షియోమికి దిమ్మతిరిగే షాక్, అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌టీవీలు !

Written By:

దేశీయ స్మార్ట్‌టీవీ రంగంలో చైనా దిగ్గజం షియోమి తన స్మార్ట్‌టీవీల సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ దిగ్గజం థామ్సన్ రంగంలోకి దిగింది. సరికొత్తగా తన స్మార్ట్‌టీవీలను విస్తరిస్తూ పోతోంది. థామ్సన్‌ సరికొత్త రీఎంట్రీ ఇప్పుడు దిగ్గజాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సంతరించుకుంది. స్మార్ట్ ఎఫ్‌హెచ్‌డీ టీవీలను భారత టీవీ మార్కెట్‌లో ఈ దిగ్గజం లాంచ్ చేసింది. 40, 43, 32 అంగుళాల మూడు స్మార్ట్‌ టీవీలను ప్రారంభించింది. కాగా ఈ టీవీల విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచి మొదలు కానున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో పాటు ఆకట్టుకునే ధరలతో ఈ టీవీలు షియోమి టీవీలకు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు సెలవిస్తున్నారు.

మరొక విప్లవానికి తెరలేపనున్న రిలయన్స్ జియో !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరలు

43 అంగుళాల 4కే యూహెచ్‌డీ థామ్సన్ టీవీ ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్‌ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది.

43 అంగుళాల 4కే యేహెచ్‌డీ టీవీ ఫీచర్లు

మోడల్ పేరు 43టీఎం4377
3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్‌డీఆర్‌, విత్‌ ఎల్‌ జీఐపీఎస్‌ ప్యానెల్‌
ఆండ్రాయిడ్‌ 4.4.4 కిట్ కాట్‌,
1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్‌,
మాలి-టీ720 జీపియూ,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
10వాట్స్‌ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ

40అంగుళాల థామ్సన్ స్మార్ట్‌ టీవీ

40టీఎం4099 మోడల్‌ ,
1920x1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌,
ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలిపాప్‌,
కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్,
1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ ,
10 వాట్స్‌ రెండు స్పీకర్లు,
వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు

32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ

32ఎం3277 మోడల్‌:
1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,
450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌,
వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

తక్కువ ధరకే ..

ఫ్రాన్స్‌కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్‌, టెక్నిక‌ల‌ర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మ‌డి క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ బ్రాండే థామ్స‌న్‌. యురోపియ‌న్ మార్కెట్‌లో థామ్స‌న్‌ స్మార్ట్ టీవీలను విక్రయిస్తూ అక్కడ మంచి ఫలితాలను రాబడుతోంది. తాజా వ్యూహంతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీల‌తో భారత మార్కెట్‌లో పాగా వేయాలనుకుంటోంది. ఈ టీవీల రాకతో దేశంలో మైక్రోమ్యాక్స్, వూ, షియోమి లాంటి బడ్జెట్‌ ధరల్లో టీవీలను అందిస్తున్న కంపెనీలకు భారీ షాకే ఇవ్వనుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Thomson launches 3 smart TVs in India with prices starting from Rs. 13,490 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot