Sony నుంచి స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Mini LED TV విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

|

సోనీ కంపెనీ భార‌త మార్కెట్లో స్మార్ట్‌టీవీ ఉత్ప‌త్తుల‌ని క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా, Sony XR-85X95K Ultra-HD Mini LED TV పేరుతో స‌రికొత్త టీవీని భారతదేశంలో విడుద‌ల చేసింది. Sony యొక్క ప్రీమియం X95K TV సిరీస్‌లో ఈ మినీ LED TV ఒక భాగమ‌ని కంపెనీ పేర్కొంది. టెలివిజ‌న్‌లో అధునాతన మినీ LED బ్యాక్‌లైటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ టీవీ లోకల్ డిమ్మింగ్‌ని ఆపరేట్ చేయడానికి ఇందులో కాగ్నిటివ్ ప్రాసెసర్ XR మరియు XR బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీని అందిస్తున్నారు.

 
Sony నుంచి స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Mini LED TV విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

భార‌త్‌లో Sony XR-85X95K UHD మినీ-LED TV ధర మరియు లభ్యత:
ప్రస్తుతం, భారతదేశంలో సోనీ X95K మినీ LED TV సిరీస్‌లో ఒకే ఒక మోడల్ ఉంది. అదే తాజాగా విడుద‌లైన‌ 85-అంగుళాల XR-85X95K టెలివిజన్. భార‌త మార్కెట్లో ఈ టెలివిజన్ ధ‌ర‌ రూ.8,99,900 గా ఉంది. భారతదేశంలోని సోనీ స్టోర్స్, ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు మరియు ఇ-కామర్స్ పోర్టల్‌లలో రూ. 6,99,990 "బెస్ట్ బై" ఆపరేటింగ్ ధరతో ఇది అందించబడుతోంది. భారతదేశంలో ఇప్ప‌టికే మినీ LED డిస్‌ప్లే టెక్నాలజీతో అందుబాటులో ఉన్న Samsung మరియు TCL వంటి బ్రాండ్‌లు సోనీ యొక్క కొత్త టెలివిజన్‌తో పోటీ ప‌డ‌నున్నాయి.

Sony XR-85X95K UHD మినీ-LED TV స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు:
Sony X95K సిరీస్, గతంలో పేర్కొన్నట్లుగా, 85-అంగుళాల (3840x2160 పిక్సెల్‌) రిసొల్యూష‌న్‌ అల్ట్రా-HD క్వాలిటీతో మినీ LED డిస్‌ప్లే ప్యానెల్ క‌లిగి ఉంది. అధునాతన మినీ LED బ్యాక్‌లైటింగ్ మరియు లోకల్ డిమ్మింగ్‌ని ఆపరేట్ చేయడానికి ఆ టీవీ కాగ్నిటివ్ ప్రాసెసర్ XR మరియు XR బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అదనంగా, ఈ టెలివిజన్ డాల్బీ అట్మోస్ ఆడియో క‌లిగి ఉంది. దాంతో పాటుగా, హై డైనమిక్ రేంజ్ ఫార్మాట్‌లు HDR10 మరియు డాల్బీ విజన్‌లకు మద్దతు ఇస్తుంది.

Sony నుంచి స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Mini LED TV విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

ఈ టీవీలో ఇన్‌బిల్ట్ Chromecast, Apple AirPlay మరియు Apple HomeKit కనెక్టివిటీతో పాటు, ఇప్పుడు Google అసిస్టెంట్ వాయిస్ కంట్రోలింగ్‌ సామర్థ్యం కూడా ఉంది. ఈ టీవీ 4K క్వాలిటీని అందిస్తుంది. అంతేకాకుండా, దీని స్క్రీన్ 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కారణంగా మెరుగైన వీక్ష‌ణ అనుభూతిని ఇస్తుంది. గేమింగ్ పై ఆసక్తి ఉన్న వారికి కూడా ఈ టీవీ ఎంతో మంచి అనుభూతిని క‌ల్పిస్తుంది. అంతేకాకుండా, మంచి సౌండ్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం 60W రేటెడ్ అవుట్‌పుట్‌తో ఆరు-స్పీకర్ల‌తో అకౌస్టిక్ మల్టీ ఆడియో కాన్ఫిగరేషన్ కూడా దీనికి అందిస్తున్నారు.

భార‌త్‌లో ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన సోనీ బ్రావియా 32W830K స్మార్ట్‌టీవీ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల గురించి తెలుసుకుందాం:
Sony Bravia 32W830K HD స్మార్ట్‌టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 32-అంగుళాల (1,366x768 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో 50Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఇది HDR10 మరియు HLG ఫార్మాట్‌లకు మద్దతును కలిగి ఉంది. ఇది X-రియాలిటీ ప్రో పిక్చర్ ప్రాసెసర్, కలర్ మెరుగుదల కోసం లైవ్ కలర్ టెక్నాలజీ మరియు కాంట్రాస్ట్ మెరుగుదల కోసం డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ వంటి డిస్‌ప్లే-సంబంధిత ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉండి ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేస్తుంది.

 
Sony నుంచి స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Mini LED TV విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

Sony Bravia 32W830K టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10W ఫుల్ రేంజ్ ఓపెన్ బేఫిల్ స్పీకర్‌లతో వస్తుంది. TVలోని కనెక్టివిటీ ఎంపికలలో WiFi 802.11ac, బ్లూటూత్ v5, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, కాంపోజిట్ వీడియో ఇన్‌పుట్, మూడు HDMI పోర్ట్‌లు మరియు డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది హోమ్‌కిట్ మరియు ఎయిర్ ప్లే మద్దతుతో కూడా వస్తుంది. ఇది ఐఫోన్ లేదా ఐప్యాడ్ ని ఉపయోగించి కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగించవచ్చు. అదనంగా ఇందులో Vivid, స్టాండర్డ్, సినిమా, గేమ్, గ్రాఫిక్, ఫోటో మరియు కస్టమ్ పిక్చర్ మోడ్‌లను కూడా కలిగి ఉన్నాయి. సోనీ సంస్థ భారతదేశంలో 32-అంగుళాల Sony Bravia 32W830K స్మార్ట్ టీవీని రూ.28,990 ధర వద్ద విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Sony XR-85X95K UHD Mini-LED TV Launched in India at Super Premium Price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X