ఈ దుస్తులు ధరిస్తే మీలో ఊహించని మార్పులు వస్తాయి !

ఇంట్లో పెద్దవాళ్లు కాలానుగుణంగా బట్టలను వేసుకోవాలని చెబుతుంటారు. అయితే అన్ని కాలాల్లో ఒకే రకమైన దుస్తులను వేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.

|

ఇంట్లో పెద్దవాళ్లు కాలానుగుణంగా బట్టలను వేసుకోవాలని చెబుతుంటారు. అయితే అన్ని కాలాల్లో ఒకే రకమైన దుస్తులను వేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. అయితే దీనిపై శాస్ర్తవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారనే విషయం చాలామందికి తెలియదు. టెక్నాలజీ రోజు రొజుకు అమిత వేగంగా పెరిగిపోతున్న నేటి తరుణంలో శాస్ర్తవేత్తలు కూడా దుస్తులపై తమ మెదడుకు పనిచెప్పి సరికొత్త వస్త్రాలను తయారుచేశారు. అదెలా ఉందో ఓ సారి చూద్దాం.

ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో వ్యభిచారం నడుస్తోందా ?<br>ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో వ్యభిచారం నడుస్తోందా ?

వినూత్నమైన వస్త్రం

వినూత్నమైన వస్త్రం

యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఎండాకాలంలో చల్లగానూ.. చలికాలంలో వెచ్చగానూ మారిపోయేలా ఈ వస్త్రం ఉంటుంది. మీ శరీరం వెచ్చగా ఉంటూ చెమట పడుతూ ఉంటే వెంటనే దాన్ని ఈ వస్త్రం దాన్ని గుర్తిస్తుంది.

శరీరం మొత్తం

శరీరం మొత్తం

గుర్తించిన వెంటనే పరారుణ కాంతి బయటి నుంచి లోపలికి ప్రసరించేలా చేస్తుంది.. శరీరం మొత్తం పొడిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం ద్వారా ఒళ్లు వెచ్చగా ఉండేలా చేస్తుందని వివరించారు. తద్వారా చెమటను తరిమేస్తుంది.

వదిలించుకునే లక్షణాలు

వదిలించుకునే లక్షణాలు

నీటిని శోషించుకునే , వదిలించుకునే లక్షణాలున్న రెండు రకాల పోగులతో ఈ వస్త్రం తయారవుతుందని వీటికి కార్బన్‌ నానోట్యూబుల పూత పూయడం ద్వారా అవి ప్రత్యేక లక్షణాలను కనబరుస్తాయని యూహాంగ్‌ వాంగ్‌ అనే శాస్త్రవేత్త వివరించారు.

వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి

వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి

ఒక రకమైన పోగు పరారుణ కాంతిని అడ్డుకుంటే, ఇంకోటి బయటకు పంపేలా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. ఈ వస్త్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని రంగులద్దే సమయంలో కార్బన్‌ నానో ట్యూబులను జత చేయడం ద్వారా సులువుగా తయారు చేయవచ్చునని ఆయన అన్నారు.

Best Mobiles in India

English summary
Temperature regulated smart clothes that keeps you cool More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X