ఆఫరంటే ఇదే కదా,స్మార్ట్‌ఫోన్ ధరకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

    దేశీయ స్మార్ట్‌టీవీ రంగంలో దూసుకుపోతున్న షియోమికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. షియోమి టీవీలను సవాల్ చేస్తూ Mi TV 4, Mi TV 4A స్మార్ట్‌టీవీలను సవాల్ చేస్తూ టీసీఎల్ బడ్జెట్ ధరలో సరికొత్త టీవీలను లాంచ్ చేసింది. iFFALCON 55K2A, iFFALCON 40F2, iFFALCON 32F2 పేర్లతో ఈ టీవీలు ఇండియా మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా అమ్మకానికి రానున్నాయి. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద రన్ అయ్యే ఈ టీవీలు గూగుల్ ప్లే గేమ్స్ తో పాటు అన్ని రకాల యాప్స్ ని సపోర్ట్ చేసే విధంగా తయారుచేశారు. కాగా కంపెనీ Netflix, Jio Digital, YouTuube, Voot, and ErosNow వంటి దగ్గజాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నాన్యమైన సేవలను అందించేందుకు రెడీ అయింది.

    షియోమి సంచలనం, రూ. 13 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవి..

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    ధరలు

    కంపెనీ నుంచి విడుదలయిన iFFALCON 55K2A ధర రూ.45,999గా టీసీఎల్ నిర్ణయించింది. అలాగే iFFALCON 40F2 ధరను రూ. 19,999గా నిర్ణయించింది. ఇక చివరిగా అత్యంత తక్కువ ధరలో iFFALCON 32F2ని కస్టమర్లకు అందిస్తోంది. దీని ధర రూ. 13,499 మాత్రమే.

    ఫీచర్లు

    కాగా ఈ టీవీలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. ఐఫాల్కన్ 32, 40 ఇంచుల టీవీలలో డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజ్, 768 ఎంబీ ర్యామ్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు కామన్‌గా ఉండగా, 55 ఇంచుల మోడల్ టీవీలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16 జీబీ స్టోరేజ్, 2.5 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు ఉన్నాయి.

    ప్రీ ఇన్ స్టాల్ యాప్స్

    ఈ స్మార్ట్ టీవీల్లో Netflix, JioCinema, app storeలు ప్రీ ఇన్ స్టాల్ అయి వస్తున్నాయి. వీటి ద్వారా యూజర్లు 500 యాప్ లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తోంది. దీంతో పాటు కొత్త T-Cast featureను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయవచ్చు.

    Mi TV 4 స్సెసిఫికేషన్స్..

    కాగా షియోమి ఎంఐ టీవీ4 ధర మార్కెట్లో రూ. 39,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే 4.9 ఎంఎం అల్ట్రా-థిన్‌ ఫ్రేమ్‌లెస్‌ డిజైన్,55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్‌ (3840x2160 పిక్సెల్స్‌)
    హెచ్‌డీఆర్‌ సపోర్ట్, 64 బిట్‌ 1.8 గిగాహెర్జ్ట్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ. ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

    43 అంగుళాల Mi TV 4A specifications

    43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది. 43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది. Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

    Xiaomi 32-Inch Mi TV 4A specifications

    sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

    iFFALCON టీవీలపై మరిన్ని స్టోరీలు

    లేటెస్ట్ టెక్నాలజీతో TCL iFFALCON Smart TVలు,ధరలు ఇవే !

    స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీ

     

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    TCL iFFALCON Smart TVs goes on sale via Flipkart, will compete with Xiaomi's Mi TV 4, Mi TV 4A range More news at Gizbot Telugu
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more