ఈ మౌసే ఒక స్కానర్..

ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే. ఆలోచించటం ద్వారానే మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. త్వరలో మన ముంగిట నిలువనున్న 10 భవిష్యత్ టక్నాలజీలను ఓ లుక్కేయండి..

Read More : నోకియా 8 వచ్చేసింది.. ఇదుగోండి మొదటి లుక్, స్పెసిఫికేషన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్

ఈ సైన్స్ ఫిక్షన్ తరహా టెక్నాలజీ త్వరలోనే మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తథ్యం.. 

స్మార్ట్ రింగ్

ఈ డిజిటల్ జ్యూయలరీ రింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ తరహాలోనే స్మార్ట్ మొబైలింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఆలోచన చాలా స్మార్ట్‌గా ఉంది కందడీ.

స్వరోస్కీ అండ్ మిస్‌ఫిట్ యాక్టివిటీ ట్రాకర్స్

జ్యూయలరీ తరహాలో ఉండే ఈ ట్రాకింగ్ మానిటర్ మనిషి ఆర్యోగం ఇంకా ఫిట్నెస్ లెవల్స్‌ను పరీక్షించుకోవచ్చు.

జెడ్ స్కాన్+

మౌస్ తరహాలో ఉండే ఈ డివైస్ డాక్యుమెంట్‌లను ఇట్టే స్కాన్ చేసేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ పోర్టబుల్ స్కానర్‌ను ఉపయోగించుకోవచ్చు.

మింట్

ఈ శ్వాస విశ్లేషణ సాధనం యూజర్ తీసుకున్న ఆల్కాహాల్ శాతాన్ని విశ్లేషిస్తుంది.

సెన్స్

ఈ స్లీప్ ట్రాకింగ్ డివైస్ సెన్స్ స్మార్ట్ అలారమ్ వ్యవస్థను కలిగి యూజర్ నిద్ర సైకిల్‌ను బట్టి అలారమ్‌ను సెట్ చేస్తుంది.

చెఫ్‌జెట్ అండ్ చెఫ్‌జెట్ ప్రో

ఈ 3డీ ప్రింటర్లు తినే పదార్థాలను అప్పటికప్పుడు మీ ముందు ప్రింట్ చేసేస్తాయి.

పర్సనల్ రోబోట్స్

వ్యక్తగత పనులను ఈ రోబోట్‌లు చక్కబెట్టేస్తాయి. రోబోటిక్స్ విభాగంలో ఇదో విప్లవాత్మక అంశంగా  చెప్పుకోవచ్చు.

కోపెన్హాగన్ వీల్

ప్రత్యేకమైన సాంకేతిక వ్యవస్థతో అందుబాటులోకి రానున్న ఈ సైకిల్ రైడర్ ఎనర్జీ లెవల్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

ప్యారట్ ఫ్లవర్ పవర్

ఈ ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ మొక్కల చుట్టు ఉన్న మట్టిన అధ్యయనం చేయటంతో పాటు ఆ మొక్కకు అవసరమైన కాంతి, ఉష్ణోగ్రత, ఫెర్టిలైజర్ ఇంకా తేమ స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The future is now: The 10 gadgets that will change your life. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot