80W అవుట్‌పుట్‌తో సౌండ్‌బార్.. పోర్టబుల్ డిజైన్, పనోరమిక్ 3D సౌండ్ సహా మరెన్నో ఫీచర్లు..!
భారత్ మార్కెట్‌లో ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా అనేక సంస్థలు యూజర్లను ఆకట్టుకొనే విధంగా మెరుగైన ఫీచర్‌లతో లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆడియో ఉత్పత్తులు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ అర్బన్ హార్మోనిక్ 2080 సౌండ్‌బార్ (Urban Harmonic 2080 Soundbar) విడుదల అయింది. సబ్‌ఊఫర్, సౌండ్ బార్‌తో అందుబాటులోకి వచ్చింది. మెరుగైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని అర్బన్ తెలిపింది. ఈ సౌండ్‌బార్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
అర్బన్ హార్మోనిక్ 2080 స్పెసిఫికేషన్‌లు :
అర్బన్ హార్మోనిక్ 2080 సౌండ్‌బార్.. డీప్‌బాస్ కోసం సబ్‌ఊఫర్ (వైర్) తో కనెక్ట్ చేసి ఉంటుంది. మరియు అడ్వాన్స్‌డ్ డ్యూయల్ ఆడియో డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. మొత్తంగా 80W అవుట్‌పుట్‌ను అందిస్తుందని అర్బన్ చెబుతోంది. ఇంట్లో, చిన్న పార్టీలకు అనువుగా ఉంటుంది.

ఈ అర్బన్ హార్మోనిక్ 2080 సౌండ్‌బార్.. మ్యూజిక్ ట్రాక్స్ మార్చుకొనేందుకు, ప్లే, పాజ్, వాల్యూమ్ నియంత్రణ కోసం ప్రత్యేక టచ్ కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. వాల్యూమ్, మోడ్, ప్లేబ్యాక్ నియంత్రణ కోసం రిమోట్ ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ సౌండ్‌బార్ కనెక్షన్ స్టేటస్ తెలుసుకొనేందుకు LED ఇండికేటర్‌ను కలిగి ఉంది.
ఈ సౌండ్‌బార్ పోర్టబుల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫలితంగా నచ్చిన చోట అమర్చుకోవచ్చు. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం ఈ సౌండ్‌బార్ బ్లూటూత్ 5.3 ను సపోర్టు చేస్తుంది. వినియోగించని సమయంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు వీలుగా స్మార్ట్ స్టాండ్‌బై మోడ్‌ను కూడా కలిగి ఉంది.
ఈ సౌండ్‌బార్ పనోరమిక్ 3D సౌండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా 360 డిగ్రీల సౌండ్ ఎక్పీరియన్స్ మరియు స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్‌ను అందిస్తుందని అర్బన్ చెబుతోంది. సినిమాలు, న్యూస్, మ్యూజిక్, గేమింగ్ కోసం ఈ సౌండ్‌బార్ నాలుగు ప్రత్యేకమైన EQ మోడ్స్ ను సపోర్టు చేస్తుంది.
అర్బన్ హార్మోనిక్ 2080 సౌండ్‌బార్ ను ఇతర డివైజ్‌లతో సులభంగా కనెక్ట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ సౌండ్‌బార్‌ను HDMI ARC, AUX మరియు USB పోర్ట్‌ల ద్వారా మొబైల్, టీవీ, గేమింగ్ కన్సోల్ ను కనెక్ట్ చేయవచ్చు. ఫలితంగా మెరుగైన అనుభూతిని అందిస్తుంది.
అర్బన్ హార్మోనిక్ 2080 సౌండ్‌బార్ భారత్ మార్కెట్‌లో ప్రారంభ ఆఫర్ లో భాగంగా రూ.6999 కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అర్బన్ సంస్థ వెబ్‌సైట్ gourban.in లో కొనుగోలు చేయవచ్చు. త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
అర్బన్ నుంచి భారత్ మార్కెట్‌లో గతంలో స్మార్ట్ బడ్స్ లాంచ్ అయ్యాయి. విడుదల సమయంలో రూ.2499 కే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 48 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మరియు 150 గంటల Standby టైమ్‌ను అందిస్తుంది.
అర్బన్ స్మార్ట్ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్, స్పేషియల్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్వాడ్ మైక్, 32dB వరకు ANC, ENC ఫీచర్‌లు కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్ 1.47 అంగుళాల LED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని ద్వారా AI వాయిస్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. మ్యూజిక్, కెమెరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








