ఆ సంచలన టీవీలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి..

Written By:

ఇండియన్ మార్కెట్లో ఒకప్పుడు టాప్ టీవీ సెల్లర్ ఏదంటే నిస్సందేహంగా చెప్పే పేరు థామ్స‌న్ టీవీల గురించే.. భారత మార్కెట్లోకి వచ్చిన ఈ టీవీల‌ను మ‌న దేశంలో ఒక‌ప్పుడు చాలా మంది ఎగబడి మరీ కొనుగోలు చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ప‌లు కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లో ఈ కంపెనీ కొంత కాలం టీవీల‌ను త‌యారు చేయ‌లేదు. కానీ రీసెంట్‌గా స‌రికొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీల‌ను యురోపియ‌న్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే నెమ్మ‌దిగా మ‌ళ్లీ భార‌త మార్కెట్‌లోనూ టీవీ వ్యాపార రంగంలోకి థామ్స‌న్ రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

ఆ సంచలన టీవీలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి..

కాగా ఫ్రాన్స్‌కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్‌, టెక్నిక‌ల‌ర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మ‌డి క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ బ్రాండే థామ్స‌న్‌. ఈ కంపెనీ టీవీలు ఒక‌ప్పుడు మ‌న దేశంలో బాగా అమ్ముడ‌య్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆ కంపెనీ ఇప్పుడు మ‌ళ్లీ మ‌న దేశంలోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన థామ్స‌న్ భార‌త్‌లో కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీల‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. సోషల్ మీడియాలో ఈ విషయం మీద అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కూడా.

ఐపీఎల్ అభిమానులకు మినిట్ టూ మినిట్ కిక్కునిచ్చే యాప్స్

కాగా యురోపియ‌న్ మార్కెట్‌లో థామ్స‌న్‌కు చెందిన ఎ3, ఎ4, ఎ5, ఎ6, బి3, బి6, సి64 సిరీస్ స్మార్ట్ టీవీలు ఎక్కువ‌గా సేల్ అవుతున్నాయి. అయితే అదే సిరీస్‌తో స్మార్ట్ టీవీల‌ను థామ్స‌న్ భార‌త్‌లో లాంచ్ చేస్తుందా, లేక కొత్త‌గా వేరే సిరీస్‌తో ఎంట‌ర్ అవుతుందా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. భార‌త్‌లో త‌మ టీవీలు ఒక‌ప్పుడు బాగా అమ్ముడైనందునే వారి అభిరుచుల‌కు త‌గిన‌ట్టుగా నూత‌న త‌ర‌హా స్మార్ట్ ఎల్ఈడీ టీవీల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందుబాటులోకి తెస్తామ‌ని థామ్స‌న్ ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు.

English summary
Thomson to re-enter Indian market with new LED TVs on April 12 More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot