బడ్జెట్‌ ధరలో అందుబాటులో గల CPU ఎయిర్ కూలర్‌లు

|

మీరు ఏదైనా CPUను ఉపయోగిస్తున్నారా? అది శక్తివంతమైనది మరియు బేసిక్ మెయిన్ స్ట్రీమ్ అయినప్పటికి దాని కోసం మీకు కూలర్ యొక్క ఉపయోగం చాలా అవసరం. కూలర్ లలో ప్రధానంగా రెండు రకాల కూలర్లు ఉన్నాయి.

ఎయిర్ కూలర్‌లు
 

ఎయిర్ అండ్ లిక్విడ్ మరియు ఎయిర్ కూలర్లు ప్రస్తుతం మీ అవసరాలకు చాలా బాగా సరిపోతాయి. అవి కూడా రకరకాల బడ్జెట్‌లలో వివిధ రకాల కలర్ మిక్స్ లతో వస్తాయి. మీ CPU కోసం బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఎయిర్ కూలర్‌లను పరిశీలిద్దాం. వాటి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ ప్లే స్టోర్ లో కంట్రీను మార్చడం ఎలా?

లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్

లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్

బడ్జెట్ ధరలో మీ సిపియు ప్రాసెసర్‌ను కూల్ చేయడానికి లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్ ఎయిర్ కూలర్ ఒక మంచి ఎంపిక. 90mm ఫ్యాన్ యొక్క గరిష్ట వేగం 2200RPM గా ఉంటుంది. ఇది దీని గరిష్ట వేగం వద్ద కూడా కేవలం 23.4dBA సౌండ్ కలిగి ఉంటుంది. ఇది 3-పిన్ కనెక్టర్‌తో మీ మదర్‌బోర్డుకు కనెక్ట్ అవుతుంది. ఇది ఇంటెల్ (LGA775 / 1151/1150/115/1156/1366/2011) మరియు AMD (AM4 / FM2 + / FM2 / FM1 / AM3 + / AM3 / AM2 + / AM2) ) మదర్‌బోర్డులకు సపోర్ట్ చేస్తుంది. కూలర్‌లో అల్యూమినియం రెక్కలు ఉన్నందున ఇవి 280W TDPని కలిగి ఉంటాయి. లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్‌లో అల్లాయ్ బేరింగ్ ఉండి 30,000 గంటల లైఫ్ ను ఇస్తుంది. బడ్జెట్‌ ధరలో సిపియు ఎయిర్ కూలర్ విషయానికి వస్తే లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్ గొప్ప ఎంపిక. దీనిని రూ.8824 ధర వద్ద అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

ZEE5,హాట్స్టార్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ఫైబర్ కనెక్షన్

షైనింగ్‌లవ్ CE కలర్ LED CPU ఎయిర్ కూలర్
 

షైనింగ్‌లవ్ CE కలర్ LED CPU ఎయిర్ కూలర్

లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్ సిపియు ఎయిర్ కూలర్ మాదిరిగానే షైనింగ్‌లవ్ సిఇ గరిష్టంగా 2200 RPM వేగంను కలిగి ఉంది. అయితే దాని హైడ్రాలిక్ బేరింగ్ కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే దాని యొక్క లైఫ్ వాలిడిటీను పెంచుతుంది. అలాగే షైనింగ్‌లవ్ CE కి టవర్ కూలర్ జతచేయబడి ఉండదు. ఇది 40,000 గంటల లైఫ్ కలిగి ఉండి 19 dBA వలె నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది 3-పిన్ కనెక్టర్ మరియు అల్యూమినియం హీట్ సింక్‌తో వస్తుంది. ఇది ఇంటెల్ మరియు AMD ప్రాసెసర్‌లకు మద్దతు ఇస్తుంది. 100mm తో ఫ్యాన్ కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది ఎక్కువ వేడిని వెంటనే కూల్ చేయగలదు మరియు ఫ్యాన్ 5 రంగులను కలిగి ఉంటుంది. దీని యొక్క ధర విషయానికి వస్తే ఇది రూ.1054 ధర వద్ద అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 10 MIUI 11 అప్‌డేట్‌తో షియోమి రెడ్‌మి K20

ఫిడ్జెట్‌క్యూట్ డబుల్ CPU కూలర్

ఫిడ్జెట్‌క్యూట్ డబుల్ CPU కూలర్

లియోయి 4 కాపర్ ట్యూబ్ ఫ్యాన్ మరియు షైనింగ్‌లోవ్ సిఇ ఎయిర్ కూలర్‌తో పోలిస్తే ఫిడ్జెట్‌క్యూట్ డబుల్ సిపియు కూలర్ భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీనికి రెండు వైపులా ఫ్యాన్లు మరియు రెండు రాగి పైపులు ఉన్నాయి. ఫ్యాన్లు ఆయిల్-బేరింగ్ మరియు పుష్-పుల్ కాన్ఫిగరేషన్‌లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. అంటే ఒక ఫ్యాన్ గాలిని లాగుతుంది ఇది కూలర్ గుండా వెళుతుంది మరియు తరువాత రెండవ ఫ్యాన్ గుండా బయటకు నెట్టివేయబడుతుంది. ఈ ఫ్యాన్లు క్లిప్ లాంటి డిజైన్‌ను కలిగి ఉండి మరింత క్లియరెన్స్ కోసం కొంచెం సర్దుబాటు చేయబడి ఉంటాయి. ఫిడ్జెట్‌క్యూట్ డబుల్ CPU కూలర్ AMD మరియు ఇంటెల్ ప్రాసెసర్లకు కూడా మద్దతు ఇస్తుంది. దీనిని అమెజాన్ లో రూ.1043 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy Fold 2 : లీక్ అయిన ఫీచర్స్ ఇవే.....

కూలర్ మాస్టర్ హైపర్ T20 సిపియు కూలర్

కూలర్ మాస్టర్ హైపర్ T20 సిపియు కూలర్

కూలర్ మాస్టర్ హైపర్ T20 సిపియు కూలర్ ఫిడ్జెట్‌క్యూట్ డబుల్ సిపియు కూలర్‌తో సమానమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇది ఒకే ఒక ఫ్యాన్‌తో వస్తుంది. దీని 3-పిన్ బౌల్ డిజైన్ మరియు యాంటీ వైబ్రేషన్ ప్యాడ్‌లు తక్కువ శబ్దం పనితీరును ఇస్తాయి. ఇది రెండు రాగి పైపులను కలిగి ఉండి జాబితాలోని ఇతరుల మాదిరిగానే ఇంటెల్ మరియు AMD ప్రాసెసర్లకు మద్దతు ఇస్తుంది. దీనిని మదర్‌బోర్డులో ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. ఫ్యాన్ ఒక కట్టు రూపకల్పనను కలిగి ఉంటుంది ఇది సులభంగా కదలిక మరియు సర్దుబాటును అనుమతిస్తుంది. 90mm ఫ్యాన్ 1700RPM వేగంతో తిరగగలదు. పైన తెలిపిన జాబితాలోని ఇతరులతో పోల్చినప్పుడు ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. దీనిని అమెజాన్ లో రూ.1031 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 5 Best Budget CPU Air Coolers List are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X