బ‌డ్జెట్ ధ‌ర‌లో ViewSonic గేమింగ్ మానిట‌ర్ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షాకే!

|

భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ నానాటికీ భారీగా అభివృద్ధి చెందుతోంది. 2026 నాటికి $5 బిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక బ్రాండ్‌లు ఇప్పుడు భారతదేశంలో గేమర్‌లు మరియు స్ట్రీమర్‌లను ఆకర్షించడానికి తమ గేమింగ్-ఫోకస్డ్ కంప్యూటర్ పెరిఫెరల్స్‌ను విస్త‌రిస్తున్నాయి. తాజాగా, తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌ ViewSonic, కొత్త VX2405-P-MHD గేమింగ్ మానిటర్‌ను భార‌త మార్కెట్లో లాంచ్ చేసింది.

 
బ‌డ్జెట్ ధ‌ర‌లో ViewSonic గేమింగ్ మానిట‌ర్ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షా

ఈ మానిట‌ర్‌ 24-అంగుళాల డిస్‌ప్లే తో, 144Hz రిఫ్రెష్ రేట్ తో వ‌స్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. మీరు ఈ మానిటర్‌ని Windows మరియు macOS ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఉపయోగించవచ్చు అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, దీనికి స్టీరియో స్పీకర్లు మ‌రియు ఇతర అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అందిస్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

వ్యూసోనిక్ యొక్క కొత్త గేమింగ్ మానిట‌ర్ ఇండియా లాంచ్ సందర్భంగా కంపెనీ ఈ విధంగా పేర్కొంది. 'కొత్త గేమింగ్ మానిటర్, VX2405-P-MHD అద్భుతమైన డిస్‌ప్లే నాణ్యతతో అనేక రకాల ఫీచర్‌లను అందిస్తోంది. అద్భుతమైన‌ గేమింగ్ అనుభవం కోసం దీన్ని రూపొందించాం.' అని కంపెనీ పేర్కొంది.

బ‌డ్జెట్ ధ‌ర‌లో ViewSonic గేమింగ్ మానిట‌ర్ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షా

ViewSonic VX2405-P-MHD గేమింగ్ మానిట‌ర్‌ ధర, లభ్యత:
ఈ ViewSonic VX2405-P-MHD గేమింగ్ మానిటర్ ధరను భార‌త మార్కెట్లో కంపెనీ రూ.24,930గా నిర్ణ‌యించింది. కంపెనీ మానిటర్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫ‌ర్‌ల‌ను అందిస్తోంది. Amazon India యొక్క 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' ఈవెంట్‌లో మీరు కేవలం రూ.12,499కి పొందవచ్చు. అదనంగా, మీరు ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ViewSonic VX2405-P-MHD మానిట‌ర్‌ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ViewSonic-P-MHD గేమింగ్ మానిటర్ ఫుల్ HD (1920x 1080) రిసొల్యూష‌న్‌తో 24-అంగుళాల IPS ప్యానెల్‌ను కలిగి ఉంది. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరియు 1ms (MPRT) రెస్పాన్స్ టైంతో వేగవంతమైన యాక్షన్ అందిస్తుంది. అంతేకాకుండా, రేసింగ్ గేమ్‌లలో సున్నితమైన మరియు ఫ్లికర్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా, ViewSonic VX2405-P-MHD మానిట‌ర్‌ 80M:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియోను కలిగి ఉంది. కంపెనీ యొక్క సూపర్‌క్లియర్ IPS ప్యానెల్ అద్బుత‌మైన గేమింగ్ మరియు వీడియో వీక్ష‌ణ అనుభవం కోసం పంచ్ క‌ల‌ర్స్‌ మరియు మెరుగైన కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.

బ‌డ్జెట్ ధ‌ర‌లో ViewSonic గేమింగ్ మానిట‌ర్ లాంచ్‌.. ఫీచ‌ర్లు చూస్తే షా

ఈ గేమింగ్ మానిటర్ 19 x 54 x 41 సెం.మీ కొలతలు కలిగి ఉంది. మరియు ఇది న‌లు వైపులా స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. ఇది నలుపు రంగులో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. దీని బ‌రువు సుమారు 3.5 కిలోల వ‌ర‌కు ఉంటుంది. వినియోగదారులు గేమింగ్, ఎడిటింగ్ మరియు చలనచిత్రాల వంటి నిర్దిష్ట పనుల కోసం అభివృద్ధి చేసిన వ్యూమోడ్ ప్రీసెట్‌లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

క‌నెక్టివిటీ విష‌యానికొస్తే.. ViewSonic VX2405-P-MHD గేమింగ్ మానిటర్‌లో డిస్‌ప్లేపోర్ట్, HDMI, కెన్సింగ్టన్ లాక్, 3.5mm ఆడియో పోర్ట్ మరియు 2W డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మ‌రిన్ని ముఖ్య ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. మానిటర్ 1.5 మీటర్ల పవర్ కేబుల్, 1.5 మీటర్ల HDMI కేబుల్ మరియు క్విక్ స్టార్ట్ గైడ్‌తో ప్యాక్ చేయ‌బ‌డి వ‌స్తుంది. మీరు ఈ మానిటర్‌ని Windows మరియు macOS ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఉపయోగించవచ్చు.

 

ఈ ViewSonic VX2405-P-MHD గేమింగ్ మానిటర్ ధరను భార‌త మార్కెట్లో కంపెనీ రూ.24,930గా నిర్ణ‌యించింది. కంపెనీ మానిటర్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫ‌ర్‌ల‌ను అందిస్తోంది. Amazon India యొక్క 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' ఈవెంట్‌లో మీరు కేవలం రూ.12,499కి పొందవచ్చు. అదనంగా, మీరు ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
ViewSonic VX2405-P-MHD Gaming Monitor Launched in india with budget price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X