వోడాఫోన్ GPS ట్రాకింగ్ కొత్త ప్రోడక్ట్ 'కర్వ్' గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు...

|

యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌లలో ఒకటైన వోడాఫోన్ కంపెనీ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు 'కర్వ్' అనే ట్రాకింగ్ కొత్త ప్రొడెక్టుని తయారుచేసింది. ఈ స్మార్ట్ GPS ట్రాకర్ అనేది దాదాపు దేనికైనా జోడించడానికి వీలుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. GPS ట్రాకింగ్ ప్రోడక్ట్ అనేది తరచుగా తమ వస్తువులను పోగొట్టుకునే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉత్పత్తితో వినియోగదారులు అన్ని రకాల విషయాలను ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మీ యొక్క పెంపుడు జంతువులను ట్రాక్ చేయగలదు. వోడాఫోన్ యొక్క కొత్త ట్రాకింగ్ ప్రోడక్ట్ 'కర్వ్' గురించి మీరు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వోడాఫోన్ GPS ట్రాకింగ్ 'కర్వ్' యొక్క స్పెసిఫికేషన్‌లు

వోడాఫోన్ GPS ట్రాకింగ్ 'కర్వ్' యొక్క స్పెసిఫికేషన్‌లు

వోడాఫోన్ కంపెనీ కొత్తగా విడుదల చేసిన GPS ట్రాకింగ్ కొత్త ప్రోడక్ట్ అంతర్నిర్మిత GPS వ్యవస్థను కలిగి ఉంటుంది. దీని యొక్క ఫీచర్‌లలో ముఖ్యమైనది పోగొట్టుకున్న ఏదైనా వస్తువులను కనుగొనడానికి వీలుగా ఇది శీఘ్ర హెచ్చరిక మరియు బీప్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ట్రాకర్ వాటర్ రెసిస్టెన్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీతో రన్ అవుతూ ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ ఆన్‌లో ఉన్నత కాలం విభిన్న ట్రాకింగ్ మోడ్‌లపై ఆధారపడి ఉంటుందని గమనించండి.

కీరింగ్ యాక్సిస్సోరీ

ఇది కీరింగ్ యాక్సిస్సోరీతో జోడించబడి ఉంటుంది. ఇది కీరింగ్‌ను ఒక ముఖ్యమైన వస్తువుతో లేదా మీ పెంపుడు జంతువు కాలర్‌తో జోడించడం ద్వారా ట్రాకింగ్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ ట్రాకర్‌ని ఉపయోగించడానికి మీకు సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఈ కొత్త ప్రోడక్ట్ అనేది స్మార్ట్ సిమ్‌ని కలిగి ఉంటుంది. ఇది నిరంతరం కంపెనీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. తద్వారా స్మార్ట్ డివైస్ అన్ని రకాల ఫీచర్‌లను ఉపయోగించగలదు మరియు మీ ఫోన్‌కి ఎప్పటికప్పటి అప్‌డేట్‌లను పంపగలదు. SIM ప్రమేయం ఉన్నందున ఫోన్ మరియు ట్రాకర్ మధ్య అధిక దూరం ఉన్నప్పటికీ కూడా డేటా బదిలీ చేయబడుతుంది.

ట్రాకింగ్ డేటా
 

ట్రాకింగ్ డేటాను చూడటానికి వినియోగదారులు వోడాఫోన్ స్మార్ట్ యాప్‌ను మీ యొక్క ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది వోడాఫోన్ యొక్క స్మార్ట్ SIMకి మద్దతు లేని దేశంలో ఉపయోగించగల ఉత్పత్తి కాదు. ఇండియాలో వోడాఫోన్ నెట్ వర్క్ అందుబాటులో ఉన్నకారణంగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఈ పరికరాన్ని కొనుగోలు చేసి దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో వంటి ఇతర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వోడాఫోన్ వెబ్‌సైట్‌లో కర్వ్ ప్రోడక్ట్ పేజీని సందర్శించవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నల విభాగంలో వోడాఫోన్ కర్వ్‌కు సంబంధించి మీకు అవసరమైన దాదాపు ప్రతి సమాధానాన్ని మీరు పొందుతారు.

GPS ట్రాకింగ్

వోడాఫోన్ యొక్క GPS ట్రాకింగ్ 'కర్వ్' ప్రోడక్ట్ అనేది రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఉత్తమ మార్గం కాదు. ఎందుకంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కావున బ్యాటరీ అనేది చాలా వేగంగా ఖాళీ చేయబడుతుంది. కానీ వినియోగదారులు వారి యొక్క ముఖ్యమైన వస్తువులను తరచూ ట్రాక్ చేయడం కోసం మార్కెట్ లో లభించే ఆపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు మరిన్ని ఇతర ఉత్పత్తులను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone New Smart GPS Tracker Curve Features and Specifications Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X