పండుగ సేల్, రూ.2000లో బెస్ట్ గాడ్జెట్స్ ఇవే!
టెక్నాలజీతో సహవాసం చేసే ప్రతిఒక్కరూ గాడ్జెట్స్‌ను ఇష్టపడుతుంటారు. వీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు చేసే అనేక పనుల్లో గాడ్జెట్‌ల సహాయం తీసుకుంటుంటారు.
టెక్నాలజీతో సహవాసం చేసే ప్రతిఒక్కరూ గాడ్జెట్స్‌ను ఇష్టపడుతుంటారు. వీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు చేసే అనేక పనుల్లో గాడ్జెట్‌ల సహాయం తీసుకుంటుంటారు. టెక్నాలజీ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకువచ్చిన ఈ గాడ్జెట్స్ ఆధునిక జీవనశైలిని మరింత సుఖమయం చేసేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని డిస్కౌంట్ ధరల పై రూ.2000లోపు మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ టెక్ గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ఎంఐ బ్యాండ్ 3(Mi Band 3)
ఈ ఫిట్నెస్ ట్రాకర్ ఖరీదు రూ.1,999. ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన సాంకేతితక వివిధర రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్‌తో పాటు హార్ట్ రేట్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయగలుగుతుంది. ఈ ట్రాకర్‌లో ఏర్పాటు చేసిన OLED టచ్ స్ర్కీన్ క్లియర్ కట్ నోటిఫికేషన్‌లను మీకు అందించగలుగుతుంది. ఈ డివైస్‌లో లోడ్ చేసిన బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 20 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ప్రొవైడ్ చేయగులుగుతంది.

షియోమి ఎంఐ కాంపాక్ట్ బ్లుటూత్ స్పీకర్ 2 (Xiaomi Mi Compact Bluetooth Speaker 2)
ఈ డివైస్ ధర రూ.799. ఈ బ్లుటూత్ స్పీకర్‌లో ఏర్పాటు చేసిన ఎంబెడెడ్ మైక్రోఫోన్ హ్యాండ్స్-ఫ్రీ కాల్స్‌కు ఉపకరిస్తుంది. ఈ స్పీకర్‌లోని నియోడైమియమ్ మాగ్నెట్స్ క్లియర్ సౌండ్ అవుట్ పుట్‌ను ప్రొవైడ్ చేయగలుగుతాయి.

20,000ఎమ్ఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ (20,000mAh Mi Power Bank 2i)
ఈ పవర్ బ్యాంక్ ధర రూ.1499. డ్యుయల్ యూఎస్బీ అవుట్‌పుట్‌తో వస్తోన్న ఈ పవర్ బ్యాంక్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్టును సపోర్ట్ చేస్తుంది.

బోట్ బ్లుటూత్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ (Boat Bluetooth Wireless Earphones)
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ ఖరీదు రూ.1499. బోట్ రాకర్జ్255 పేరుతో ఈ ఇయర్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. బ్లుటూత 4.1 CSR8635 చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ ఇయర్ ఫోన్స్ 10ఎమ్ఎమ్ క్లియర్ ట్రాన్స్‌మిషన్ హెచ్‌డి సౌండ్‌ను ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఈ ఇయర్‌ఫోన్స్‌లో లోడ్ చేసిన బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 6 గంటల ప్లేబ్యాక్‌ను ప్రొవైడ్ చేయగులుగుతంది.

షియోమి ఎంఐ పాకెట్ స్పీకర్ 2 (Xiaomi Mi Pocket Speaker 2)
ఈ స్పీకర్ ధర రూ.1499. బ్లుటూత్ 4.1 కనెక్టువిటీతో వస్తోన్న ఈ స్పీకర్‌లో 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని షావోమి లోడ్ చేసింది. 5వాట్ సౌండ్ అవుట్ పుట్‌ను ఈ స్పీకర్ ప్రొవైడ్ చేయగలుగుతుంది.10 మీటర్ల రేంజ్‌లోపే ఈ స్పీకర్ కనెక్ట్ అవుతుంది.

యూఎస్బీ మగ్ వార్మర్ (USB Powered Mug Warmer)
ఈ హ్యాండీ డివైస్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకునే వీలుంటుంది. ఈ మగ్‌తో వచ్చే యూఎస్బీ పాయింట్‌ను ల్యాప్‌టాప్ యూఎస్బీ పోర్టుకు కనెక్ట్ చేసుకోవటం ద్వారా కాఫీ, టీ లేదా నీటిని వేడిచేసుకోవచ్చు.

షియోమి ఎంఐ వీఆర్ ప్లే 2 (Xiaomi Mi VR Play 2)
ఈ వీఆర్ హెడ్‌సెట్ ఖరీదు రూ.1299. 4.7 ఇంచ్ స్ర్కీన్స్ దగ్గర నుంచి 5.7 ఇంచ్ స్ర్కీన్ వరకు వివిధ డిస్‌ప్లే సైజుల్లో లభ్యమయ్యే ఫోన్‌లను ఈ హెడ్‌సెట్ సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ క్వాలిటీ వర్చువల్ రియాల్టీ అనుభూతులను ఈ హెడ్‌సెట్ ఆఫర్ చేయగలుగుతుంది.

సోనీ ఎమ్‌డిఆర్ - ఎక్స్‌బి450 హెడ్‌ఫోన్స్ (Sony MDR-XB450 Headphones)
ఈ హెడ్‌ఫోన్స్ ఖరీదు రూ.2,000. 12ఎమ్ఎమ్ నియోడైమియమ్ మాగ్నెట్ డ్రైవర్స్‌తో వస్తోన్న ఈ హెడ్‌ఫోన్స్ శక్తివంతమైన bassను అందించగలుగుతాయి. మ్యూజిక్ ప్రియులకు ఈ ఇయర్ ఫోన్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కాలింగ్‌ను కూడా ఈ హెడ్‌ఫోన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాయి.

జీబీఎల్ గో పోర్టబుల్ వైర్ లెస్ బ్లుటూత్ స్పీకర్ (JBL Go Portable Wireless Bluetooth Speaker)
రూ.2000లోపు లభ్యమవుతోన్న బెస్ట్ వైర్‌లెస్ స్పీకర్స్‌లో జేబీఎల్ గో పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్ ఒకటి. ఈ స్పీకర్ మొత్తం 7 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. హెచ్‌డి క్వాలటీ సౌండ్‌ను ఈ స్పీకర్ ఆఫర్ చేస్తుంది. 3.5ఎమ్ఎమ్ ఇన్‌పుట్ జాక్, మైక్రోయూఎస్బీ పోర్ట్, హ్యాండ్స్‌ఫ్రీ వాయిస్ కాలింగ్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ స్పీకర్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








