మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్స్, గాడ్జెట్స్ ఇవే !

స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే.

|

స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ప‌లు ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు త‌మ త‌మ నూత‌న స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్ర‌ద‌ర్శించాయి. శాంసంగ్‌, ఎల్‌జీ, మైక్రోసాఫ్ట్‌, షియోమి, హెచ్‌ఎండీ గ్లోబల్‌, హువాయి లాంటి కంపెనీలు తమ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి.ముఖ్యంగా ఎండ‌బ్ల్యూసీ 2019 షోలో శాంసంగ్‌కు పోటీగా హువాయి ఫోల్డ‌బుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది.ఎల్‌జీ జీ8 థింక్యూ, వన్‌ ప్లస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను ప్ర‌ద‌ర్శించింది. అలాగే హెచ్ఎండీ గ్లోబ‌ల్ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్ల‌స్‌ను, సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్ల‌స్ , ఎల్‌3 ఫోన్ల‌ను, బ్లాక్‌బెర్రీ కీ 2 రెడ్‌ ఎడిషన్‌ను పరిచయం చేసింది. పూర్తి వివరాల్లోకెళితే..

ప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపించిన రిలయన్స్ జియోప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపించిన రిలయన్స్ జియో

Samsung S10 5G

Samsung S10 5G

ఆపిల్‌కు పోటీగా, ప్రీమియం ఫీచర్లతో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10 ​ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది. ఎస్‌ 10ప్లస్‌, ఎస్‌ 10, ఎస్‌10ఈ డివైస్‌లను మార్చి 8న నుంచి దేశీయంగా అందుబాటులోకి తీసుకొస్తామని శాంసంగ్‌ ఇండియా తెలిపింది. 1 టీబీ, 512 జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఎస్‌ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.1,17,900, రూ. 91,900 రూ. 73,900గా ఉండనున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10 ధర 128జీబీ వేరియంట్‌ రూ.66,900, 512 జీబీ వేరియంట్‌ ధర్‌ రూ. 84,900గా ఉండనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10ఈ రూ. 55,900లకు లభించనుంది.

Sony Xperia1

Sony Xperia1

సోనీ కంపెనీ సరికొత్త టెక్నాలజీ , అద్భుతమైన ఫీచర్లతో సోనీ ఎక్స్‌ పీరియా 1ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జ‌రుగుతున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 ప్ర‌దర్శ‌న‌లో లాంచ్‌ చేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఐ ఫోటో ఫోకస్‌ టెక్నాలజీతో తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 74200గా ఉంటుందని అంచనా. బ్లాక్‌, పర్పుల్‌, గ్రే, వైట్‌ కలర్స్‌లో లభ్యం.

 

 

HTC booth

HTC booth

HTC కంపెనీ బేస్ వీఆర్ హెడ్ సెట్ ని ఈ ఈవెంట్లో పరిచయం చేసింది. యూజర్ ఇవి పెట్టుకుని బేస్ బాల్ ఆడుతున్న ఫోటోని చూడవచ్చు.

షియోమి

షియోమి

షియోమి కంపెనీ కూడా కొత్త టెక్నాలజీతొ అదిరిపోయో వీఆర్ హెడ్ సెట్ లాంచ్ చేసింది.విజిటర్ టెస్ట్ చేస్తున్న ఫోటోని కూడా చూడవచ్చు.

నూబియా ఆల్ఫా

నూబియా ఆల్ఫా

స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) లో నూబియా తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Nubia Alpha wearable smartphoneను ప్రదర్శనకు ఉంచింది.

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

టూ సీటర్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్ ని ఈ ప్రదర్శనలో ఉంచారు.

శాంసంగ్ ఫోల్డ్ ఫోన్

శాంసంగ్ ఫోల్డ్ ఫోన్

అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొదటి మడత పెట్టగల (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఫోల్డ్‌' పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Top smartphones, gadgets from Mobile World Congress 2019 More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X