ఛార్జింగ్ కేస్ పైన LED స్క్రీన్, 48 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
భారత్ మార్కెట్‌లోకి మరో కొత్త ఇయర్‌బడ్స్ ఇవాళ విడుదల అయ్యాయి. అర్బన్ స్మార్ట్ బడ్స్ (Urban Smartbuds) పేరుతో లాంచ్ అయ్యాయి. ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్ LED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఏకంగా 48 గంటలపాటు వినియోగించుకోవచ్చు. మరియు 150 గంటలపాటు Standby టైంతో అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ సిలికాన్ టిప్స్‌తో కూడిన ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్వాడ్ మైక్‌లతో లాంచ్ అయ్యాయి.
బడ్స్ ధర, సేల్ వివరాలు :
అర్బర్ స్మార్ట్ బడ్స్ ప్రస్తుతం భారత్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ బడ్స్‌ను రూ.2499 కే విక్రయిస్తున్నారు. కేవలం తెలుపు రంగులో మాత్రమే లభిస్తున్నాయి.

అర్బన్ స్మార్ట్ బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
అర్బన్ స్మార్ట్ బడ్స్ 13mm డ్రైవర్స్, సిలికాన్ టిప్స్‌తో కూడిన ఇన్ ఇయర్ డిజైన్‌తో విడుదల అయ్యాయి. ఈ బడ్స్ ఇన్-ఇయర్ డిటెక్షన్ ఫీచర్ మరియు స్పేషియల్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి.
ఈ స్మార్ట్‌బడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్వాడ్ మైక్స్, 32dB వరకు ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) మరియు ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ANC ఫీచర్‌లో.. ఆఫ్, అడాప్టివ్, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్పరెన్సీ వంటి నాలుగు ఆప్షన్‌లున్నాయి.

అర్బన్ స్మార్ట్ బడ్స్ ఓ సూపర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్ 1.47 అంగుళాల LED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని ద్వారా AI వాయిస్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ స్క్రీన్ నుంచి మ్యూజిక్, కెమెరాను నియంత్రించవచ్చు. దీంతోపాటు ఈ LED స్క్రీన్ ద్వారా వాతావరణ సమాచారం, ఇతర నోటిఫికేషన్‌లను పొందవచ్చు. అర్బన్ స్మార్ట్‌బడ్స్ HereFit యాప్‌ను సపోర్టు చేస్తాయి.
అర్బన్ స్మార్ట్ బడ్స్ నాలుగు Preset EQ.. రాక్, పాపులర్, జాజ్, బల్లా్‌డ్ వంటి నాలుగు మోడ్స్‌ను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఫైండ్ మై ఫోన్ సపోర్టుతో GPS పొజిషనర్‌ను అమర్చబడి ఉంటుంది. ఈ బడ్స్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 48 గంటలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. లేదా 150 గంటల Standby సమయాన్ని అందిస్తుందని పేర్కొంది. మరియు USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








