ఫ్లయింగ్ డ్రోన్స్ లో KFC చికెన్ వింగ్స్...ఐడియా అదుర్స్!

By Madhavi Lagishetty
|

KFC... ఈ పేరు తెలియని వారుండరు. చికెన్ ప్రియులకైతే...KFC అనగానే నోరూరుతుంది. వేడి వేడి చికెన్ వింగ్స్ లొట్టలేసుకుని మరీ తింటుంటాం. అయితే ఇఫ్పుడు గ్రిల్డ్ చికెన్ వింగ్స్ కోసం KFC రెస్టారెంట్ వరకు వెళ్లాల్సిన పనిలేదు. అవే మనదగ్గరకు వస్తాయి. అదేలా అంటారా....ఇప్పుడు KFC స్మోకీ గ్రిల్డ్ వింగ్స్ ను డ్రోన్ బాక్సుల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ప్రస్తుతానికి రెండు రకాల వింగ్స్ ఉన్నాయి. అయితే భారతదేశంలో డ్రోన్స్ డబుల్ గా పనిచేస్తాయి.

 
ఫ్లయింగ్ డ్రోన్స్ లో KFC చికెన్ వింగ్స్...ఐడియా అదుర్స్!

ఈ స్మోకీ గ్రిల్డ్ చికెన్ వింగ్స్ ను ఇండియాలో ఎంపిక చేసిన 10 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ KFC స్మోకీ గ్రిల్డ్ వింగ్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా ఆర్డర్ చేసినట్లయితే... ఎగురుకుంటూ మీ ఇంటివద్దకే వస్తాయి.

ఇక KFC కాంబో ప్యాక్ ను KFO గా పేర్కొంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మీల్ కాంబో గా పేర్కొంది. ఎరుపు మరియు తెలుపు రంగు బాక్సుతో ప్యాకేజింగ్ అయి వస్తుంది. డ్రోన్ ఆర్డర్ చేసిన ప్రదేశానికి చేరుకోగానే...ఈజీగా భాగాలను వేరు చేస్తుంది. నాలుగువైపులా ఉన్న డ్రోన్ భాగాలు తెరుచుకోగానే....మీల్ ప్యాకేజీ బయటకు వస్తుంది. కస్టమర్ ప్యాకేజిని అందుకోగానే...డ్రోన్ తిరిగి KFCకి చేరుకుంటుంది. అయితే ఫ్లయింగ్ డ్రోమ్ ప్యాకేజీని ఆర్డర్ చేయడానికి ఆన్ లైన్ యూజర్ మ్యానువల్ను ఉపయోగింవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా తొందరగా కస్టమర్ కు అందేలా యూజర్ మ్యానువల్ చేయడానికి అనుమతిస్తుంది.

యూజర్ చేయాల్సిన పని ఏంటంటే...పవర్ స్విచ్ కానీ బ్లూటూత్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్ తో డివైసును కనెక్ట్ చేయండి. స్మోకీ గ్రిల్డ్ చికెన్ వింగ్స్ ను ఆర్డర్ చేసినప్పుడు కెంటుకి ఫ్లయింగ్ ఆబ్జెక్ ను కస్టమర్లు సెలక్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎంపిక చేసిన 10 నగరాల్లోని 12 దుకాణాల్లో ఈనెల 25, 26 తేదీల్లో స్మోకీ గ్రిల్డ్ చికెన్ వింగ్స్ ను ఆర్డర్ చేయవచ్చు.

డ్రోన్ మీల్ ప్రయోగం గురించి KFC ఇండియా CMO స్పందించారు. ఆహారం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండూ కూడా మా వినియోగదారులను ఉత్తేజపరుస్తాయన్నారు. స్మోకీ గ్రిల్డ్ వింగ్స్ పరిచయం చేయడం, పరిమిత ఎడిషన్ KFO ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు ఇది సూపర్ డ్రోన్ ప్యాకేజీగా ఉందన్నారు.

25లేదా 26వ తేదీల్లో సమీపంలోని KFC రెస్టారెంట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు KFC 24ల క్కీ కస్టమర్లను కూడా ప్రకటిస్తుందట.

తేదీ సమయం సీటీ అవులెట్....

1. 25 Jan, గురువారం 1:00 - 4:00 PM ఢిల్లీ 6 & 7, సింధియా హౌస్, ఔటర్ సర్కిల్, కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ, ఢిల్లీ 110001

2. 25 Jan, గురువారం 1:00 - 4:00 PM ముంబై Kenilworth మాల్, లింకింగ్ రోడ్, బాంద్ర వెస్ట్, ముంబై, మహారాష్ట్ర 400050

3. 25 Jan, గురువారం 4:00 - 7:00 PM కోలకతా 20K, ఫోర్ట్ పీటర్ క్యాట్ రిసౌటెంట్, పార్క్ స్ట్రీట్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ 700017

 

4. 25 Jan, గురువారం 4:00 - 7:00 PM పుణె అమనోర టౌన్ సెంటర్, అమనోర పార్క్ టౌన్, హడాప్సర్, పుణె, మహారాష్ట్ర 411028

5. 25 Jan, గురువారం 4:00 - 7:00 PM చెన్నై 183/188, ఆర్కోట్ రోడ్, పళనిప్ప నగర్, వడపలని, చెన్నై, తమిళనాడు 600026

6. 25 Jan, గురువారం 7:00 - 10:00 PM హైదరాబాద్ గ్రౌండ్ ఫ్లోర్, సర్వే నెం. 124, గ్రామం, వినాయక్నగర్, సెర్లింగ్ంపల్లి మండల్, గచ్చిబోవి, హైదరాబాద్, తెలంగాణ 500032

7. 26 Jan, శుక్రవారం 1:00 - 4:00 PM గుర్గావ్ 3 వ అంతస్తు, ఆంబియన్స్ మాల్, డిఎల్ఎఫ్ దశ 3, గుర్గావ్, 122010

8. 26 Jan, శుక్రవారం 1:00 - 4:00 PM చండీగఢ్ 178-178 ఎ, ఎలాంటే మాల్, ఇండస్ట్రియల్ & బిజినెస్ పార్కు, దశ - I, చండీగఢ్, 160002

9. 26 Jan, శుక్రవారం 7:00 - 10:00 PM కొచ్చి లులు అంతర్జాతీయ షాపింగ్ మాల్, 50/2392 50/2392, NH 47, ఎడపల్లి, కొచ్చి, కేరళ 682024

10. 26 Jan, శుక్రవారం 1: 00-4: 00 PM బెంగుళూరు KFC రెస్టారెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రల్ మాల్, సర్వే నెం .5 / 78 / 7,78 / 8, బెల్లాండూర్ విలేజ్, వర్తూర్ హోబ్లీ, బెంగళూరు - 560103

11. 26 Jan, శుక్రవారం 4:00 - 7:00 PM బెంగుళూరు నెం. GS-11, GS-12, GS-13, సిగ్నేచర్ టవర్ # 6, గోపాలన్ సిగ్నేచర్ మాల్, నాగవారి పల్య, C.V. రామన్ నగర్, ఓల్డ్ మద్రాస్ రోడ్, బెంగళూరు, కర్నాటక 560093

12. 26 Jan, శుక్రవారం 7:00 - 10:00 PM బెంగుళూర్ KFC రెస్టారెంట్, హైపర్సిటీ, సర్వే సంఖ్య 6/2 మరియు 6/3, కుండలహల్లి గేట్ సమీపంలో, తూబోరాహళ్లి గ్రామం, ఆర్థూర్ హోబ్లీ, హైపర్ సిటీ బ్రూక్ ఫీల్డ్, బెంగళూరు, కర్ణాటక 560037

ఎయిర్‌టెల్ ప్లాన్లలో భారీ మార్పులుఎయిర్‌టెల్ ప్లాన్లలో భారీ మార్పులు

Best Mobiles in India

English summary
KFC Smoky Grilled wings will be available at select 10 cities in India and is served in box that doubles as a flying drone which can be powered using a smartphone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X