మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, లేటెస్ట్ టెక్నాలజీతో ఖాకీల పహారా, పూర్తి వివరాలు !

Written By:

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణా రాష్ట్రం అత్యాధునిక టెక్నాలజీతో ముస్తాబైంది. ఈ జాతరలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. కోటిమందికి పైగా భక్తులు ఈ వేడుకకు హాజరవుతారనే అంచనా వేసిన ప్రభుత్వం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులను కోరడంతో వారు లేటెస్ట్ టెక్నాలజీతో పహారా కాచేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మేడారం పరిధిలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు భక్తుల సౌకర్యార్ధం ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోనున్నాయి. జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు ఈ జాతర జరగనుంది. ఈ జాతరలో పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీపై ఓ లుక్కేద్దాం.

రూ.500లో ఫీచర్ ఫోన్ వస్తే...పెద్దలకు గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు కదా,అయితే మీకోసమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రోన్ కెమెరాలు

జాతర జరిగే నాలుగు రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు డ్రోన్లను వినియోగించనున్నారు. ఈ డ్రోన్ల ద్వారా ట్రాఫిక్, తొక్కిసలాట వంటివి జరగకుండా చూడనున్నారు.

క్రౌడ్ డిటెన్సన్ కెమెరాలు

ఈ కెమెరాల ద్వారా అక్కడ ఎటువంటి అవాంతరాలు ఎదురైనా క్షణాల్లో పోలీసు కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఎక్కడ జనసమూహం గుమికూడి ఉన్నా అక్కడికి పోలీసులు చేరుకునే విధంగా ఈ క్రౌడ్ డిటెన్సన్ కెమెరాలు సేవలు అందించనున్నాయి.

వీఎంఎస్

వీఎంఎస్ టెక్నాలజీ జాతరకు వచ్చే వారు తప్పిపోకుండా పోలీసులకు సమాచారం అందించడంలో తమవంతు సహాయాన్ని అందించనుంది. ఇవి 10 వరకు జాతరలో కనిపించనున్నాయి. ఈ టెక్నాలజీలో తప్పిపోయిన ఫోటోలను డిస్ ప్లే చేస్తూ వారి సంబంధీకుల వివరాలను ప్రదర్శిస్తారు. వారి గురించి పోలీసులు మైకులో చెప్పి వారిని వారి కుటుంబ సభ్యులకు చేర్చేందుకు ఈ టెక్నాలజీ తన సహాయ సహకారాలను అందించనుంది.

క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు

ఈ కెమెరాలు మొత్తం ఆరు జాతరలో కనిపించనున్నాయి. ఈ కెమెరాలు గద్దెల వద్దకు భక్తులు వెళ్లే సమయంలో అక్కడ జరిగే అవాంతరాలను పోలీసులకు చేరవేయనుంది. ఎక్కువ సమయం గద్దెల దగ్గర ఉన్నవారిని అలర్ట్ చేస్తూ వారిని అక్కడినుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేసేందుకు పోలీసులకు ఈ కెమెరాలు సహకరించనున్నాయి.

హెలికాప్టర్ ద్వారా జాతర వీక్షణం

రెవిన్యూ శాఖ మేడారం జాతరను గగనతలంలో నుంచి వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఈ సేవలను పొందాలనుకునే వారు యాప్ ద్వారా బుకింగ్ చేుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు. ఛార్జీల వివరాలను సంబంధిత రెవిన్యూ శాఖను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.

సీసీటీవీ కెమెరాలు

ఈ జాతరలో మొత్తం 20 సీసీ కెమెరాలను పోలీసులు ఉపయోగించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, జాతరలో రద్దీని గుర్తించటం, దొంగతనాల నివారణ, బందోబస్తును పర్యవేక్షించేందుకు మేడారం పరిసరాల్లో అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్నవాగు, చిలుకలగుట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, రెడ్డిగూడెం, ఇంగ్లిష్‌మీడియం, వనం రోడ్డు, గద్దెల ప్రాంగణం, మేడారం వై జంక్షన్, పోలీసు క్యాంపు ప్రాంతాల్లో ఈ కెమెరాలు అమర్చారు. వీటిని పోలీసు క్యాంపు వద్ద నిర్మించిన కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.

ఆర్టీసీ యాప్

ఈ జాతరకు ప్రత్యేకంగా ఆర్టీసీ వజ్ర బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు అప్ అండ్ డౌన్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. వజ్ర యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు అక్కడ కాటేజీల కోసం టీఎస్టీడీసీ సైటు ద్వారా బుక్ చేసుకోవచ్చు.

యాప్ కోసం క్లిక్ చేయండి

ఇంట్రానెట్, పోలీసుల యాప్

ఇంట్రానెట్ ద్వారా ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా అధికారులు సిబ్బంది నిరంతర సమాచారం కొనసాగించే అవకాశం ఉంది. ఇక పోలీస్ యాప్ ద్వారా పార్కింగ్ ఎక్కడ అందుబాటులో ఉంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. కాగా ఈ యాప్ ఈ నెల 24 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

యాప్  కోసం క్లిక్ చేయండి

ఎంప్లాయీస్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్

ఈ సాఫ్ట్‌వేర్ పూర్తిగా పోలీసులకు సంబంధించినదే అయినా, జాతరలో తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ముందుగా మేడారంలోని జాతరను సెక్టార్లుగా విభజిస్తారు. ఏ సెక్టార్లలో ఏయే అధికారులు, సిబ్బంది పనిచేయాలో వారికి ఎస్సెమ్మెస్ రూపంలో సందేశాలు పంపిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telangana Festival : MEDARAM JATARA Police Using hi-tech gadgets and Innovative technology More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot