ఈ AC (ఏసీ)లు ఇయ‌ర్‌ఫోన్‌ల క‌న్నా ధ‌ర త‌క్కువ‌.. ఓ లుక్కేయండి!

|

భారతదేశంలో ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో వ‌ర్షాకాలం కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు వేడి మరియు తేమ కార‌ణంగా ఉక్క‌పోత‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ‌లితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏసీ(AC) వాడకం బాగా పెరిగిపోతోంది. అయితే, AC ధరలు మాత్రం సాధార‌ణ ప్ర‌జానీకానికి ఏమాత్రం అందుబాటులో లేవు. ఇంకా వేస‌వి కాలంలో అయితే వీటి ధ‌ర‌లు భారీగా ఉంటాయి.

 
ఈ AC (ఏసీ)లు ఇయ‌ర్‌ఫోన్‌ల క‌న్నా ధ‌ర త‌క్కువ‌.. ఓ లుక్కేయండి!

అటువంటి పరిస్థితిలో, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఏసీలు కొనాలంటే క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అయితే, బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉన్న‌వారు పోర్టబుల్ AC (పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్)ని ఎంచుకోవచ్చు. పోర్ట‌బుల్ ఏసీలు చాలా చిన్నగా ఉంటాయి.. మరియు తక్కువ ధరతో అందుబాటులోకి వ‌స్తాయి. ఈ మినీ ఏసీలు మీకు చల్లని గాలిని అందించగలవు మరియు కరెంటు లేకుండా గంటల తరబడి ర‌న్ అవుతాయి.

Vogek 2-in-1 6000mAh పవర్ బ్యాంక్, మినీ ఎయిర్ కండీషనర్:

Vogek 2-in-1 6000mAh పవర్ బ్యాంక్, మినీ ఎయిర్ కండీషనర్:

ఈ డివైజ్ పేరు Vogek 2-in-1 6000mAh పవర్ బ్యాంక్, మినీ ఎయిర్ కండీషనర్. మీరు దీన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే, అది డెలివరీ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ మినీ ఎయిర్ కండిష‌న‌ర్ ద్వారా చల్లటి గాలిని పొందడమే కాకుండా, మీ మొబైల్ ఫోన్ పవర్ బ్యాంక్‌గా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు దానితో మొబైల్ ఛార్జ్ కూడా చేసుకోవ‌చ్చు. మినీ ఎయిర్ కండీషనర్‌తో కూడిన Vogek 2-in-1 6000mAh పవర్ బ్యాంక్ బ‌డ్జెట్ ధ‌ర‌లోనే వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్కెట్లో ఇవి కేవ‌లం రూ.949 ప్రారంభ ధ‌ర‌తో అందుబాటులో ఉన్నాయి.

వైట్ చెర్రీ ఎయిర్ కండిష‌న‌ర్‌:
 

వైట్ చెర్రీ ఎయిర్ కండిష‌న‌ర్‌:

ఈ వైట్‌చెర్రీ ఎయిర్ కండీషనర్ సాధార‌ణ ధర రూ.2,199, కాగా, ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,599కి అందుబాటులో ఉంది. ఈ ఏసీ గదిని బట్టి డిజైన్ చేయబడింది. ఇది చాలా తేలికగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది గదిలో ఎక్కడైనా అమర్చవచ్చు. దీన్ని ర‌న్ చేయ‌డానికి కరెంటు కూడా అవసరం లేదు. దీనిలో మీరు మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కి చాలా సులభంగా కనెక్ట్ అయ్యే USB కనెక్టర్‌ని పొందుతారు.

ఎయిర్ చిల్ మినీ ఎయిర్ కండీషనర్ యొక్క ప్రయోజనాలు:
* ఎయిర్ చిల్ యొక్క కూలింగ్ వ్యవస్థ పొడి ప్రాంతాల్లో చాలా సహాయకంగా ఉంటుంది.
* అలాగే, పొడి వాతావరణంలో వల్ల కలిగే అసౌకర్యం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలను 30 శాతం వరకు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
* ఎయిర్ చిల్ మీ ఇంటి లోపల తక్షణ కూలింగ్ క‌లిగించేలా ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది.
* ఇది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుచుకుంటూ మీ ఇండోర్ మరియు వ్యక్తిగత ప్రదేశాలను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇవి ఎయిర్ చిల్ యొక్క త‌యారీ కంపెనీల అధికారిక పోర్టల్ ద్వారా బడ్జెట్ అనుకూలమైన ధరలో అందించబడుతుంది.

అదేవిధంగా, మీరు మొబైల్ సేఫ్టీ కోసం మినీ ఫోన్ కూల‌ర్ ఫ్యాన్లు వినియోగించాల‌నుకుంటే.. అవి కూడా అతి త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం:

అదేవిధంగా, మీరు మొబైల్ సేఫ్టీ కోసం మినీ ఫోన్ కూల‌ర్ ఫ్యాన్లు వినియోగించాల‌నుకుంటే.. అవి కూడా అతి త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం:

మినీ ఫోన్ Cooler Fan - ధర: రూ.198
స్మార్ట్‌ఫోన్‌లు చాలా వ‌ర‌కు బాగా వేడెక్కడం వల్ల కొన్ని సార్లు పేలుళ్లకు గురవుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించ‌డానికి ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని తగ్గించడం లేదా వివిధ రకాల టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం అనే సమస్య తీరడం లేదు. ఈ సమస్యను వదిలించుకోవడానికి మార్కెట్లో ఒక గాడ్జెట్ ఉంది. అదేంటంటే స్మార్ట్‌ఫోన్ కూలర్, మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు దీని ధర కూడా రూ.198 కే చాలా సరసమైన ధ‌ర‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
The cost of this AC is less than your earphones, it will run for hours without electricity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X