తక్కువ ధరతో 10,000mAh పవర్ బ్యాంకులు

|

స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లోకి విడుదల అయినప్పటి నుండి అవి అందించే అన్ని రకాల ఫీచర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున బ్యాటరీ అయిపోతున్నట్లు మీరు నిరంతరం కనుగొంటారు. మీరు ఏదైనా దూరపు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ ను వినియోగించడం ఆపడం కుదరదు.

 పవర్ బ్యాంకులు

అటువంటి సమయాలలో బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం పోర్టబుల్ పవర్ బ్యాంకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క బ్యాటరీ పరిమాణం విషయానికి వస్తే ఇవి 10,000mAh తో వస్తుంది. ఇది అన్ని రకాల అవసరాలకు సరిపోతుంది. 10,000mAh శక్తిని కలిగి ఉండి తక్కువ ధరను కలిగి వున్న పవర్ బ్యాంకుల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్‌ ఎలా ఉందొ చూడండిటాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్‌ ఎలా ఉందొ చూడండి

 

 

అంబ్రేన్ క్యాప్సూల్ -10K

అంబ్రేన్ క్యాప్సూల్ -10K

అంబ్రేన్ క్యాప్సూల్ 10K పవర్ బ్యాంక్ లిథియం పాలిమర్ ను కలిగి ఉంటుంది. ఇది దీని పేరుకు సూచించినట్లుగా ఇది 10,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని మీద ఆధారపడి మీ ఫోన్‌ను అనేకసార్లు ఛార్జ్ చేయవచ్చు. ఇది మన్నికకు బలమైన విశ్వాసాన్ని ఇచ్చే ABS ప్లాస్టిక్ చేత తయారు చేయబడి ఉంటుంది. ఇది చాలా కంఫోర్ట్ గా ఉండి ప్రయాణ సమయంలో మీతో పాటు తీసుకెళ్లడం చాలా సులభం కాబట్టి మీరు దానిని మీ బ్యాగ్‌లో ఉంచి దాని గురించి మరచిపోవచ్చు. దీని లోపల ఉన్న చిప్‌సెట్ 9-పొరల రక్షణను కలిగి ఉండి పవర్ బ్యాంక్ యొక్క భద్రతను నిర్ధారిస్తుంది. ఇది 2 USB పోర్ట్‌లను కలిగి ఉండి 5V / 2.4A గరిష్ట ఉత్పత్తితో ఛార్జ్ చేస్తుంది. క్యాప్సూల్ 10K లో ఎల్ఈడి ఛార్జింగ్ ఇండికేటర్ ఉంటుంది. ఇది మీ పవర్ బ్యాంక్ ఎంత బ్యాటరీని కలిగి ఉందో చూపిస్తుంది. దీని ధర విషయానికి వస్తే ఇది రూ.649 ధర వద్ద దీనిని అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

 

 

మోటరోలా రేజర్‌ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్మోటరోలా రేజర్‌ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్

షియోమి Mi 10000mAH 2i

షియోమి Mi 10000mAH 2i

షియోమి Mi 2i 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో సొగసైన మరియు కాంపాక్ట్ పవర్ బ్యాంక్. ఇది 18W వరకు వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతునిస్తుంది. అంటే 12V / 1.5A, 5V / 2A మరియు 9V / 2A తో సహా పలు రకాల అవుట్‌పుట్‌లను అందిస్తుంది. ఇది అల్యూమినియం మిశ్రమం నుండి తయారు చేయబడి దాని ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. అంబ్రేన్ క్యాప్సూల్ 10K మాదిరిగా Mi 2i కూడా 9 పొరల రక్షణను కలిగి ఉంటుంది. ఇందులో షార్ట్-సర్క్యూట్, ఓవర్-వోల్టేజ్, ఓవర్-కరెంట్ వంటి ఇతర సమస్యలతో ఎటువంటి భయం లేదని నిర్ధారించుకోండి. ఈ పవర్ బ్యాంక్‌ను వేగంగా ఛార్జ్ చేయవచ్చు. కేవలం 4.5 గంటల్లో దీని పూర్తి రీఛార్జీని పొందవచ్చు. Mi 2i వివిధ రకాల కలర్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. దీనిని రూ.899 ల ధర వద్ద అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

 

కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్

సిస్కా పవర్ పాకెట్ 100

సిస్కా పవర్ పాకెట్ 100

సిస్కా పవర్ పాకెట్ 100 పవర్ బ్యాంక్ 3 USB పోర్టులను కలిగి ఉంటుంది. ఈ మూడింటిని కూడా ఒకే సమయంలో ఉపయోగించవచ్చు. ఇంటెలిజెంట్ మల్టీ-ప్రొటెక్షన్ సర్క్యూట్లు, అడ్వాన్స్‌డ్ కరెంట్ షంట్ మరియు ఐసి ప్రొటెక్షన్ వంటి అన్ని రకాల రక్షణలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్ మరియు ఓవర్-డిశ్ చార్జింగ్‌ను నివారిస్తుంది. పవర్ బ్యాంక్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయడానికి సాఫ్ట్ టచ్ బటన్ కూడా ఉంది. Mi 2i మరియు అంబ్రేన్ క్యాప్సూల్ 10K లలో లేనిది ఒక LED. ఇది వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనప్పటికీ పవర్ సాకెట్ 100 తక్కువ ధర ఎంపిక వద్ద గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాయి. దీనిని రూ.799 ధర వద్ద అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

 

VoWiFi సర్వీసును షియోమి ఫోన్‌లలో యాక్టివేట్ చేయడం ఎలా?VoWiFi సర్వీసును షియోమి ఫోన్‌లలో యాక్టివేట్ చేయడం ఎలా?

జింక్ టెక్నాలజీస్ Z10KI

జింక్ టెక్నాలజీస్ Z10KI

జింక్ టెక్నాలజీస్ Z10KI లిథియం-అయాన్ పవర్ బ్యాంక్ 3 USB అవుట్ పుట్లను ఒకొక్కటి 5V / 2.1A తో కలిగి ఉంటుంది. సిస్కా పవర్ పాకెట్ 100 మాదిరిగానే Z10KIలో కూడా LED టార్చ్ కలిగి ఉంది. ఎల్‌ఈడీ సూచికల ద్వారా పవర్ బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉందో మీరు అంచనా వేయవచ్చు. ఇది డ్యూయల్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంటే మీరు పవర్ బ్యాంక్‌తో ఇతర పరికరాలను ఛార్జ్ చేసేటప్పుడు కూడా దీనిని ఛార్జ్ చేయవచ్చు. జింక్ Z10KI ని బ్లాక్ మరియు వైట్ కలర్ ఎంపికలలో పొందవచ్చు. మీరు ఈ పవర్ బ్యాంక్‌ను 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనిని ఇప్పుడు రూ.499 ధర వద్ద అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

అంకెర్ పవర్‌కోర్ సెలెక్ట్ 10000

అంకెర్ పవర్‌కోర్ సెలెక్ట్ 10000

అంకెర్ పవర్‌కోర్ సెలెక్ట్ 10000 పవర్ బ్యాంక్ గరిష్టంగా 12W ఉత్పత్తితో 2USB పోర్ట్‌లను కలిగి ఉంది. రెండు పోర్టులలో పవర్‌ఐక్యూ మరియు వోల్టేజ్‌బూస్ట్ టెక్నాలజీలతో ఉన్నాయి. PowerIQ అనేది అంకర్ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ. ఇది ప్లగిన్ చేయబడిన పరికరాన్ని గుర్తించి ఆపై సాధ్యమైనంత వేగంగా ఛార్జ్ చేస్తుంది.దురదృష్టవశాత్తు ఇది చాలా ఖరీదైనది. అలాగే ఇందులో టార్చ్ లేదు. పవర్ బ్యాంక్‌లో ఎంత శక్తి మిగిలి ఉందో చూపించే ఎల్‌ఈడీ ఇండికేటర్ పవర్ బటన్‌పైన కుడివైపు ఉంది.

Best Mobiles in India

English summary
Top Five 10,000mAh Power Banks at offerable Prices in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X