Sony WF-C510 ఇయర్‌బడ్స్ విడుదల.. సూపర్ డిజైన్, మెరుగైన ఫీచర్‌లు.. ధర, సేల్ పూర్తి వివరాలు..!!
ప్రముఖ గ్యాడ్జెట్ ల తయారీ సంస్థ సోనీ తాజాగా ఇయర్‌బడ్స్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. సోనీ WF-C510 పేరుతో (Sony WF-C510 Earbuds launched) ఇయర్‌బడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజైన్ పరంగా బడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ సౌకర్యంగా ఉంటాయని, ఎక్కువ రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయని సోనీ చెబుతోంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్ మెరుగైన ఫీచర్లు, అందుబాటులో ధరలో సోనీ విడుదల చేసింది. ఈ Sony True Wireless ఇయర్‌బడ్స్ ఫీచర్లు, ధర, సేల్ వివరాలతో పూర్తి కథనం.
సోనీ WF-C510 ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
సోనీ WF- C510 ఇయర్‌బడ్స్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. సౌకర్యవంతంగా వినియోగించుకొనేలా ఉంటాయి. ఎక్కువ సమయం వినియోగించినా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ ఇయర్‌బడ్స్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది. చెవులకు సంబంధించిన అనేక సంవత్సరాల సమాచారం ఆధారంగా ఇయర్‌బడ్స్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది.

ఈ సోనీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మల్టీ పాయింట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా రెండు పరికరాలను ఒకేసారి కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ బడ్స్ Spotify ట్యాప్‌ను సపోర్టు చేస్తాయి. ఫలితంగా Fast pair మరియు Swift Pair ను సులభంగా చేయవచ్చు. ఈ బడ్స్ IPX4 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వ్యాయామం సహా వర్షాకాలం సమయాల్లో వినియోగించేందుకు వీలుగా ఉంటాయి.
ఈ ఇయర్‌బడ్స్ యాంబియంట్ సౌండ్ మోడ్‌ను కలిగి ఉంటాయి. అంటే సంగీతం వింటున్న సమయంలోనూ పరిసరాల సౌండ్ కూడా వినిపిస్తుంది. సాధారంగా వాకింగ్ సమయాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు వాయిస్ ఫోకస్ ఫంక్షన్‌తో బ్యాగ్రౌండ్‌లో ఉన్న అనవసర సౌండ్‌ను తగ్గించి.. వ్యక్తుల వాయిస్ సరిగా వినిపించేలా చూస్తుంది.

WF- C510 ఇయర్‌బడ్స్ సోనీ DSEE టెక్నాలజీ తో పనిచేస్తాయి. ఫలితంగా నాణ్యమైన సౌండ్ క్వాలిటీ సొంతమవుతుంది. ఈ బడ్స్ ను రీసైక్లింగ్ ప్లాస్టింగ్ తో తయారు చేశారు. దీంతోపాటు విక్రయాల సమయంలోనూ ప్లాస్టిక్ రహితంగా ఉండేలా సోనీ జాగ్రత్తలు తీసుకుంది.
సోనీ WF-C510 ఇయర్‌బడ్స్ మొత్తంగా 22 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి. ఇయర్‌బడ్స్ 11 గంటలు, అదే ఛార్జింగ్ కేస్ 11 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్టు చేస్తాయి. ఫలితంగా కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో గంటపాటు వినియోగించుకొనే అవకాశం ఉంది.

సోనీ WF- C510 ఇయర్‌బడ్స్ ధర, సేల్ :
ఈ సోనీ ఇయర్‌బడ్స్‌ను సెప్టెంబర్ 26 నుంచి కొనుగోలు చేయవచ్చు. సోనీ రిటైల్ స్టోర్ సహా ఇతర ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.4990 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 31, 2024 వరకు మాత్రమే ఉంటుందని సోనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








