Sony నుంచి భార‌త్‌లో విడుద‌లైన అత్యంత ఖ‌రీదైన స్మార్ట్ టీవీ ఇదే!

|

Sony కంపెనీ భార‌త మార్కెట్లో త‌మ ఉత్ప‌త్తుల్ని క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా మ‌రో కొత్త మోడ‌ల్‌ Smart Tvని భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. Sony XR OLED A80K TV సిరీస్ పేరుతో వ‌స్తున్న ఈ మోడ‌ల్‌ 55, 65, 77 అంగుళాల సైజుల్లో మూడు వేరియంట్లలో విడుద‌లైంది. ప్ర‌స్తుతం Sony కంపెనీ నుంచి భార‌త్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడ‌ల్‌ బాగా ఖ‌రీదైన‌ది మ‌రియు టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్ల‌డించింది. ఈ టీవీ కాగ్నిటివ్ ప్రాసెస‌ర్ ఎక్స్ ఆర్ తో వ‌స్తోంది. ఇది డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు, డాల్బీ విజ‌న్ ఫార్మాట్ హెచ్‌డీఆర్ స‌పోర్ట్ క‌లిగి ఉంది.

Sony XR OLED A80K Series

Sony XR OLED A80K స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
ఈ టీవీ (3840x2160-pixel) రిసొల్యూష‌న్‌తో 77 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ OLED స్క్రీన్‌తో వ‌స్తోంది. దీనికి కాగ్నిటివ్ ప్రాసెస‌ర్ ఎక్స్ఆర్ ను అందిస్తున్నారు. త‌ద్వారా మెరుగైన, అనుకూలమైన ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శిస్తుంది. డాల్బీ విజన్, HDR10 మరియు HLG ఫార్మాట్‌లతో అధిక డైనమిక్ రేంజ్ కంటెంట్‌కు స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. అద్భుత‌మైన సౌండ్ అనుభూతిని పొందేందుకు.. ఈ టీవీకి Dolby Atmos మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ ఫార్మాట్‌లకు కూడా మద్దతు ఉంది. అంతేకాకుండా, Netflix అడాప్టివ్ కాలిబ్రేటెడ్ మోడ్ వంటి ఇతర ఫార్మాట్‌లు మరియు మ‌రిన్ని మెరుగైన‌ ఫీచర్‌లకు కూడా మద్దతు ఉంది.

A80K సిరీస్ Android TV సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రధాన స్ట్రీమింగ్ సర్వీస్‌లతో సహా మ‌రిన్ని కీలకమైన యాప్‌లకు సంబంధించి స‌పోర్ట్ క‌లిగి ఉంది. ఇంకా గూగుల్ క్రోమ్ కాస్ట్‌తో పాటు, ఎక్స్‌ట‌ర్న‌ల్ డివైజ్‌ల‌ను క‌నెక్ట‌క్ష చేయ‌డానికి యాపిల్ ఎయిర్ ప్లే 2, హోం కిట్ స‌పోర్ట్ క‌లిగి ఉంది. రిమోట్ ద్వారా గూగుల్ అసిస్టెన్స్ వినియోగించుకునే అవ‌కాశం కూడా క‌ల్పిస్తున్నారు.

ఇక సౌండ్ విష‌యానికొస్తే, Sony A80K సిరీస్ అకౌస్టిక్ సర్‌ఫేస్‌ ఆడియో మరియు XR సరౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంది. 60W సౌండ్‌ అవుట్‌పుట్ అందిస్తుంది. ఆటో లో-లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) మరియు ఆటో గేమ్ మోడ్ వంటి గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

Sony XR OLED A80K TV ధ‌ర‌:
ఈ మోడ‌ల్ టీవీలు సైజుల ఆధారంగా మూడు వేరియంట్ల‌లో ల‌భిస్తున్నాయి. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 77 అంగుళాలు ఇలా మూడు ర‌కాలుగా ల‌భిస్తున్నాయి. 65 అంగుళాల వేరియంట్ ధర రూ.2,79,990 గా నిర్ణ‌యించారు. కాగా, 77-అంగుళాల వేరియంట్ ధర భారతదేశంలో రూ.6,99,900 గా నిర్ణ‌యించారు. ఈ రెండూ ఇప్పుడు భారతదేశంలోని సోనీ సెంటర్ స్టోర్‌లు, ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు మరియు ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 55-అంగుళాల వేరియంట్ ధర ఇంకా నిర్ణయించబడలేదు మరియు భారతదేశంలో త్వరలో విక్రయించబడుతుందని కంపెనీ పేర్కొంది. కాగా, ఇది భార‌త్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడ‌ల్‌ బాగా ఖ‌రీదైన‌ది మ‌రియు టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్ల‌డించింది.

Sony XR OLED A80K Series

భార‌త్‌లో ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన సోనీ బ్రావియా 32W830K స్మార్ట్‌టీవీ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల గురించి తెలుసుకుందాం:
Sony Bravia 32W830K HD స్మార్ట్‌టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 32-అంగుళాల (1,366x768 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో 50Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఇది HDR10 మరియు HLG ఫార్మాట్‌లకు మద్దతును కలిగి ఉంది. ఇది X-రియాలిటీ ప్రో పిక్చర్ ప్రాసెసర్, కలర్ మెరుగుదల కోసం లైవ్ కలర్ టెక్నాలజీ మరియు కాంట్రాస్ట్ మెరుగుదల కోసం డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ వంటి డిస్‌ప్లే-సంబంధిత ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉండి ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేస్తుంది.

Sony Bravia 32W830K టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10W ఫుల్ రేంజ్ ఓపెన్ బేఫిల్ స్పీకర్‌లతో వస్తుంది. TVలోని కనెక్టివిటీ ఎంపికలలో WiFi 802.11ac, బ్లూటూత్ v5, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, కాంపోజిట్ వీడియో ఇన్‌పుట్, మూడు HDMI పోర్ట్‌లు మరియు డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది హోమ్‌కిట్ మరియు ఎయిర్ ప్లే మద్దతుతో కూడా వస్తుంది. ఇది ఐఫోన్ లేదా ఐప్యాడ్ ని ఉపయోగించి కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగించవచ్చు. అదనంగా ఇందులో Vivid, స్టాండర్డ్, సినిమా, గేమ్, గ్రాఫిక్, ఫోటో మరియు కస్టమ్ పిక్చర్ మోడ్‌లను కూడా కలిగి ఉన్నాయి. సోనీ సంస్థ భారతదేశంలో 32-అంగుళాల Sony Bravia 32W830K స్మార్ట్ టీవీని రూ.28,990 ధర వద్ద విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Sony XR OLED A80K Series Smart Television Range Launched in India in 3 Sizes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X