సగానికి తగ్గిన వొడాఫోన్ వై-ఫై హాట్‌ స్పాట్ ధర

రిలయన్స్ జియో‌ఫై (Reliance JioFi), ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ (Airtel 4G Hotspot)లకు పోటీగా వొడాఫోన్ ఇండియా కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ చేసిన వొడాఫోన్ 4జీ మొబైల్ వై-ఫై డివైస్ (Vodafone 4G Mobile Wi-Fi Device) భారీ ధర తగ్గింపును అందుకుంది.

Read More : ఈ ఫోన్ ధర రూ.5,999, సంవత్సరంలోపు రిపేర్ వస్తే కొత్తది ఇచ్చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.2,700 తగ్గింది...

లాంచ్ సమయంలో ఈ డివైస్ ధర రూ.5099గా ఉండగా, ప్రస్తుత ధర మాత్రం రూ.2399గా ఉంది. వొడాఫోన్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 4జీ హాట్ స్పాట్ ధర రూ.300 తగ్గింది...

మరోవైపు ఎయిర్‌టెల్ కూడా తన 4జీ హాట్ స్పాట్ ధరను రూ.2300 నుంచి రూ.1999కు తగ్గించింది. జియో మాత్రం మొదటి నుంచి తన JioFi 3 డివైస్ ను రూ.1999 ధర ట్యాగ్ తో విక్రయిస్తోంది.

ఒకేసారి 10 డివైస్‌లతో కనెక్ట్ చేయవచ్చు

వొడాఫోన్ 4జీ మొబైల్ వై-ఫై‌ను ఒకేసారి 10 డివైస్‌లతో కనెక్ట్ చేయవచ్చు. డ్యుయల్ బ్యాండ్ చిప్‌తో వస్తోన్న డివైస్ 150 Mbps వేగంతో ఇంటర్నెట్‌ను ఆఫర్ చేయగలదు.

యాప్ ద్వారా అన్ని వివరాలను తెలుసుకునే అవకాశం....

‘Vodafone Mobile Wi-Fi Monitor' పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను ఈ వై-ఫై హాట్ స్పాట్‌లో ఏర్పాటు చేసారు. ఈ యాప్ ద్వారా కనెక్షన్‌కు సంబంధించిన సిగ్నల్ స్టామినా, డివైస్ బ్యాటరీ లెవల్, నెట్‌వర్క్ ఇంకా కనెక్షన్ స్టేటస్‌లను తెలుసుకునే వీలుంటుంది.

1500mAh బ్యాటరీ కెపాసిటీతో...

1500mAh బ్యాటరీ సెల్‌తో వస్తోన్న ఈ డివైస్ సింగిల్ చార్జ్ పై 6 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone 4G Mobile Wi-Fi Device Price Dropped. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot