Sony Bravia కొత్త LED టీవీలు వచ్చేసాయి!!! ప్లే స్టేషన్ ఫీచర్లతో

|

ఇండియాలో సోనీ టీవీలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సోనీ బ్రావియా కొత్తగా తన X9000H సిరీస్ 4K LED టీవీలను భారతదేశంలో విడుదల చేశారు. కొత్త సిరీస్‌ టీవీలు ఫుల్-అర్రే ఎల్‌ఇడి బ్యాక్‌లైటింగ్, హెచ్‌డిఆర్, ఆండ్రాయిడ్ టివి ఆపరేటింగ్ సిస్టమ్, ఆపిల్ ఎయిర్‌ప్లే 2 మరియు హోమ్‌కిట్ వంటి ఫీచర్ల మద్దతును కలిగి ఉంది. ఇది 120fps ఫ్రేమ్ రేట్‌తో 4K రిజల్యూషన్ మద్దతుతో లభించే ప్లేస్టేషన్ 5 గేమ్లను అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సిరీస్ లోని 65-అంగుళాల మోడల్ సోనీ యొక్క ఎకౌస్టిక్ మల్టీ-ఆడియో ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది టీవీ స్క్రీన్ వెనుక రెండు అదనపు స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీల ధరల వివరాలు

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీల ధరల వివరాలు

సోనీ బ్రావియా X9000H సిరీస్ స్మార్ట్ టీవీలు ఇండియాలో రెండు వేరు వేరు పరిమాణాలలో విడుదల చేసారు. ఇందులో 55 అంగుళాల మోడల్ (KD-55 X9000H) యొక్క ధర రూ.1,09,990 కాగా, 65 అంగుళాల (KD-65 X9000H) మోడల్ ధర రూ.1,59,990. ఈ కొత్త సిరీస్ టీవీలు  సోనీ యొక్క అన్ని ప్రధాన రిటైల్ దుకాణాలు మరియు ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది.

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీ స్పెసిఫికేషన్స్
 

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీ స్పెసిఫికేషన్స్

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీలు అల్యూమినియం ఫ్రేమ్ మరియు మెటల్ స్టాండ్‌ వంటి ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ టీవీల యొక్క ప్యానల్‌ ఫుల్-అర్రే ఎల్‌ఇడి బ్యాక్‌లైటింగ్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఎడ్జ్-లైట్ LCD టివిలతో పోలిస్తే మంచి కాంట్రాస్ట్ మరియు ప్రకాశాన్ని ఇస్తాయి. దీని యొక్క స్క్రీన్ 4K రిజల్యూషన్ మద్దతును కలిగి ఉండి 3840x2160 పిక్సెల్స్ పరిమాణంలో 60Hz మరియు 1080p గరిష్ట రిఫ్రెష్ రేట్ వద్ద క్లాక్ చేయబడి ఉన్నాయి. అయినప్పటికీ ఇది భవిష్యత్ ఫర్మ్‌వేర్ అప్ డేట్ ద్వారా HDMI 2.1 కంటే ఎక్కువ 4K 120Hz వరకు మద్దతునిస్తుంది.

Also Read:రూ.500 లోపు ధరలో Tata Sky నుంచి వస్తున్న ఉత్తమ DTH ప్యాక్‌లు ఇవేAlso Read:రూ.500 లోపు ధరలో Tata Sky నుంచి వస్తున్న ఉత్తమ DTH ప్యాక్‌లు ఇవే

సోనీ బ్రావియా X9000H సిరీస్ ఆడియో టెక్నాలజీ

సోనీ బ్రావియా X9000H సిరీస్ ఆడియో టెక్నాలజీ

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీలు HDR10, HLG మరియు డాల్బీ విజన్ వంటి అన్ని ప్రముఖ HDR ఫార్మాట్లకు మద్దతును ఇస్తుంది. ఇది సోనీ యొక్క X1 4K HDR ఇమేజ్ ప్రాసెసర్‌తో పాటు 4K X- రియాలిటీ ప్రో క్లారిటీ ఇంజిన్ వంటి ఇతర యాజమాన్య ఫీచర్ల మద్దతుతో కూడా వస్తుంది. ఈ సిరీస్ టీవీలు మొత్తంగా 20W సౌండ్ అవుట్‌పుట్‌తో బాటమ్-ఫైరింగ్ స్పీకర్లను కలిగి ఉన్నాయి. అయితే 65-అంగుళాల మోడల్‌కు మాత్రం స్క్రీన్ వెనుకభాగంలో రెండు అదనపు ట్వీటర్లు కూడా ఉన్నాయి. డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీలకు కూడా ఇవి మద్దతును ఇస్తాయి. ఈ టీవీలు సరికొత్త ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతూ 16GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటాయి.

సోనీ బ్రావియా X9000H సిరీస్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్స్

సోనీ బ్రావియా X9000H సిరీస్ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్స్

సోనీ బ్రావియా X9000H సిరీస్ టీవీల యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే సోనీ బ్రావియా X9000H సిరీస్ అంతర్నిర్మిత Wi-Fi 802.11ac, ఈథర్నెట్, బ్లూటూత్ 4.2, RF కనెక్టర్, కంపోసిట్ వీడియో, నాలుగు HDMI పోర్ట్‌లు, ఆప్టికల్ ఆడియో-అవుట్, హెడ్‌ఫోన్ జాక్ మరియు రెండు USB పోర్ట్‌లను కలిగి ఉంది. గూగుల్ అసిస్టెంట్‌తో బండిల్ చేసిన రిమోట్ ద్వారా మీరు వాయిస్ ఆదేశాలను పంపి కూడా టీవీను కంట్రోల్ చేయవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Sony Released PlayStation 5 Support LED HDR TVs in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X