థామ్సన్ నుంచి మూడు కొత్త QLED TV లు లాంచ్ అయ్యాయి! ధర & ఫీచర్లు చూడండి.

By Maheswara
|

భారత టీవీ మార్కెట్‌లోని ప్రముఖ బ్రాండ్‌లలో థామ్సన్ కంపెనీ ఒకటి. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త మోడల్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు భారతదేశంలో దాని కొత్త సిరీస్ QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇంకా ఈ సిరీస్ లో మూడు మోడల్‌ల టీవీ లు వస్తాయి. వీటి సైజుల ప్రకారం 50-అంగుళాలు, 55-అంగుళాలు మరియు 65-అంగుళాల మోడళ్ళు ఉన్నాయి.

థామ్సన్ కంపెనీ QLED స్మార్ట్ టీవీ సిరీస్‌

అవును, థామ్సన్ కంపెనీ QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో మూడు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు. ఈ మూడు మోడల్‌లు Google TV, Dolby Vision, Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్‌లకు కూడా మద్దతునిస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు యువత  మరియు పిల్లల వినియోగదారులకు కూడా చాలా ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ స్మార్ట్ టీవీల ప్రత్యేకత ఏమిటి? వీటి ధర ఏమిటి? మొదలైన వివరాలను ఈ కథనంలో చదవండి.

థామ్సన్ QLED స్మార్ట్ టీవీ సిరీస్ ఫీచర్లు!

థామ్సన్ QLED స్మార్ట్ టీవీ సిరీస్ ఫీచర్లు!

థామ్సన్ కొత్తగా ప్రవేశపెట్టిన SmartTV సిరీస్ 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల డిస్ప్లే సైజులలో వస్తుంది. ఈ స్మార్ట్ TV సిరీస్‌లోని అన్ని మోడల్‌లు HDR 10+, Dolby Vision, Dolby Atmost మరియు Dolby Digital Plus సపోర్ట్‌తో 4L QLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 50 మరియు 55-అంగుళాల మోడల్‌లు గరిష్టంగా 550 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తాయి. కానీ 65-అంగుళాల మోడల్ గరిష్టంగా 600 నిట్‌ల బ్రైట్నెస్ ను అందిస్తుంది.

ఈ SmartTV సిరీస్‌లో

ఈ SmartTV సిరీస్‌లో

ఈ SmartTV సిరీస్‌లోని అన్ని మోడల్‌లు మొత్తం 40W అవుట్‌పుట్‌తో రెండు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటాయి. ఇది DTS TrueSurround సౌండ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు MediaTek MT9062 ప్రాసెసర్‌తో అందించబడతాయి మరియు Mali-G52 GPU తో మద్దతు ఇవ్వబడతాయి. ఇది 2GB RAM మరియు 16GB స్టోరేజ్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. Google యొక్క Google TV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కూడా ఇది పనిచేస్తుంది.

OTT యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి

OTT యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి

ఈ స్మార్ట్ టీవీలు Netflix, Prime Video, Disney+Hotstar, Apple TV, Voot, G5 మరియు Sony Live వంటి 10,000 కంటే ఎక్కువ యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. కనెక్టివిటీ పరంగా ఈ టీవీలు బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, అంతర్నిర్మిత Chromecast, AirPlay మద్దతు, మూడు HDMI పోర్ట్‌లు మరియు రెండు USB పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఇది Google అసిస్టెంట్‌కు కూడా  మద్దతుతో వాయిస్-యాక్టివేటెడ్ రిమోట్‌ ని కలిగి ఉన్నాయి.

అడల్ట్ మరియు చైల్డ్ యూజర్ ప్రొఫైల్‌లకు సపోర్ట్ చేసే ఫీచర్‌

అడల్ట్ మరియు చైల్డ్ యూజర్ ప్రొఫైల్‌లకు సపోర్ట్ చేసే ఫీచర్‌

అంతేకాకుండా, ఈ స్మార్ట్ టీవీలు అడల్ట్ మరియు చైల్డ్ యూజర్ ప్రొఫైల్‌లకు సపోర్ట్ చేసే ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి మీ ప్రొఫైల్‌లకు సినిమాలు మరియు టీవీ సిరీస్‌లను సేవ్ చేయగల సామర్థ్యాన్ని కలిగిఉంది. ఇది లైట్లు మరియు కెమెరాలతో సహా స్మార్ట్ హోమ్ పరికరాలకు కూడా మద్దతు ఇస్తుంది. కంటెంట్ బ్లాక్‌లతో పిల్లల ప్రొఫైల్‌లకు కూడా మద్దతు ఉంటుంది.

ధర మరియు లభ్యత

ధర మరియు లభ్యత

థామ్సన్ QLED స్మార్ట్ టీవీ సిరీస్ యొక్క 50-అంగుళాల మోడల్ ధర రూ. 33,999.గా ఉంది. కానీ 55 అంగుళాల మోడల్ ధర రూ.40,999 గా ఉంది. అలాగే, 65-అంగుళాల మోడల్ ధర రూ. 59,999 గా ఉంది. అలాగే 'బిగ్ బిలియన్ డేస్ స్పెషల్' ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటాయని థామ్సన్ కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ యొక్క ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు గమనించగలరు.

Best Mobiles in India

Read more about:
English summary
Thomson's New QLED Smarttvs Launched In India. Check Price, Specifications And Other Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X