బడ్జెట్ ధరలో సోనీ WH-CH400 వైర్లెస్ హెడ్ ఫోన్స్...

By Anil
|

సోనీ సంస్థ బడ్జెట్ ధరలో వైర్లెస్ హెడ్ ఫోన్స్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది.మారుతున్న కాలానికి అనుగుణంగా యూజర్లు సంగీతం ఆస్వాదించడానికి స్పీకర్లతో కూడిన వైర్డ్ హెడ్ ఫోన్స్ తో పని లేకుండా ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ని అందించబోతుంది . ఈ హెడ్ ఫోన్స్ చెవులకు మంచి సౌండ్ క్వాలిటీ కలిగిన అనుభూతిని ఇస్తాయి. కాగా ఈ హెడ్ ఫోన్స్ బడ్జెట్ ధరలో దొరకడం చాలా గొప్ప విషయమనే చెప్ప్పుకోవచ్చు .
మంచి కంపెనీలవి సౌండ్ సిస్టమ్తో కూడిన బోస్ హెడ్ ఫోన్స్ కొనాలి అంటే మార్కెట్లో ఇప్పుడు దాని ధర సుమారు రూ 35,000 పలుకుతుంది అయితే సోనీ సంస్థ అలాంటి ఫీచర్స్ తోనే కూడిన WH-CH400 ని కేవలం రూ రూ 3,500 నుంచి 4,500కే అందిచబోతుంది.

 

ఆసక్తి ఉన్న వినియోగదారులు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు

బడ్జెట్ ధరలో సోనీ WH-CH400 వైర్లెస్ హెడ్ ఫోన్స్...

డిజైన్ మరియు కంఫర్ట్:

కాగా , సోనీ WH-CH400 తేలికగా ఉండడానికి ఎఆర్ కప్స్ కాకుండా ఎఆర్ పాడ్స్ తో వస్తాయి.ఎఆర్ పాడ్స్ కి రంద్రాలు ఉండడం వలన సౌండ్ క్వాలిటీ మంచి అనుభూతుని ఇస్తుంది.ఎఆర్ కప్స్ ఉన్న హెడ్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడినప్పుడు మన చెవి కి బరువుగా అనిపిస్తుంది అలాంటి ఇబ్బంది లేకుండా ఎఆర్ పాడ్స్ లా వీటిని డిజైన్ చేసారు. ఈ డిజైన్ వల్ల చిన్న చిక్కు కూడా ఉంది అది ఏంటంటే చెవికి పూర్తిగా కవర్ అవ్వదు . సోనీ WH-CH400 చూడడానికి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా తీసుకొని వెళ్ళడానికి చాలా తేలికగా ఉంటుంది .

పెర్ఫార్మెన్స్ మరియు సౌండ్ క్వాలిటీ :

సౌండ్ క్వాలిటీ అందించడం లో సోనీ ఎప్పుడు వెనక అడుగు వేయలేదు. అందుకే ఈ సోనీ WH-CH400 తో బెస్ట్ క్వాలిటీ సౌండ్ అందిచబోతున్నారు. బాస్ బీట్ లో ఒక అడుగు ముందుకు వేసారనే చెప్పాలి ,ఇందులో వచ్చే బాస్ బీట్ కి చెవికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అన్నీ 30mm డ్రైవర్స్ ఇందులో కూడా అందించారు.

 

బాటరీ:

సోనీ WH-CH400 వైర్లెస్ హెడ్ ఫోన్స్ అవ్వడం వలన బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది .ఏ వైర్లెస్ హెడ్డుఫోన్స్ కి రాని బాటరీ లైఫ్ ఇందులో అందించారు సుమారు 20 గంటల దాకా బాటరీ వస్తుంది.సగటున ఒక వ్యక్తి రోజుకి 4 గంటలు ఈ హెడ్ ఫోన్స్ వాడిన 5 రోజుల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

Best Mobiles in India

Read more about:
English summary
Sony WH-CH400 review: Balanced wireless sound on a budget To know more this visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X