ.4,990 ధర ట్యాగ్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా తన 2018 లైనప్‌కు సంబంధించిన పోర్టబుల్ బ్లుటూత్ స్పీకర్లను కూడా సోనీ ఆవిష్కరించింది. SRS-XB41, SRS-XB31, SRS-XB21 మోడల్స్‌లో ఈ బ్లుటూత్ ఆడియో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.

రూ. 5499కే 4జీ వోల్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్రూ. 5499కే 4జీ వోల్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్

ఎక్స్‌ట్రా బాస్ సౌండ్‌తో...
ఎక్స్‌ట్రా బాస్ వైర్‌లెస్ స్పీకర్ సపోర్టుతో వస్తోన్న ఈ పోర్టబుల్ బ్లుటూత్ స్పీకర్స్‌కు ఎక్స్‌ట్రా బాస్ సౌండ్, లైవ్ సౌండ్ మోడ్, పార్టీ బూస్టర్ మోడ్ వంటి ఫీచర్స్ ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తాయి. ఐపీ67 రేటింగ్‌తో వస్తోన్న ఈ స్పీకర్స్ వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి.

ఏప్రిల్ 16 నుంచి మార్కెట్లో లభ్యం...
ఈ లైనప్‌లో మొదటి మోడల్ అయిన SRS-XB41 ధర రూ.13,990గా ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి ఈ స్పీకర్ మార్కెట్లో లభ్యమవుతోంది. మరో మోడల్ అయిన SRS-XB41 ధర రూ.9,990గా ఉంటుంది. మరో మోడల్ SRS-XB21 ధర రూ.7,990గా ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Sony has launched a new range of premium headphones and portable Bluetooth speakers in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X