Home
Gadgets

Unix Notes ధర రూ.699 కే 99 గంటల ప్లేటైంతో నెక్‌బ్యాండ్‌.. మాగ్నటిక్ డిజైన్‌, బ్లూటూత్ 5.3 తో విడుదల..!

భారత్‌ మార్కెట్లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ లను మంచి డిమాండ్ ఉంది. ఎంట్రీ లెవల్‌ ధర నుంచి ప్రీమియం వెర్షన్‌ల వరకు అధిక స్థాయిలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా హెడ్‌ఫోన్స్‌, ఎయిర్‌పాడ్స్, నెక్‌బ్యాండ్స్‌ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా ఆడియో ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో ధర సహా బ్యాటరీ లైఫ్‌, కంఫర్ట్‌ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల నెక్‌బ్యాండ్స్‌ తరహా ఆడియో ఉత్పత్తులను తయారీ చేసే సంస్థలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటున్నాయి.

తాజాగా Unix సంస్థ ఏకంగా 99 గంటల ప్లేటైంతో నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది. యునిక్స్‌ నోట్స్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ (Unix Notes Wireless Neckband Launched) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లూటూత్ 5.3 వెర్షన్‌ తో పనిచేస్తుందని తెలిపింది. ఈ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ మాగ్నటిక్‌ డిజైన్‌ ను కలిగి ఉంది.

Unix Notes Wireless Neckband with 99 hours play time launched

యునిక్స్‌ నోట్స్ నెక్‌బ్యాండ్‌ ఫీచర్‌లు :
ఈ నెక్‌బ్యాండ్‌ 11mm ఆడియో డ్రైవర్‌లను కలిగి ఉంది. యునిక్స్‌ నోట్స్‌ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ యాంటీ స్లిప్‌ సిలికాన్‌ బ్యాండ్‌, మెటాలిక్‌ ఇయర్‌బడ్స్‌ను కలిగి ఉంది. చెమట, వర్షం నీటి రక్షణతో అందుబాటులోకి వచ్చింది.

ఈ యునిక్స్‌ నోట్స్‌ నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ 5.3 తో పనిచేస్తుంది. ఈ బ్లూటూత్‌ 10 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. ఈ నెక్‌బ్యాండ్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ ను సపోర్టు చేస్తుంది. మాగ్నటిక్‌ డిజైన్‌ తో అందుబాటులో ఉంది. ఫలితంగా బడ్స్‌ను అటాచ్‌ చేయడం ద్వారా నెక్‌బ్యాండ్‌ ను ఆఫ్‌ చేయవచ్చు. వేరుచేయడం ద్వారా ఆన్‌ చేయవచ్చు.

Unix Notes Wireless Neckband with 99 hours play time launched

ఈ నెక్‌బ్యాండ్‌ బిల్ట్ ఇన్‌ మైక్రోఫోన్‌ ను కలిగి ఉంది. దీంతో క్లియర్‌ వాయిస్‌ ట్రాన్సిమిషన్‌ తో కూడిన HD సౌండ్‌, డీప్‌ బాస్‌ వంటి ఫీచర్‌లను పొందవచ్చు. ఫలితంగా సంగీతం వింటున్న సందర్భాలు, కాలింగ్‌, గేమింగ్‌ సమయంలో ఎంతో సౌకర్యంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. మరియు మెరుగైన గేమింగ్‌ అనుభూతిని పొందేందుకు లో-లేటెన్సీ ఆడియో ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది.

2500 గంటల స్టాండ్‌బై టైం :
యునిక్స్‌ నోట్స్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ 350mAh Li-ion బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 99 గంటల Play time ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. 2500 గంటల స్టాండ్‌బై టైం అందిస్తుందని యునిక్స్ చెబుతోంది. పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 60 నిమిషాల సమయం పడుతుందని సంస్థ తెలిపింది. టైప్‌-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

యునిక్స్‌ నోట్స్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ ధర, సేల్‌ వివరాలు :
యునిక్స్‌ నోట్స్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ (UX-W400) ను భారత్‌ మార్కెట్‌లో (Unix Notes Wireless Neckband price and Sale) ధర రూ.699 కు కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుతం Unix అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉందని వెల్లడించింది. బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉందని వెల్లడించింది.
Image Source : Unixindia

More from GizBot

Best Mobiles in India

English summary
Unix Notes Wireless Neckband with 99 hours play time launched in india features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X