Home
Gadgets

ఈ ఎయిర్‌పోడ్ ధర రూ.6 లక్షలు పైనే..

ఖరీదైన గాడ్జెట్‌లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ కంపెనీ బ్రిక్ (Brikk) అత్యంత ఖరీదైన యాపిల్ ఎయిర్‌పోడ్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ధర షుమారుగా 10,000 డాలర్లు.

By Bommu Sivanjaneyulu

ఖరీదైన గాడ్జెట్‌లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ కంపెనీ బ్రిక్ (Brikk) అత్యంత ఖరీదైన యాపిల్ ఎయిర్‌పోడ్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ధర షుమారుగా 10,000 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో రూ.6,84,600. ఖరీదైన ఉపకరణాలను తయారు చేయటంలో దిగ్గజ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న బ్రిక్, మిలియనీర్స్ కోసం ఖరీదైన గాడ్జెట్ లను తయారు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ అభివృద్థి చేసిన ఎయిర్‌పోడ్స్‌ను యాపిల్ సంస్థ 179 డాలర్లకు విక్రయిస్తోంది.

ఖరీదైన ఎయిర్‌పోడ్స్..

ఖరీదైన ఎయిర్‌పోడ్స్..

బ్రిక్ సంస్థ రెండు వెర్షన్ లలో ఈ లగ్జరీ గాడ్జెట్ ను అందిస్తోంది. అందులోని మొదటి వెర్షన్ ను క్లాసిక్ ఎడిషన్ గా పిలుస్తున్నారు. ఈ రకం ఎయిర్ పోడ్స్ ధరను 4,995 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.3,42,700)గా బ్రిక్ ఫిక్స్ చేసింది. ఇక రెండవ వెర్షన్ ను లగ్జరీ ఎడిషన్ గా పిలుస్తున్నారు. వీటి ధరను 9,995 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.6,85,107)గా కంపెనీ ఫిక్స్ చేసింది. ఇందులో మొదటి వెర్షన్ 24 క్యారెట్ల గోల్డుతోనూ, రెండవ వెర్షన్‌ను 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లేదా ప్లాటినమ్‌తో బ్రిక్ ఆఫర్ చేస్తోంది.

 

 

హైసొసైటీ లైఫ్‌స్టైల్‌ను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా...

హైసొసైటీ లైఫ్‌స్టైల్‌ను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా...

అంతేకాకుండా రెండవ వెర్షన్‌లో రెండు ప్రత్యేకమైన డైమెండ్లు ఉంటాయి. హైసొసైటీ లైఫ్‌స్టైల్‌ను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఎయిర్‌పోడ్‌లను అభివృద్థి చేసినట్లు బ్రిక్ వెల్లడించింది. లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. అయితే, కోటీశ్వరులు మాత్రమే కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.

వారు ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు...

వారు ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు...

సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఉన్నతమైన జీవనశైలికి అలవాటు పడిన అపర కుబేరుల కోసం పలు ఖరీదైన సాంకేతిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు ‘బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు.

జాబితాలో లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్‌తో పాటు వాచ్ కూడా..

జాబితాలో లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్‌తో పాటు వాచ్ కూడా..

వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు ఖరీదైన వస్తువులను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటిలో యాపిల్ బ్రాండ్‌కు సంబంధించిన లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్‌లతో పాటు, యాపిల్ వాచ్ ఇంకా ఐప్యాడ్స్ ఉన్నాయి.

 

 

Best Mobiles in India

English summary
According to the latest reports, recently, a well-known luxurious gadget and accessories maker, which is basically an American company and headquarters in Los Angeles, has just launched Apple AirPods of $10,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X