CES 2021: TCL కొత్త టీవీలు లాంచ్!! వాటిలో ఉపయోగించే టెక్నాలజీలపై ఓ లుక్ వేయండి

|

కరోనా మొదలైన తరువాత 2020లో అన్ని రకాల ఈవెంట్ షోలు జరగడం చూడలేదు. 2021 లో మొదటి సారిగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2021 ప్రారంభం అయింది. ఈ ఈవెంట్ లో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ TCL కొత్తగా తన యొక్క మినీ ఎల్‌ఇడి, క్యూఎల్‌ఇడి, 4K HDR టీవీలను ఆవిష్కరించింది. ఈ లైనప్‌లో టిసిఎల్ 4K మినీ ఎల్‌ఇడి టివి C825, టిసిఎల్ 4K క్యూఎల్‌డి టివి C725, టిసిఎల్ 4K హెచ్‌డిఆర్ టివి P725 వంటివి ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ టీవీ మోడల్స్ అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.

టిసిఎల్ ODజీరో మినీ-ఎల్ఇడి టెక్నాలజీ
 

టిసిఎల్ తన ODజీరో మినీ-ఎల్ఇడి టెక్నాలజీని మినీ-ఎల్ఇడి టీవీలో ఉపయోగించినట్లు ప్రకటించింది. ఇది అల్ట్రా-స్లిమ్ LED LCD టివిలను నిలువువరుసల అనుసంధానంతో అందించడానికి ఉపయోగించింది. ఇదే కాకుండా సంస్థ 2021 లో TCL గూగుల్ టివిల సిరీస్ ని యునైటెడ్ స్టేట్స్ నుండి టిసిఎల్ కస్టమర్లకు విడుదల చేయనున్నట్లు సిఇఎస్ 2021 లో ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

TCL 4K Mini LED TV C825 టెక్నాలజీ ఫీచర్స్

TCL 4K Mini LED TV C825 టెక్నాలజీ ఫీచర్స్

TCL 4K మినీ LED టివి C825 క్వాంటం డాట్ డిస్ప్లే టెక్నాలజీతో పాటు డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ ఇమేజింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ డాల్బీ విజన్ టెక్నాలజీ అనేది గదిలో మారుతున్న కాంతికి తగ్గట్టుగా టీవీలోని షోల కంటెంట్ రకాలను తిరిగి ప్లే చేయడం మరియు డైనమిక్‌గా సర్దుబాటు చేయడం ద్వారా ఖచ్చితమైన వ్యూను అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ టీవీ 120Hz MEMC మరియు 120Hz రివర్స్ డిస్ప్లే ఫీచర్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. కనెక్టివిటీ ఎంపికలలో 4-వే HDMI 2.1 పోర్ట్, VRR, ALLM, eARC మరియు WiFi6 వంటివి ఉన్నాయి. మాగ్నెటిక్ స్ప్లిట్-టైప్ కెమెరాలలో 4M పిక్సెల్స్ ఉన్నాయి. ఇవి వినియోగదారులు వీడియో కాల్స్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

TCL QLED C725, and 4K HDR TV P725 టెక్నాలజీ ఫీచర్స్
 

TCL QLED C725, and 4K HDR TV P725 టెక్నాలజీ ఫీచర్స్

TCL C725 క్యూఎల్‌ఇడి 4K టివిలో 100 శాతం అల్ట్రా-హై కలర్ గాముత్ (DCI-P3) తో పాటుగా క్వాంటం డాట్ డిస్ప్లే టెక్నాలజీ కూడా ఉంది. డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ ఆడియోతో పాటు ఒన్కియో వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. C725 యొక్క AiPQ ఇంజిన్ విభిన్న కంటెంట్ జెనెర్స్ కోసం రియల్-టైమ్ ఆప్టిమైజేషన్‌ను అనుమతిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే & మూవీ మరియు డిస్నీ + వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో MEMC మరియు HDMI 2.1 పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే TCL P725 4K హెచ్‌డిఆర్ టివిలో సరికొత్త డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ 2.0 మరియు ఆండ్రాయిడ్ టివి OS వంటివి ఉన్నాయి. ఇది మిల్లీమీటర్-సన్నని మెటాలిక్ ట్రిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.

TCL’s ODZero టెక్నాలజీ

TCL’s ODZero టెక్నాలజీ

మినీ-ఎల్‌ఇడి బ్యాక్‌లైట్ లేయర్ మరియు ఎల్‌సిడి డిస్‌ప్లే లేయర్ (డిఫ్యూజర్ ప్లేట్) మధ్య ఆప్టికల్ డిస్టెన్స్ 0 మిమీకి తగ్గించబడిందని సంస్థ తెలిపింది. ఇది కంపెనీకి అల్ట్రా-లెస్ హై-పెర్ఫార్మెన్స్ బ్యాక్‌లైట్ మాడ్యూల్‌ను రూపొందించడానికి వీలు కల్పించిందని టిసిఎల్ తెలిపింది. ఈ మినీ-ఎల్ఈడి టెక్నాలజీ అనేది టీవీ పరిశ్రమను మార్పు చేస్తుంది అని మేము విశ్వసిస్తున్నాము మరియు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో మేము మరోసారి డిస్ప్లే నాణ్యతను పెంచుతున్నాము అని టిసిఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ మరియు టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ సిఇఒ కెవిన్ వాంగ్ CES 2021లో తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
TCL Released 4K Mini LED, 4K QLED and 4K HDR TVs at CES 2021 Event: Technology Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X