2018లో లాంచ్ అయిన 5 బెస్ట్ స్మార్ట్ టీవీలు!
పోర్టబులిటీ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నప్పటికి పెద్దసైజు టీవీలకు మాత్రం ఆదరణ తగ్గటం లేదు. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌టీవీలు ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచుతున్నాయ
పోర్టబులిటీ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నప్పటికి పెద్దసైజు టీవీలకు మాత్రం ఆదరణ తగ్గటం లేదు. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌టీవీలు ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచుతున్నాయి. మోడ్రన్ స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కనెక్టువిటీకి మరింత అనుకూలంగా ఉండటంతో నచ్చిన కంటెంట్‌ను ఎప్పడు కావాలంటే అప్పుడు పెద్దతెర పై వీక్షించే వీలు దొరుకుతోంది.

నేటి పత్యేక కథనంలో భాగంగా 2018కిగాను మార్కెట్లో లాంచ్ నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2018కిగాను మార్కెట్లో లాంచ్ అయి వినియోగదారుల నుంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న 5 బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

సామ్‌సంగ్ క్యూ9000ఆర్ 85-ఇంచ్ 8కే క్యూఎల్ఈడి టీవీ (Samsung Q900R 85-inch 8K QLED TV)
డిస్‌ప్లేల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సామ్‌సంగ్ తన స్మార్ట్ టీవీలను బెస్ట్-ఇన్-క్లాస్ డిస్‌ప్లే ప్యానల్స్‌తో ఆఫర్ చేస్తోంది. సామ్‌సంగ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన క్యూ9000ఆర్ 85-ఇంచ్ 8కే క్యూఎల్ఈడి టీవీ 4,320 x 7,680 పిక్సల్ రిసల్యూషన్‌తో 4,000nits బ్రైట్నెస్‌ను ఆఫర్ చేస్తోంది. హై-రిసల్యూషన్ వీడియోలను వీక్షించేందుకు ఈ టీవీ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ టీవీలో Ambient Modeను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా టీవీ వినియోగంలో లేనపుడు న్యూస్ హెడ్ లైన్స్, ఫోటోస్ డిస్‌ప్లే పై ప్లే అవుతుంటాయి. Bixby వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.

ఫిలిప్స్ యాంబిలైట్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ (Philips Ambilight 4K Ultra HD TV)
ఈ లిస్టులో రెండవది ఫిలిప్స్ యాంబిలైట్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ (Philips Ambilight 4K Ultra HD TV). డచ్ ప్రాంతానికి చెందిన మల్టినేషనల్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ తన యాంబిలైట్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ లైనప్‌ను 2015లో మార్కెట్లో రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిరీస్ మార్కెట్లో పాపులర్ అవుతూనే ఉంది.
ఈ టీవీలు ఆఫర్ చేసే 4కే రిసల్యూషన్ అద్భుతమైన పిక్షర్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఫిలిప్స్ తన యాంబిలైట్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన టీవీలు ద్వారా యూట్యూబ్, స్కైప్, విమియో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకునే వీలుంటుంది.
ఈ టీవీల్లో ఎక్స్‌క్లూజివ్‌గా పొందుపరిచిన యాంబియంట్ లైటింగ్, యాక్టివ్ 3డీ, మైక్రో డిమ్మింగ్ వంటి ఫీచర్లు వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. యాంబిలైట్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ లైనప్ నుంచి వస్తోన్న టీవీలు 50 ఇంచ్, 58 ఇంచ్, 65 ఇంచ్ సైజుల్లో లభ్యమవుతున్నాయి. వీటి ఖరీదు రూ.1,55,000 నుంచి రూ.3,72,500 మధ్య ఉంది.

షావోమి ఎంఐ టీవీ 4ఏ (Xiaomi Mi TV 4A)
ఈ లిస్టులో నాల్గవది షావోమి ఎంఐ టీవీ 4ఏ (Xiaomi Mi TV 4A). బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షావోమి, ఇటీవల స్మార్ట్ టీవీల మార్కెట్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ బ్రాండ్ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన మూడవ స్మార్ట్ టీవీ Mi TV 4A బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీగా గుర్తింపుతెచ్చుకుంది. ఈ ఫోన్ 32 ఇంచ్ ఇంకా 43 ఇంచ్ స్ర్కీన్ సైజుల్లో లభ్యమవుతోంది. 4కే రిసల్యూషన్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ టీవీలు ఆండ్రాయిడ్ Marshmallow ఆధారంగా అభివృద్థి చేసిన PatchWall ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సపోర్టుతో వస్తోన్న ఈ టీవీలకు సంబంధించి ప్రారంభ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది.

ఎల్‌జీ బి8 ఓఎల్ఈడి టీవీ (LG B8 OLED smart TV)
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో సామ్‌సంగ్ తరహా గుర్తింపును సొంతం చేసుకున్న బ్రాండ్‌లలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఎల్‌జీ బి8 ఓఎల్ఈడి టీవీ (LG B8 OLED TV) తన స్లీక్ డిజైనింగ్‌తో బెస్ట్ స్మార్ట్ టీవీగా గుర్తింపుతెచ్చుకుంది. ఈ టీవీ మొత్తం రెండు స్ర్కీన్ సైజుల్లో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటిది 55 ఇంచ్ కాగా రెండవది 65 ఇంచ్. WebOS ఆపరేటంగ్ సిస్టం పై ఈ టీవీలు రన్ అవుతాయి. HDR10 ఇంకా Dolby Vision కంటెంట్ ను ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సర్వీసెస్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లను ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి.

సామ్‌సంగ్ క్యూఎల్ఈడి ఎన్‌యు800 (Samsung QLED (NU800)
ఈ జాబితాలో ఐదవది సామ్‌సంగ్ క్యూఎల్ఈడి ఎన్‌యు800. ఈ అల్ట్రా- సిమ్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ ను ఆఫర్ చేయటంత పాటు 4కే క్వాలిటీ రిసల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. 65 ఇంచ్ అల్ట్రా హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోన్న ఈ టీవీ గరిష్టంగా 2160 x 3180 పిక్సల్ రిసల్యూషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో అమర్చిన QLED డిస్‌ప్లే ప్యానల్ HDR10 modeను సపోర్ట్ చేస్తుంది. థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సర్వీసెస్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








