అందుబాటులోకి రూ.75 ల‌క్ష‌ల LG రోల‌బుల్ టీవీలు.. ఎక్క‌డో తెలుసా!

|

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల సంస్థ LG, భార‌త మార్కెట్లో అత్యంత ఖ‌రీదైన రోల‌బుల్ టీవీల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం ఈ టీవీలు కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. మొద‌ట్లో ఈ టీవీ ధ‌ర విని షాకైన వినియోగ‌దారులు, ప్ర‌స్తుతం దీని ఫీచ‌ర్లు చూసి అవాక్క‌వుతున్నారు. ఈ LG Signature OLED R టీవీలు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి. అన్నింటికీ మించి ఇది రోల‌బుల్ (మ‌డ‌వ‌గ‌లిగే) టీవీ కావ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ టీవీలు న్యూ దిల్లీలోని రిల‌య‌న్స్ డిజిట‌ల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

 
అందుబాటులోకి రూ.75 ల‌క్ష‌ల LG రోల‌బుల్ టీవీలు.. ఎక్క‌డో తెలుసా!

ఈ రోల‌బుల్ టీవీలో ప్ర‌ధానంగా ఆక‌ట్లుకునే అంశం ఏంటంటే.. మ్యూజిక్ ఒక్క‌టే వినాల‌నుకున్న‌ప్పుడు టీవీని రోల‌బుల్ బాక్సులోకి రోల్ చేయ‌డం ద్వారా సౌండ్ సిస్ట‌మ్‌గా మ‌ర్చుకుని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ టీవీలో దృశ్యాలు రియ‌ల్ లైఫ్ (నిజ జీవిత‌) అనుభూతిని క‌లిగిస్తాయి.

ఈ టీవీ ధ‌రెంతో తెలిస్తే షాకే!
అధునాత‌న టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఈ టీవీ ధ‌ర తెలిస్తే షాక‌వ్వాల్సిందే. దీని ధ‌ర‌ను కంపెనీ రూ.75ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. గ‌తంలో ఈ టీవీ గురించి ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్ హోం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా డైరెక్ట‌ర్ హ‌క్ హ్యున్ కిమ్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఈ రోల‌బుల్ టీవీ నిజంగా ల‌గ్జ‌రీ ప్రొడ‌క్ట్ అని తెలిపారు. ఈ టీవీ వినియోగ‌దారుల‌కు అత్యుత్తమ అనుభూతిని క‌లిగిస్తుంద‌ని అన్నారు. అదేవిధంగా టీవీ మార్కెట్‌లో ఎల్‌జీ సంస్థ పాత్ర‌ను మ‌రోసారి ఆయ‌న ప్ర‌స్తావించారు. బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ ఈ టీవీ కి ప్ర‌మోట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అందుబాటులోకి రూ.75 ల‌క్ష‌ల LG రోల‌బుల్ టీవీలు.. ఎక్క‌డో తెలుసా!

LG Signature OLED Rటీవీ ఫీచ‌ర్లు..
LG Signature OLED R టీవీ 65 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేటు క‌లిగి ఉంది. దీనికి సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాల‌జీని ఉజ‌యోగించారు. దీనికి α9 Gen 4 (నాలుగో జ‌న‌రేష‌న్‌) AI ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. ఇక సౌండ్ విష‌యానికి వ‌స్తే అద్భుత‌మైన యూజ‌ర్ అనుభూతి కోసం డాల్బీ ఆట్మోస్ స్పెష‌ల్ ఫీచ‌ర్ క‌ల్పిస్తున్నారు.

కంపెనీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దీనికి డాల్బీ విజ‌న్ ఐక్యూ ఫెసిలిటీ క‌ల్పించారు. అంతేకాకుండా సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాల‌జీ ఈ టీవీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అద్భుత‌మైన గేమింగ్ అనుభూతి పొందేలా ఈ టీవీ 4K 120fps and G-Sync స‌పోర్టుతో త‌యారుచేసిన‌ట్లు సంస్థ వెల్ల‌డించ‌డం విశేషం. ఈ టీవీ అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

అందుబాటులోకి రూ.75 ల‌క్ష‌ల LG రోల‌బుల్ టీవీలు.. ఎక్క‌డో తెలుసా!

దీని పనితీరు 2020 నుండి హై-ఎండ్ OLEDల LGల లైనప్‌ని పోలి ఉంటుంది. రోల్ చేయగల టీవీ HDMI 2.1, 4K రిజల్యూషన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ వంటి HDR ప్రమాణాలకు మద్దతు, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, Amazon Alexa/ Google Assistant సపోర్ట్ మరియు Dolby Atmos ఆడియో వంటి ఇతర హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తుంది. రోల్ చేయదగిన OLED TV R తన జీవితకాలంలో కనీసం 50,000 సార్లు చుట్టవచ్చు అని LG తెలిపింది.

 
అందుబాటులోకి రూ.75 ల‌క్ష‌ల LG రోల‌బుల్ టీవీలు.. ఎక్క‌డో తెలుసా!

స్వంత WebOS ప్లాట్‌ఫారమ్‌
LG తన TV సిరీస్‌లో దాని స్వంత WebOS ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం కొనసాగిస్తుంది. ఇది పెద్ద స్క్రీన్‌పై విభిన్న ప్రసిద్ధ యాప్‌ల కోసం దాని యాప్ స్టోర్‌ను అందిస్తుంది. 8K TV లైనప్ 77-అంగుళాల మరియు 88-అంగుళాల స్క్రీన్ సైజులలో వస్తుంది. ఇది LG యొక్క a9 Gen5 AI ప్రాసెసర్‌తో ఆధారితమైనది. ఈ టీవీ మార్కెట్ చాలా వరకు వైవిధ్యభరితంగా మారింది, ఈ రోజుల్లో మీకు OLED ఎంపికలను రూ. 50,000 కంటే తక్కువ ధరకే అందిస్తోంది. అయితే LG, Samsung, Sony మరియు మరికొన్ని బ్రాండ్‌లు వాటి నాణ్యత మరియు ప్రీమియం అనుభవాన్ని బట్టి అదనపు ధరను వసూలు చేస్తాయి.

Best Mobiles in India

English summary
This Rs 75 lakh LG Smart OLED TV Rolls Out From A Box, Watch Video

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X