ఒక్క ఆవిష్కరణ మిలియన్ల వైపు నడిచింది

|

మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త గాడ్డెట్స్ వస్తున్నాయి. అలాగే టెక్నాలజీతో దూసుకొస్తున్న కొత్త ఆవిష్కరణలు మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళుతున్నాయి. అయితే ఈ దశలో కొన్ని ఆవిష్కరణలు చాలా పన్నీగా కూడా ఉంటాయి. అలాగే అవి చాలా విలువైనవిగానూ బలంగానూ కూడా ఉంటాయి. తమ తెలివితేటలతో బయటి ప్రపంచానికి అందించిన ఈ ఆవిష్కరణలు కొన్ని మిలియన్ల డాలర్లు అమ్ముడుపోయి సంచలనం సృష్టించాయి. తన కోసం తయారుచేసుకున్ ఈ ఆవిష్కరణలు ఇప్పుడు మార్కెట్ లో మిలియన్లకు పైగా అమ్మకాలు జరుపుతున్నాయి .వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : మీ ఫోన్ ఎప్పుడూ కొత్తగా కనపడాలంటే...

డాగ్గెస్ (Doggles)

డాగ్గెస్ (Doggles)

చూడగానే కుక్కలకి గ్లాస్ లు అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కాని అవి మనలాంటి ప్రాణమున్న జీవాలే కదా. అంతేకాక అవి మనకన్నా వేగంగా శత్రువులను పసిగడతాయి కూడా. వాటికి రక్షణ కోసం ఈ డాగ్లెస్ బయటకొచ్చింది. ఈ గ్లాస్ రేబాన్ గ్లాస్ కన్నా చాలా శక్తివంతమైనవి. మీ డాగ్ ను బయటకు తీసుకెళ్లినప్పుడు ఇది పెడితే దుమ్ము ధూళి అలాగే ఎండ నుంచి దానికి రక్షణ లభిస్తుంది.ఇవి బయటకు రాగకొన్ని మిలియన్లు అమ్ముడుపోయాయి

ది  స్నూగ్గీ( The Snuggie)

ది స్నూగ్గీ( The Snuggie)

ఇది మీ ఒంటికి వెచ్చదనాన్ని అందించే క్లాత్ లాంటిది. ఇది అమెరికాలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది కూడా. దాదాపు 2008 నుంచి2009 క్రిస్‌మస్ పండుగ మధ్య కాలంలో 20 మిలియన్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికీ వాటిని కొనేందుకు జనాలు బార్లు తీరుతున్నారు. దీని ధర 10 నుంచి 20 డాలర్ల మధ్యలో ఉంటుంది.దీన్నిమీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు.ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్లవచ్చు.

మ్యాజిక్ బాల్ ( Magic 8 Ball)
 

మ్యాజిక్ బాల్ ( Magic 8 Ball)

ఇదొక మ్యాజిక్ బాల్. దీంతో మీరు మ్యాజిక్ సింపుల్ గా చేసి చూపించవచ్చు. ఇది క్రిస్టల్ గోళం లాగా ఫస్ట్ మార్కెట్ చేశారు. అయితే రాను రాను అది మ్యాజిక్ 8 బాల్ గా కొత్త అవతారం ఎత్తింది. ద్రవం ఓ ట్యూబ్ సాయంతో ఈ మ్యాజిక్ బాల్ ను ఉపయోగించి మ్యాజిక్ చేస్తారు.ఇది 1950లోనే చాలా పాపులర్ అయింది.

ది కూష్ బాల్ ( The Koosh Ball )

ది కూష్ బాల్ ( The Koosh Ball )

ఇది 1988లో క్రిస్ మస్ రోజున మార్కెట్ నే ఓ ఊపు ఊపింది. ఇది రబ్బరు బంతిగాలా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లలతో దీన్ని తయారుచేశారు.మీ పిల్లలు ఆడుకోడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఆవిష్కర్త స్కాట్ స్టిల్ల్న్ జెర్, బోర్ కొట్టినప్పుడు ఆడుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

ప్లాస్టిక్ విష్బోన్ ( Plastic Wishbone)

ప్లాస్టిక్ విష్బోన్ ( Plastic Wishbone)

ప్రపంచంమంతా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ విష్ బోన్ టెక్నాలజీ కోసం ఎదురుచూస్తోంది. కెన్ ఆరోని దీన్ని ఆవిష్కరించారు. ప్రారంభంలోనే కొన్ని మిలియన్లు అమ్ముడుపోయాయి. దీని ఆధారంగా ఇప్పుడు కొత్త కొత్త పనిముట్లు బయటకు వస్తున్నాయి.

ది సింగింగ్ ఫిష్ (The Singing Fish )

ది సింగింగ్ ఫిష్ (The Singing Fish )

ఇది పాటలు పాడే చేప. మీరు అలా గోడమీద దీనిని పెట్టారంటే చాలు అది పాటలు పాడేస్తూ ఉంటుంది. దీన్ని టెక్సాస్ కంపెనీ 1990లో తయారు చేసింది.

ది బిల్లి బాబ్ టీత్ ( Billy-Bob Teeth)

ది బిల్లి బాబ్ టీత్ ( Billy-Bob Teeth)

సరదాగా పిల్లలు దీంతో ఆడుకోవచ్చు. ఎవర్నైనా భయపెట్టడానికి దీనిని ఇలా పంటికి తగిలించుకుని భయపెట్టవచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఇవి కూడా కొన్ని మిలియన్లు అమ్ముడుపోయాయి. ఇవి రబ్బరు బ్యాండ్లు లాగా ఉంటాయి.

ఫర్బీ ( Furby )

ఫర్బీ ( Furby )

ఇదొక బొమ్మ. 1990లో టైగర్ ఎలక్ట్రానిక్స్ తయారుచేసింది. 1990లో ఇది ఓ హాటెస్ట్ టాయ్ గా మార్కెట్ ను ఓ ఊఫు ఊపేసింది. దీంతో మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు.

టమోగోటచ్చి ( Tamagotchi )

టమోగోటచ్చి ( Tamagotchi )

ఇదొక కీ చెయిన్ లాగా ఉంటుంది. దీనిని రాను రాను వివిధ మోడళ్లలో తయారుచేసారు. జపాన్ లో ఇది తయారైంది. ఇవి కూడా 70 మిలియన్లకు పైగానే అమ్ముడుపోయాయి.

పెట్ రాక్ ( Pet Rock)

పెట్ రాక్ ( Pet Rock)

ఇదొక ఫన్నీ పెట్ రాక్ ఇంట్లో వీటిని చూస్తే నిజంగానే పెట్ అనుకుంటారు.రకరకాల మోడల్స్ లో ఈ పెట్స్ అలరిస్తున్నాయి. అయితే దీన్ని 1975లో తయారుచేశారు. తయారుచేసిన వెంటనే అది దాదాపు 5 మిలియన్ల పెట రాక్స్ అమ్ముడుపోయాయి.

Best Mobiles in India

English summary
Here Write Top 10 Strange Inventions That Made Millions

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X