కేవ‌లం రూ.200 లో వ‌చ్చే Gadgets ఇవి.. ప్ర‌తి రోజూ వినియోగించేవే!

|

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ల‌లో ర‌క‌ర‌కాల ఎల‌క్ట్రానిక్ Gadgets వినియోగం అనేది ప‌రిపాటిగా మారిపోయింది. ఎందుకంటే గాడ్జెట్‌లు మన జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మరియు సుల‌భ‌త‌రంగా మార్చుతాయి. అయితే, ప్ర‌జ‌లు నిత్యజీవితంలో ఉప‌యోగించే ప‌లు ర‌కాల Gadgets ప్ర‌స్తుతం చాలా చౌక ధ‌ర‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో మీరు డైలీ ఉప‌యోగించ‌గ‌లిగే ఆరు గ్యాడ్జెట్ల‌ను మీ ముందుకు తీసుకువ‌చ్చాం.

 

మేం జాబితా చేసిన ఈ నిఫ్టీ గాడ్జెట్‌లను మీరు రూ.200 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆ Gadgets ఏవి వాటి ప్ర‌త్యేక‌త‌లు ఇంకా వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

ఫోల్డబుల్ Mobile Stand- ధర: రూ.60

ఫోల్డబుల్ Mobile Stand- ధర: రూ.60

మీరు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కొత్త బ‌హిరంగ ప్రదేశంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ ను షూట్ చేయాలనుకుంటే మొబైల్ ఇన్‌స్టాల్ చేయ‌డానికి కొంత ఇబ్బంది అవుతుంది. అయితే, ఈ చిన్న ఫోల్డ‌బుల్‌ మొబైల్ స్టాండ్ కొన్నారంటే మీకు అలాంటి ఆందోళ‌న ఉండ‌దు. ఎక్క‌డికి వెళ్లినా సులువుగా మొబైల్‌ను దానికి ఇన్‌స్టాల్ చేసి షూట్ చేసుకోవ‌చ్చు. అలాగే మీరు సినిమాలు చూడటానికి మరియు ఆన్‌లైన్ సమావేశాలలో పాల్గొనడానికి హ్యాండ్స్‌ఫ్రీ కూడా చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ధ‌ర మార్కెట్లో రూ.60 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Selfie Stick- ధర: రూ.129

Selfie Stick- ధర: రూ.129

సెల్ఫీ స్టిక్స్ ఫోటోగ్రఫీలో సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఫొటోగ్రాఫీపై ఆస‌క్తి ఉన్న వారికి ఈ గ్యాడ్జెట్ బాగా ఉప‌యోగ‌క‌రంగా ఉంది. ఇది మన్నికైనది, తేలికైనది. నాన్-స్లిప్ సిలికాన్ హ్యాండిల్ క‌లిగి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ యాంగిల్‌ను 270 డిగ్రీల వరకు సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతించే ప్రత్యేకమైన బాల్ హెడ్‌తో వస్తుంది. మార్కెట్లో ఇవి రూ.129 నుంచి అందుబాటులో ఉన్నాయి.

యాంటీ-స్లిప్ సిలికాన్ Ear Buds- ధర: రూ.77
 

యాంటీ-స్లిప్ సిలికాన్ Ear Buds- ధర: రూ.77

ఈ యాంటీ-స్లిప్ సిలికాన్ ఇయర్ బడ్స్ మీ ఇయ‌ర్‌బ‌డ్స్‌కు అమ‌ర్చుకోవ‌డం ద్వారా మీ చెవులను అన‌వ‌స‌ర శ‌బ్దాల నుంచి కాపాడుకోవ‌డ‌మే కాకుండా, మీ చెవుల నుండి ఇయర్‌బడ్‌లు కింద పడిపోయే అవకాశాలను కూడా తగ్గించే విధంగా ఇవి రూపొందించబడ్డాయి. మీరు వాటిని వ్యాయామశాలలో ఉన్న‌ప్పుడు, లేదా వాకింగ్ చేస్తున్న‌ప్పుడు ఇతర క్రీడలలో ఉన్న‌ప్పుడు ఇంకేదైనా వాతావరణంలోనైనా ఉపయోగించవచ్చు.

మినీ ఫోన్ Coole Fan - ధర: రూ.198

మినీ ఫోన్ Coole Fan - ధర: రూ.198

స్మార్ట్‌ఫోన్‌లు చాలా వ‌ర‌కు బాగా వేడెక్కడం వల్ల కొన్ని సార్లు పేలుళ్లకు గురవుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించ‌డానికి ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని తగ్గించడం లేదా వివిధ రకాల టెక్నిక్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం అనే సమస్య తీరడం లేదు. ఈ సమస్యను వదిలించుకోవడానికి మార్కెట్లో ఒక గాడ్జెట్ ఉంది. అదేంటంటే స్మార్ట్‌ఫోన్ కూలర్, మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు దీని ధర కూడా రూ.198 కే చాలా సరసమైన ధ‌ర‌లో అందుబాటులో ఉంది.

Case- ధర: రూ.80

Case- ధర: రూ.80

మ‌నం నిత్యజీవితంలో ఉప‌యోగించే చిన్న‌పాటి గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే వాటిని సుర‌క్షితంగా భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌డానికి ఈ చిన్న కేసు ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు ఇయర్‌ఫోన్‌లు, SD కార్డ్, ఐపాడ్ షఫుల్, ఛార్జింగ్ కేబుల్, మెమరీ కార్డ్, USB ఫ్లాష్ డ్రైవ్, మరియు నాణేలతో సహా మీ వస్తువులను తీసుకెళ్లవచ్చు. ఇది తేలికైనది మరియు తీసుకువెళ్లడం సులభం. మీ చిన్న వ‌స్తువుల్ని జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌డానికి ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

వాల్ మౌంట్ ఫోన్ హోల్డర్ - ధర: రూ.99

వాల్ మౌంట్ ఫోన్ హోల్డర్ - ధర: రూ.99

ఇది మెటల్ బాడీతో తయారు చేయ‌డం జ‌రుగుతుంది. ఈ హోల్డ‌ర్‌ను కేవలం రూ.99కే కొనుగోలు చేయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. ఇది ఫోన్ ఛార్జింగ్ పెట్టే స‌మ‌యంలో భ‌ద్రంగా ఉంచ‌డానికి ఉప‌యోగప‌డుతుంది. అంతేకాకుండా, తాళం చెవిలను పెట్టుకోవ‌డానికి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
These gadgets less than 200 rupees, which come every day for your work

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X