Home
Gadgets

42 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC ఫీచర్‌తో వివో ఇయర్‌బడ్స్‌.. ధర, సేల్‌ వివరాలు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ ల తయారీ సంస్థ వివో (Vivo India) భారత్‌లో తాజాగా వివో TWS 3e ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో ఈ ఇయర్‌బడ్స్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, టచ్‌ కంట్రోల్స్‌, గూగుల్‌ ఫాస్ట్ పెయిర్ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌, మెరుగైన ఫీచర్‌ లతో విడుదలయ్యాయి. సింగిల్‌ ఛార్జింగ్‌ తో గరిష్ఠంగా 42 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది.

వివో TWS 3e ఇయర్‌బడ్స్‌ ఫీచర్‌లు :
ఈ వివో కొత్త ఇయర్‌బడ్స్‌ (Vivo TWS 3e Earbuds) ఆకర్షణీయమైన డిజైన్‌ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్‌ బయోఫైబర్‌ డయాఫ్రమ్‌ మరియు 11mm సౌండ్ యూనిట్‌లో తయారుచేశారు.

Vivo TWS 3e Earbuds

వివో TWS 3e ఇయర్‌బడ్స్‌ 30dB నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను (ANC) కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్‌ ద్వారా గరిష్ఠంగా 73 శాతం బ్యాగ్రౌండ్‌ నాయిస్‌ను తగ్గిస్తుంది. ఎయిర్‌ డక్ట్‌ డిజైన్‌తో కూడిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత AI కాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్‌ పైన పనిచేస్తుంది. విండ్‌ నాయిస్‌ రిడక్షన్ ఫీచర్‌ కూడా ఉంది. దీని ద్వారా కాలింగ్‌ సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చు.

పది నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల.. :
ఈ వివో ఇయర్‌బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండనున్నాయి. ANC ఫీచర్‌ ఆఫ్‌ చేసి వినియోగిస్తే గరిష్ఠంగా 42 గంటలపాటు పనిచేస్తుంది. అదే ANC ఫీచర్‌ ఆన్‌ చేసి వినియోగిస్తే 36 గంటలపాటు వినియోగించుకోవచ్చు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల వరకు మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ సమయాన్ని అందిస్తుందని వివో చెబుతోంది.

అనేక ఫీచర్‌లు :
ఈ వివో TWS ఇయర్‌బడ్స్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్ ఫాస్ట్‌ పెయిర్‌, Wearing Detection, ఫైండ్‌ మై ఇయర్‌ఫోన్స్‌ (ఇయర్‌బడ్స్‌ ఎక్కడ ఉన్నాయో గుర్తించే ఫీచర్‌), స్మార్ట్‌ టచ్‌ కంట్రోల్స్‌ వంటి అనేక ఫీచర్లున్నాయి. ఈ బడ్స్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చాయి.

వివో TWS 3e ఇయర్‌బడ్స్‌ ధర, సేల్‌ వివరాలు :
వివో TWS 3e ఇయర్‌బడ్స్ ధర భారత్‌ మార్కెట్‌లో రూ.1899 గా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ వైట్‌, బ్లాక్‌ రంగుల్లోనే అందుబాటులో ఉన్నాయి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo Tws 3e earbuds sale is live on flipkart features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X