Home
Gadgets

రూ.3000 కంటే తక్కువ ధరలో TWS ఇయర్‌బడ్స్‌.. డిజైన్‌, ఫీచర్‌లు, బ్యాటరీ లైఫ్‌ పూర్తి వివరాలు.. !

పండుగ సీజన్‌ సందర్భంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024, ఫ్లి్ప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 ప్రస్తుతం జరుగుతున్నాయి. దీంతోపాటు అనేక సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ప్రస్తుతం అనేక బ్రాండ్‌ల ఇయర్‌బడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) ఫీచర్‌తో అనేక ఇయర్‌బడ్స్‌ లభిస్తుంది. రూ.3000 కంటే తక్కువ ధరలో ANC తో కూడిన TWS ఇయర్‌బడ్స్‌ (Earbuds Under RS3000) అందుబాటులో ఉన్నాయి.

క్లింక్ వాయిస్‌బడ్స్‌ (Clink Voice Buds) : మెరుగైన కాల్‌ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ కావాలని భావించే వారికి ఈ ఇయర్‌బడ్స్‌ అనుకూలంగా ఉంటాయి. మరియు ఎక్కువ సమయం వినియోగించుకొనేందుకు వీలుగా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ క్లింక్ ఆడియో TWS వాయిస్‌బడ్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో 6 HD మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.

clink-audio-voicebuds

క్లింక్ TWS వాయిస్‌బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా 60 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ ర్యాపిడ్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. అన్ని సందర్భాల్లో కాల్ క్వాలిటీ కోసం AI నాయిస్‌ క్లాసిఫైయర్‌ అల్గారిథమ్‌ ను కలిగి ఉంది. ధర రూ.2499 గా ఉంది.

రియల్‌మి బడ్స్ T300 (Realme Buds T300) : ఈ రియల్‌మి బడ్స్‌ 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ 30dB వరకు యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ సపోర్టు, 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో సపోర్టును కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది.

clink-audio-voicebuds

ఈ బడ్స్‌ బ్లూటూత్‌ 5.3 పైన పనిచేస్తాయి. రియల్‌మి బడ్స్ T300 ఇయర్‌బడ్స్‌ను సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా గరిష్ఠంగా 40 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ బడ్స్‌ ధర రూ.2,199 గా ఉంది. తక్కువ ధరలోనే మెరుగైన ఫీచర్‌లతో ఈ బడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ సమయం వినియోగించుకోవచ్చు.

రెడ్‌మి బడ్స్‌ 5 (Redmi Buds 5) : ఈ రెడ్‌మి బడ్స్‌ టైటానియం ప్లేటింగ్‌తో కూడిన 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టుతో అందుబాటులో ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేయడం ద్వారా 38 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ బడ్స్‌ ధర రూ.2,199 గా ఉంది.

clink-audio-voicebuds

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 (OnePlus Nord Buds 2) : ఇయర్‌బడ్స్‌ 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ సపోర్టును కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 36 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2.. IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. రూ.3,000 కంటే తక్కువ ధరలో ఈ బడ్స్‌ మంచి ఎంపిక కానుంది. ఎక్కువ సమయం వినియోగానికి అనువుగా ఉంటాయి. ఈ వన్‌ప్లస్‌ బడ్స్‌ను రూ.1999 కు కొనుగోలు చేయవచ్చు.

బోట్‌ నిర్వానా స్పేస్‌ (Boat Nirvana Space) : ఈ బడ్స్‌ 10mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. హైబ్రిడ్ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), 360 డిగ్రీ స్పేషియల్‌ ఆడియో సపోర్టుతో అందుబాటులో ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 100 గంటలపాటు వినియోగించుకోవచ్చని బోట్‌ సంస్థ చెబుతోంది. ఈ బడ్స్‌ ధర రూ.1898 గా ఉంది.

దీంతోపాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2r ను రూ.1599 కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్‌ 12.4mm టైటానియం కోటింగ్‌తో కూడిన డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంటాయి. మరియ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 38 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Top Tws earbuds under RS3000 price range features battery life and sale full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X