రూ.100 లోపు ల‌భించే బెస్ట్ ఎల‌క్ట్రానిక్ gadgets.. మీరూ ఓ లుక్కేయండి!

|

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ల‌లో ర‌క‌ర‌కాల ఎల‌క్ట్రానిక్ Gadgets వినియోగం అనేది స‌ర్వ‌సాధారణం అయింది. నిత్యం ఇంట్లో ఏదో ఓ గ్యాడ్జెట్‌తో అవ‌స‌రం ప‌డుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గాడ్జెట్‌లు మన జీవితాన్ని మరింత సుల‌భ‌త‌రంగా మార్చుతాయి. అయితే, ప్ర‌జ‌లు నిత్యజీవితంలో ఉప‌యోగించే ప‌లు ర‌కాల Gadgets ప్ర‌స్తుతం చాలా చౌక ధ‌ర‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో మీరు డైలీ ఉప‌యోగించ‌గ‌లిగే ఐదు గ్యాడ్జెట్ల‌ను మీ ముందుకు తీసుకువ‌చ్చాం.

 

మేం జాబితా చేసిన ఈ నిఫ్టీ గాడ్జెట్‌లను మీరు రూ.100 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆ Gadgets ఏవి వాటి ప్ర‌త్యేక‌త‌లు ఇంకా వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి. కాబట్టి ఆలస్యం చేయకుండా, ఈ జాబితాలోని ఏ గ్యాడ్జెట్‌లను రూ.100 లోపు కొనుగోలు చేయవచ్చో చూద్దాం.

Cable Protector

Cable Protector

సాధార‌ణంగా ఛార్జింగ్ కేబుల్స్ కావ‌చ్చు, మ‌రేదైనా డేటా కేబుల్ కావ‌చ్చు. వాటిని కొద్ది రోజులు వినియోగించిన త‌ర్వాత‌ పిన్ వ‌ద్ద వైర్‌ లీడ్స్ బ‌య‌టికి తేలి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాంటప్పుడు షాక్ వ‌చ్చే ప్ర‌మాదాలు ఉంటాయి. ఇలాంటి వాటిని నివారించ‌డానికి మీరు కేబుల్ ప్రొటెక్ట‌ర్ అనే గాడ్జెట్‌ను మీరు వినియోగించ‌వ‌చ్చు. మార్కెట్లో ఇవి రూ.100 లోపే స‌ర‌స‌మైన ధ‌ర‌లో కొనుగోలు చేయ‌డానికి అందుబాటులో ఉన్నాయి. ఇది మీ కేబుల్‌ను పూర్తిగా సురక్షితంగా ఉంచుతుంది.

4-Port USB Hub

4-Port USB Hub

మీరు ఎప్పుడైనా మీ ల్యాప్‌టాప్‌కు కొన్ని పెన్ డ్రైవ్‌లు, లేదా డేటా కేబుల్స్ కనెక్ట్ చేయ‌ల‌నుకున్న‌ప్పుడు డివైజ్‌కు ఉండే పోర్టులు స‌రిపోవు. ఎందుకంటే.. ల్యాప్‌టాప్‌ల‌కు మ‌హా అయితే ఒకటి లేదా రెండు యూఎస్‌బీ పోర్టులు మాత్ర‌మే కంపెనీలు ఆఫ‌ర్ చేస్తాయి. కాబ‌ట్టి ఎక్కువ పోర్టులు యూజ్ చేయాల‌నుకున్న‌ప్పుడు అవి స‌రిపోవు. కాబ‌ట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు మార్కెట్లో 4 పోర్ట్ యూఎస్‌బీ పోర్ట్ గాడ్జెట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. అది కూడా రూ.100 లోపే అందుబాటులో ఉన్నాయి. అధికంగా యూఎస్‌బీ పోర్టులు అవ‌స‌రం ఉంటుంది అనుకునే వ్య‌క్తులు వాటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ నాలుగు పోర్ట్ USB హబ్‌ని మనం కేవలం రూ.99కే కొనుగోలు చేయవచ్చు.

SmartPhone Wall Holder
 

SmartPhone Wall Holder

ప్ర‌తి ఒక్క‌రి ఇళ్ల‌లో మొబైల్ ఛార్జింగ్ పెట్ట‌డానికి సాకెట్ ఉంటుంది. కానీ, చాలా వ‌ర‌కు ఛార్జింగ్ పెట్టిన‌పుడు మొబైల్‌ను కింద ప‌డిపోకుండా సేఫ్‌గా ప్లేస్ చేయ‌డానికి ఏమీ ఉండ‌దు. అలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టడానికి ఈ స్మార్ట్‌ఫోన్ వాల్ హోల్డ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎవ‌రికైనా ఆస‌క్తి ఉంటే స్మార్ట్‌ఫోన్ వాల్ హోల్డ‌ర్ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. మార్కెట్లో ఇవి చాలా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్నాయి. కేవ‌లం ఒక చిన్న టేప్ ద్వారా దీన్ని గోడ‌పై అతికించుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు.

USB Optical Mouse

USB Optical Mouse

రూ.100 కంటే తక్కువ ధరతో మీరు పొందగలిగే మరో అద్భుతమైన గాడ్జెట్ ఆప్టికల్ మౌస్. జిబ్రానిక్ కంపెనీకి చెందిన ఈ ఆప్టిక‌ల్ మౌజ్ 1200 dpi మూడు బటన్లు మరియు 1.2m కేబుల్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడు ధర విషయానికొస్తే.. ఇది కేవలం రూ.84 ధరకే వ‌స్తోంది. గేమింగ్ మౌస్ లేదా మరేదైనా సాధారణ మౌస్‌తో పోలిస్తే ఇది చిన్నదని చెప్పొచ్చు. కానీ, ఇది బాగా పనిచేస్తుంది.

Earphone Pouch

Earphone Pouch

ఇటీవ‌లి కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ ఇయ‌ర్ బ‌డ్స్ లేదా ఇయ‌ర్‌ఫోన్స్ ను వినియోగించ‌డం స‌ర్వ సాధార‌ణం అయింది. అయితే, యూజ‌ర్ల‌కు వాటిని వినియోగించిన త‌ర్వాత ఎలా ప‌డితే అలా ప్లేస్ చేయ‌డం ద్వారా అవి పాడ‌య్యే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, వాటిని సుర‌క్షితంగా ఉంచుకోవ‌డానికి ఇయ‌ర్‌ఫోన్ పౌచ్‌లు మార్కెట్లో చాలా వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. అది కూడా చాలా స‌ర‌స‌మైన ధ‌ర‌లనే అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించ‌డం ద్వారా ఇయర్‌ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు. ఇయ‌ర్‌ఫోన్స్‌ను వినియోగించిన త‌ర్వాత జాగ్ర‌త్త‌గా చుట్టి అందులో భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
These tech gadgets that come at just 99 rupees

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X