చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే.. టాప్&బెస్ట్ వైర్డ్ Earphones ఇవే!

|

మ‌నం ఒంట‌రిగా ఉన్నా, లేదా ట్రావెలింగ్‌లో ఉన్నా లేదా ఇంకేదైనా ప‌నిలో ఉన్నా.. మ్యూజిక్ వింటుంటే ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో మ్యూజిక్‌ను మ‌రింతగా ఆస్వాదించేందుకు చాలా మంది ఇయ‌ర్‌ఫోన్ల‌ను వినియోగిస్తుంటారు. అందులో భాగంగా ఈ మ‌ధ్య‌కాలంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్‌లు తప్పనిసరి. ఈ క్ర‌మంలో ప్రముఖ కంపెనీలు మంచి నాణ్యత గల వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చాయి. అది కూడా చాలా బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ధ‌ర‌లో అందుబాటులోకి తెచ్చాయి. ముఖ్యంగా ఫిలిప్స్, జేబీఎల్, బోట్‌ తదితర కంపెనీల ఇయర్‌ఫోన్‌లకు మంచి ఆదరణ లభించింది. ఇటీవ‌లె వ‌న్‌ప్ల‌స్ కూడా వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం విశేషం.

Earphones

అవును, ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బ్రాండ్ల ఇయర్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ క‌థ‌నంలో మేం మంచి నాణ్యత కలిగిన, మన్నికైన మరియు బ‌డ్జెట్ ధరలకు లభించే టాప్ వైర్డు ఇయర్‌ఫోన్‌లను జాబితా మీకోసం అందిస్తున్నాం. మీరు ఇయర్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

OnePlus Nord Wired ఇయ‌ర్‌ఫోన్స్‌:

OnePlus Nord Wired ఇయ‌ర్‌ఫోన్స్‌:

వ‌న్‌ప్ల‌స్ కంపెనీ ఇప్ప‌టికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి క్వాలిటీ క‌లిగిన బ్రాండ్‌గా పేరు గాంచింది. ఈ కంపెనీకి చెందిన ఈ నార్డ్ వైర్డ్ ఇయ‌ర్ బ‌డ్స్ కూడా అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగి ఉన్నాయి. వీటి ధ‌ర‌ను కంపెనీ రూ.799 గా నిర్ణ‌యించింది. ఇవి మంచి వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్స్ అని చెప్పొచ్చు.

BluepunktEM10:

BluepunktEM10:

ఈ వైర్డు ఇయర్‌ఫోన్ ధర కేవలం రూ.499గా ఉంది. ఇది ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ మరియు లైన్ మైక్ స‌పోర్టును పొందింది. ఈ ఇయర్‌ఫోన్ మంచి సౌండ్ క్వాలిటీని కలిగి ఉంది.

Goo GoBase 400:

Goo GoBase 400:

వైర్డు ఇయర్‌ఫోన్ ధర రూ.349 గా ఉంది. ఇది నాయిస్ క్యాన్సిలింగ్ ఆప్షన్‌తో నాణ్యతలో మరింత ఆకట్టుకుంటుంది. అదనంగా, ఈ ఇయర్‌ఫోన్‌లో ఇన్-లైన్ మైక్ సపోర్ట్ ఉంది.

Infinity (JBL) జిప్ 100:

Infinity (JBL) జిప్ 100:

ఈ ఇయర్‌ఫోన్ రూ.499 ధ‌ర‌కు Amazonలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌ఫోన్‌లో చికాకు కలిగించని ఇయర్ ఫిట్టింగ్ ఆప్షన్ ఉంది. ఇది హై క్వాలిటీ సౌండ్ ఆప్షన్‌తో పాటు హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్‌ను కలిగి ఉంది.

Philips Audio TAE1126:

Philips Audio TAE1126:

ఈ ఇయర్ ఫోన్ ను రూ.328 ధ‌ర‌కు కొనుగోలు చేయవచ్చు ఇది ఇన్-లైన్ మైక్ మద్దతుతో చెవుల‌కు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది మరియు బ‌య‌టి శబ్దాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Ambrance వైర్డ్ ఇయర్ ఫోన్:

Ambrance వైర్డ్ ఇయర్ ఫోన్:

ఈ ఇయర్ ఫోన్ రూ.249 అందుబాటులో ఉంది. ఇది సిలికాన్ రబ్బరు వైర్లు మరియు ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్‌ను కలిగి ఉంది. అదనంగా, స్పష్టమైన ధ్వని కోసం ఇన్-లైన్ మైక్ ఎంపిక చేయబడింది.

Boult ఆడియో బేస్‌బడ్స్:

Boult ఆడియో బేస్‌బడ్స్:

బోల్ట్ ఆడియో బేస్‌బడ్స్ రూ.499 అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా తేలికైనది మరియు ధరించడానికి సౌకర్యవంతమైన ఎంపికతో వస్తుంది. దీనికి ఇన్-లైన్ మైక్ సపోర్ట్ కూడా ఉంది.

JBL ఎండ్యూరెన్స్:

JBL ఎండ్యూరెన్స్:

JBL ఎండ్యూరెన్స్ ఇయర్‌ఫోన్ ధర రూ.999 గా అందుబాటులో ఉంది. ఇవి తేలికైన మరియు సౌకర్యవంతమైన ఫిట్టింగ్ క‌లిగి ఉన్నాయి. ఇది సాధారణ స్థాయి నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్‌ని పొందింది.

Vibez బై లైఫ్‌లాంగ్ 2 ఇన్ 1:

Vibez బై లైఫ్‌లాంగ్ 2 ఇన్ 1:

ఈ ఇయర్‌ఫోన్స్ మార్కెట్లో రూ.1,159 ధ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. ఇవి వైర్‌లెస్ మరియు వైర్డు ఇయర్‌ఫోన్ ఎంపిక ను క‌లిగి ఉన్నాయి. అన్నింటినీ ఒకే బటన్‌లో నియంత్రించే ఆప్షన్‌ను కూడా ఇచ్చారు.

Bluepunkt EM01:

Bluepunkt EM01:

Bluepunkt EM01 ఇయర్‌ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.399 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఆకట్టుకునే సౌండ్ క్వాలిటీ కలిగి ఉంది మరియు ఫిట్టింగ్ పరంగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఇన్‌లైన్ మైక్ సపోర్ట్ ఆప్షన్ ఉంది.

Best Mobiles in India

English summary
Top and Best wired earphones to buy in india. take a look on them.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X